BigTV English

Intinti Ramayanam Today Episode : ఇంట్లో మొదలైన బర్త్ డే సెలెబ్రేషన్స్.. అక్షయ్ ను చంపాలని పల్లవి ప్లాన్..

Intinti Ramayanam Today Episode : ఇంట్లో మొదలైన బర్త్ డే సెలెబ్రేషన్స్.. అక్షయ్ ను చంపాలని పల్లవి ప్లాన్..

Intinti Ramayanam Today Episode December 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. బామ్మర్ది రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసి తాగడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాడు లేదంటే ఇంటికొచ్చేస్తానని అంటాడు కానీ రాజేంద్రప్రసాద్ నీ బెదిరింపులకు భయపడేవాన్ని కాదు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను అనేసి అంటాడు. ఆ వ్యక్తి పార్వతీకి ఫోన్ చేస్తాడు. అక్షయ్ కి నేను మేనమామ ని అక్షయ్ నీ కొడుకు కాదన్న విషయం నాకు తెలుసు నేను అందరికీ చెప్పను అందుకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలన్నట్టు డిమాండ్ చేస్తాడు. పార్వతి టెన్షన్ పడుతూ రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది. ఎవరో నాకు ఫోన్ చేసి అక్షయ్ నీ కొడుకు కాదని అంటున్నాడు ఎవరండీ మీకు నాకు అత్తయ్యకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అక్షయ్ నా కొడుకే ఈ విషయాన్ని నేను ఇన్ని రోజులు దాచి పెట్టానని తెలిస్తే వాడు నన్ను క్షమించడు.. ఈ విషయాన్ని నేను వారికి ఎలాగైనా చెప్పాలంటూ టెన్షన్ పడుతుంది పార్వతి. నీకు ఫోన్ చేసింది ఎవరో నాకు అర్థం అయిపోయింది పార్వతి వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అనేసి ధైర్యం చెప్తాడు. ఇక రాజేంద్రప్రసాద్ తన బామ్మర్ది దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తాడు. డబ్బులు మోహన విసిరి కొడతాడు.. అతను మాత్రం దెబ్బకు రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఇక ఇంటికి వస్తానని వెళ్ళిపోతాడు. ఇక నగలు కావాలని పార్వతి పల్లవిని తీసుకోమని చెబుతుంది. అవనికి తిరిగి తాళాలు ఇవ్వాలని అనుకుంటుంది. కానీ పార్వతి మాత్రం ఇవ్వొద్దని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ ఇంటికి రాగానే తన బామ్మర్ది అక్షయ్ గురించి నిజం చెప్తాడని ఆలోచిస్తుంటాడు అంతలోకే అతనికి గుండెపోటు వస్తుంది. ముందుగా అక్షయ వచ్చి నాన్న ఏమైంది మీకు గుండె నొప్పిగా ఉంది కదా హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతాడు పార్వతిని టాబ్లెట్స్ తీసుకు రమ్మని చెప్తాడు. పార్వతి టాబ్లెట్స్ ఇవ్వగానే నొప్పి తగ్గిపోతుంది అని అంటాడు కానీ ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటారు హాస్పిటల్ కి వెళ్దాం అని అడగ్గాని నాకు నొప్పి తగ్గింది ముందు అక్షయ్ బర్తడే వేడుకలకి సంబంధించిన అంత చూసుకోండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇంతకన్నా నా బర్త్ డే ఫంక్షన్ ఇంపార్టెంట్ కాదు నాన్న అని అక్షయ్ అంటాడు.. ఏం కాలేదని చెప్పాను కదా వెళ్లి మీ పనులు మీరు చూసుకోండి అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు..

ఇంట్లో బర్త్ డే వేడుకలను గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు. బయట డెకరేషన్ చూసి పార్వతీని రాజేంద్రప్రసాద్ మెచ్చుకుంటాడు డెకరేషన్ చాలా బాగుంది పార్వతి చాలా బాగా చేయించావు అనేసి అంటాడు. దానికి పార్వతి ఇదేముందండి నేను ఒకలా చెప్తే వాడు ఇంకొక లాక్ చెప్పాడు మా ఇద్దరి మధ్య భాష ప్రాబ్లం అది ఇంకొకలాగా తయారు చేసి పోయాడు అనేసి అంటుంది. బర్త్డే వేడుకను నేనే గ్రాండ్గా చేయాలనుకున్నాను. అందుకే చేశాను అనేసి అంటుంది ఇక భోజనాలు దగ్గరికి వెళ్లి భోజనాలు అందరూ మెచ్చుకునేలా ఉండాలి ఎక్కడ మాట రాకుండా చూసుకోవాలనేసి అంటుంది.. ఇక వెంటనే అవని వెళ్లి క్యాటరింగ్ అతనితో భోజనాలు ఎక్కడ మాట వచ్చేలాగా ఉండకూడదు చాలా బాగుండాలి ఐటమ్స్ అన్ని అని అంటుంది. ఇప్పుడే ఒక మేడం వచ్చి చెప్పారు మేడం భోజనాలు ఇలానే ఉండాలి అనేసి అనగానే ఎవరు అత్తయ్య అని అనుకుంటుంది.. ఇక అక్షయ అక్కడికొచ్చి నీకోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఎక్కడున్నావని అడుగుతున్నారు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే కేక్ కోసం ఆర్డర్ ఇచ్చానండి అతని కాల్ చేసి వస్తున్నాను అనేసి అంటుంది. అక్షయ్ మాత్రం కేక్ కట్ చేయడానికి నేను ఏమన్నా చిన్నపిల్లన్నా అనగానే ఆరాధ్యని పిలుస్తాను అనేసి అంటుంది అవని. నా కూతురు ముందు నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావా ఏం అవసరం లేదు నేను కేక్ కట్ చేస్తానులే అనేసి అంటాడు. ఇక అప్పుడే చక్రవర్తి రాజేశ్వరిలు ఇంటికి వస్తారు.


బయట రాజేంద్రప్రసాద్ తన ఫ్రెండ్స్ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే తన బామ్మర్ది దయాకర్ ఇంటికి వస్తాడు. రాజేంద్రప్రసాద్ అతను దగ్గరికెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావు అని గొడవ పెట్టుకుంటాడు. ఇచ్చిన ఐదు లక్షలు భోజనాలకి సరిపోయే బావ.. కొట్టావు కదా పన్ను ఊడిపోయింది.. రెండు లక్షలు అవుతాయని డాక్టర్ చెప్పాడు.. ఆ 2,00,000 ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. గోల్డ్ ఇస్తే కూడా నేను వెళ్ళిపోతాను బావ అనేసి అనగానే రాజేంద్రప్రసాద్ తన మెడలోని గోల్డ్ చైన్ తనకి ఇస్తాడు అయితే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్న పల్లవి వీళ్ళిద్దరిని చూస్తుంది. ఆయా గోల్డ్ చైన్ ఇవ్వడమేంటి అతను ఎందుకు గొడవ పడుతున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అతను నువ్వు లేనప్పుడు ఇంట్లో వాళ్లని అడిగి తెలుసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరిని ఒకసారి పరిచయం చేసుకుంటానని వెళ్ళిపోతాడు. వినోద్ మాత్రం పార్టీలో ఎక్కడ మందు పెట్టలేదు నాకు నాలిక లాగుతుంది అనేసి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కోమలి వచ్చి కూల్ డ్రింక్ ఇస్తుంది. థాంక్యూ కోమలి ఈ కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగుతాను అనేసి కూల్ డ్రింక్ లో మందు కలుపుతాడు కానీ అంతలోకే కమల్ వినోద్ దగ్గరికి వస్తాడు. బావ ఎక్కడున్నావని అనగానే ఎక్కిళ్ళు వస్తాయి అతని చేతిలో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తాగేస్తాడు. బావ ఈ కూల్ డ్రింక్ మత్తుగా ఉంది చేదుగా ఉంది అనేసి అడుగుతాడు వీడు ఇంకేం పెంట చేస్తాడని వినోద్ కూడా కమల్ వెనకాలే తిరుగుతాడు.

ఇక దయాకర్ లోపలికి వస్తాడు. కమల్ని గుద్దుకున్నప్పుడు చైన్ కింద పడిపోతుంది. ఆ చైన్ చూసి ఇది మా నాన్న చైన్ లాగా ఉంది అని అడుగుతాడు. అసలు నువ్వు ఎవరు అని నిలదీస్తాడు అక్షయ్. అక్షయ్ కి నిజం చెప్పబోతాడు దయాకర్ అందులోకి రాజేంద్రప్రసాద్ వచ్చి ఇతను నా ఫ్రెండ్ దయాకర్ అని అందరికీ పరిచయం చేస్తాడు. బయటేమో కాలర్ పట్టుకుని కొట్టాడు చైన్ ఇచ్చాడు లోపలికి వచ్చిన ఫ్రెండ్ అని చెసేసాడు ఏంటి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. మీరు మా నాన్న ఫ్రెండ్ అని అనుకోలేదు తప్పుగా మాట్లాడాను క్షమించండి అనేసి అక్షయ అడుగుతాడు అలాగే కమల్ కూడా సారీ చెప్తాడు. కమల్ తిక్క తిక్కగా మాట్లాడుతాడు అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×