E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు నిజం చెప్పిన అవని..క్రిటికల్ గా అభి పరిస్థితి.. నిజాలు బయటకొస్తాయా..?

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు నిజం చెప్పిన అవని..క్రిటికల్ గా అభి పరిస్థితి.. నిజాలు బయటకొస్తాయా..?
Advertisement

Intinti Ramayanam Today Episode February 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని పల్లవి నాటకం ఆడుతుంది అని అనుకుంటుంది. అనుమానమే నిజమైనట్టుంది. అందరూ నిమ్మకాయని కొయ్యగా పల్లవి మాత్రం కొయ్యకుండా ఇలా దెయ్యం పట్టినట్లు నాటకం ఆడుతుందా అని ఆలోచిస్తుంది. అయితే పల్లవిని లోపలికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పల్లవి నొప్పులతో బాధపడిపోతూ ఉంటుంది.. అయితే కమల్ వేడి నీళ్లు తీసుకొని వెళ్లి ఇస్తాడు. ఆ తర్వాత భానుమతి వచ్చి జండుబాం ఇస్తుంది.. ఏంటే ముసలి అప్పుడేమో కొట్టు కొట్టు అని కర్ర తెచ్చి ఇచ్చావు ఇప్పుడేమో జండుబాం రాసుకొని అంటున్నావా నీకు కొంచమైనా ఉందా అని పల్లవి అంటుంది. ఎవరికైనా దెయ్యం పడితే అప్పుడు ఏం జరిగిందో గుర్తుకురాదు. కానీ పల్లవికి మాత్రం జరిగింది గుర్తుందీ అంటే కచ్చితంగా ఇది నాటకమే అని అవని కన్ఫామ్ చేసుకుంటుంది.. మావయ్యను తోసి చంపేయాలనుకునింది పల్లవిని నా అనుమానమే నిజమైతే ఆ తర్వాత పల్లవిని అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని అవని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవిని ఆ భూత వైద్యుడు దారుణంగా కొట్టాడని వాడి అంతు చూడాలని కోపంగా ఉంటుంది.. దినంతటికీ కారణం అవనీనేని ఎలాగైనా సరే అవని మీద రివేంజ్ తీర్చుకోవాలి ముందు ఆ ముసలోడిని లేపేస్తే అవని పరిస్థితి దారుణంగా మారుతుంది అని పల్లవి ప్లాన్ చేస్తుంది.. ముందు అవని దగ్గర ఉన్న మా నాన్న డాక్యుమెంట్స్ తీసుకుంటే ఆ తర్వాత దాన్ని ఏదైనా చేసేయొచ్చు అని అనుకుంటుంది. పల్లవి నొప్పులతో బాధపడుతూ ఉంటే కమల్ ఆమెకు సేవలు చేస్తూ ఉంటాడు. ఇలాంటి నొప్పులు పడితేనే మన ఒంట్లో ఉన్న దెయ్యం పారిపోతుంది అని కమల్ ఉచిత సలహా ఇస్తాడు..

Advertisement

ఆ తర్వాత ఈ తింగరోడితో ఎలా వేగాలో అర్థం కావడం లేదు.. ముందు మా నాన్న బయటికి వస్తే వీడి సంగతి ఏంటో నేను చూస్తాను అని అనుకుంటారు. మా డాడీ బయటికి రాగానే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు అని పల్లవి అనుకుంటుంది. ఇక తర్వాత రోజు అవి కి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని కానిస్టేబుల్ తెచ్చి ఇస్తాడు. ఆ ఫుటెజ్ లోపల ఏదో ఉంది అని దాన్ని పరీక్షించి చూస్తాడు. అయితే పల్లవికి సపోర్ట్ గా ఉన్న కానిస్టేబుల్ అందులో ఏముందో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందో కనిపించకపోవడంతో అతను ఈ విషయం ఎలాగైనా సరే పల్లవి చెప్పాలి అని అనుకుంటాడు.

కమల్ పల్లవి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కానిస్టేబుల్ ఫోన్ చేయడంతో పల్లవి ఇప్పుడు వేడి ముందర మాట్లాడితే కచ్చితంగా నేను దొరికిపోతాను. ఎలాగైనా సరే తర్వాత మాట్లాడాలి అసలు విషయం ఏంటో కనుక్కోవాలి అని అనుకుంటుంది.. అయితే కమల్ ఎన్నిసార్లు ఫోన్లు వస్తున్నాయి కదా ఎవరు ఎత్తి మాట్లాడొచ్చు కదా అని అంటున్న సరే క్రెడిట్ కార్డు లోన్లు అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు. బావ వాళ్ళతో నేను తర్వాత మాట్లాడుతానులే అది ప్రతి ఇంపార్టెంట్ కాదు అని పల్లవి అంటుంది. ఈ కానిస్టేబుల్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అంటే ఏదో ముఖ్యమైన మ్యాటర్ ఉంటుంది. ముందు ఈ తింగరోన్ని పక్కకు పంపించాలి ఏంటో తెలుసుకోవాలని పల్లవి అనుకుంటుంది.

Advertisement

సీసీటీవీ ఫుటేజ్ గురించి ఆ కానిస్టేబుల్ చెప్పగానే పల్లవి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది.. అయితే ఎలాగైనా సరే అభి అవనిని కలిసి నిజాన్ని చెప్పకూడదు అని ప్లాన్ చేస్తుంది.. అభి ని వెంబడించి ఎలాగైన ఆ ఫుటేజ్ ని కొట్టేయాలని తన మనుషులకి చెప్తుంది.. ఎస్ఐ అభిరామ్ గారు నాకు ఫోన్ చేశారు. మరో సిసి టీవీ ఫుటేజ్ దొరికిందట.. అందులో మావయ్య గారిని హత్య చేయాలనుకున్న వాళ్ళు ఎవరో ఉంది అని ఆయన అన్నారు. ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అని అవని అంటుంది.. అయితే అవని మాట వినగానే పల్లవి షాక్ అవుతుంది.. భానుమతి అదెవరో తెలియాలి ఖచ్చితంగా దాని సంగతి లేదా వాడి సంగతి నేనే చూస్తాను. చేతులు కాలు ఇరగొడతాను అని భానుమతి అంటుంటే.. కమల్ మాత్రం నీకు అంత ఛాన్స్ ఇవ్వనులే నేనే వాళ్ళని చంపేస్తాను అని అంటాడు..

Also Read : ఈ వారం దారుణం.. సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ పడిపోయింది.. ఆ రెండు అవుట్..

ఇద్దరి మాట విన్న పల్లవి షాక్ అవుతుంది.. అయితే ఎంతసేపు ఎదురు చూసినా సరే అభి రాకపోవడంతో అందరూ టెన్షన్ పడిపోతుంటారు. అవనికి ఒక ఫోన్ వస్తుంది. అభి ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తారు.. అతను చూసిన అవని అక్షయ్ ఇద్దరు కూడా బాధపడతారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం అయిపోయింది.. ఇది కేవలం నావల్లే జరుగుతుంది అని అక్షయతో అంటుంది అవని. ఆ తర్వాత అక్షయ్ ఏం మాట్లాడుతున్నావ్ అవని అని అంటే అవునండి.. కన్న తండ్రి గురించి నాకు తెలిసిన మీకు ఇన్ని రోజులు నిజం చెప్పలేకపోయాను నన్ను క్షమించండి అని అడుగుతుంది.. మరి మీ కన్న తండ్రి ఎవరు అని అక్షయ్ అడుగుతాడు. ఎవరో కాదు ఆ చక్రధర్ అని అనగానే అక్షయ్ షాక్ అవుతాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తాడా? పల్లవి బండారం బయటపడుతుందా..? అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లు అభి పల్లవి గురించి నిజం చెప్తాడు ఏమో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×