E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిని ఆడుకున్న పల్లవి.. మీనాక్షి మాటతో అనుమానం.. పల్లవి ప్రగ్నెంట్ కాదా?

Intinti Ramayanam Today Episode: అవనిని ఆడుకున్న పల్లవి.. మీనాక్షి మాటతో అనుమానం.. పల్లవి ప్రగ్నెంట్ కాదా?
Advertisement

Intinti Ramayanam Today Episode January 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. భానుమతి కూడా నా కూతురు కళ్ళల్లో నీళ్లు చూడకూడదని అనుకున్నాను మళ్ళీ నువ్వు తనని ఎందుకురా ఇంతగా బాధ పెడుతున్నావు అని అంటుంది. ఇక అక్షయ్ నేను కేవలం తమ్ముడి కోసం మాత్రమే అతని బయటికి తీసుకొచ్చాను. ఇవి కోరిక తీర్చాలి అని కమల్ అనగానే నేను అతని తీసుకొచ్చి పల్లవికి పూజ చేసేలా చేశాను. నన్ను తప్పుగా అనుకోవద్దు అని అక్షయ్ అంటాడు. పల్లవి, రాజేశ్వరి ఇద్దరు కూడా చక్రధర్ కోసం బాధపడతారు.. పోలీసులు తీసుకుని వెళ్తుంటే పోలీసులను బ్రతిమలాడతారు.. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ మాట వినకుండా చక్రధాన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంట్లోకి వచ్చినా రాజేశ్వరి పల్లవి ఇద్దరు కూడా అక్షయ్ పై సీరియస్ అవుతారు. ఇలా నమ్మించి మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు అని రాజేశ్వరి అక్షయ్ కాలర్ పట్టుకుని అడుగుతుంది.. నేనేమీ తప్పు చేయలేదు ఎందుకు మీరు ఇలా అంటున్నారు అని అక్షయ్ అంటున్న సరే రాజేశ్వరి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. నా ఉసురు తగిలి మీరు ఏమి బాగుపడడ్రా అని రాజేశ్వరి దారుణంగా మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. కోటిలింగం శ్రియా అక్క తిన్నదా మిగిలిన అన్నం ఏది అని అనగానే భానుమతి అతని కొడుతుంది.. అది ఎంగిలి చేసిన అన్నని నాకు తినిపిస్తావా దొంగ సచ్చినోడా అంటూ భానుమతి కోటిలింగం నీ కొడుతూనే ఉంటుంది. కోటిలింగం మాత్రం నాకు మీరు చాలా బాగా మసాజ్ చేశారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భానుమతి ఎంగిలి అన్నన్ని నేను తిన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత పల్లవి అవనిని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటుంది. పల్లవి తన తండ్రి తనకు దూరం చేసిన అవనిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని అనుకుంటుంది. ఉదయం లేవగానే పల్లవి శ్రీయాలు ఇద్దరూ కడుపుతో ఉన్నారని అవని వాళ్లకు కావాల్సిన అన్నీ చేసిపెడుతూ ఉంటుంది.

Advertisement

శ్రేయ ఆమ్లెట్ అడగ్గానే అవని చేసుకుని తీసుకొస్తుంది. అలాగే పల్లవి కూడా తనకి కాఫీ తాగాలనిపిస్తుంది అని అంటుంది. కాఫీ చేయగానే ఇది నాకు నచ్చలేదు నాకు ఇంకేదైనా కావాలి అని అడుగుతుంది. ఆ కాఫీ ని తాగిన కమల్ కాఫీ బాగానే ఉంది కదా మరి నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని అంటాడు. కాఫీ బాగానే ఉంది కానీ నాకు తాగాలనిపించలేదు అని పల్లవి అంటుంది. నాకు ఫ్రెష్ గా ఏదైనా జ్యూస్తే చేస్తావా కానీ అవనిని అడుగుతుంది పల్లవి. అవని పల్లవి ఎంతగా ఇబ్బంది పెడుతున్నా సరే సరే అని జ్యూస్ తెచ్చి ఇస్తుంది. పల్లవి ఈ జ్యూస్ బాగోలేదు చక్కర తక్కువైంది అని మళ్లీ అవని చక్కెర వేసుకో రమ్మని చెప్తుంది. చక్కెర వేసుకుని వచ్చిన సరే నాకు ఇది తాగాలనిపించలేదు ఇంకా ఏదైనా కావాలి అని అడుగుతుంది.

శ్రేయ నీకేం కావాలి చెప్పు నేను చేసి పెడతాను అని అవని అంటుంది. దానికి శ్రేయ నాకు బజ్జీలు అయితే బాగుంటాయి తినాలనిపిస్తుంది అని అడుగుతుంది. ఇక పల్లవి ఇలాంటివి చిన్నవి చెప్తే అవని చేయలేదు ఏదైనా కష్టమైనవి చెప్పాలి అని అనుకుంటుంది. పూర్ణం పూరీలు నాకు తినాలనిపిస్తుంది. అక్క అని అనగానే అక్కడికొచ్చిన మీనాక్షి పూర్ణం పూరీలు ఇప్పటికి పడి చేయడం చాలా కష్టమవుతుందమ్మా ఇంకా ఏదైనా అడుగు అని అంటుంది.. నీ కూతురు కష్టపడి పోతుందని తెగ బాధ పడిపోతున్నావా నా మనవరాలుకి నేనే పూర్ణం బూరెలు చేసి పెడతాను అని భానుమతి అంటుంది.

Advertisement

అవని అవి ఇప్పుడు చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకేదైనా అడుగు అని పల్లవిని అంటుంది. ఇక వంట గదిలోకి వెళ్లిన అవని వెనకలే మీనాక్షి కూడా వెళ్తుంది. నేను ఒక మాట అంటాను ఏమీ అనుకోవు కదా అని మీనాక్షి అడుగుతుంది. శ్రేయ కి తల్లి అయిన తర్వాత వాంతులు వేళ్ళు అన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ పల్లవికి మాత్రం అలాంటి లక్షణాలు ఏవి కనిపించలేదు అని మీనాక్షి అంటుంది.. ఆ మాట వినగానే అవని నిజంగానే పల్లవికి వాళ్ళింట్లో లక్షణాలు ఏదీ లేవు నాకు కూడా అనుమానంగా ఉంది అని అనుకుంటుంది.

ఆ తర్వాత పల్లవి నిజంగానే తల్లి కాబోతుందా లేదా అని తెలుసుకునేందుకు అవని ప్రయత్నాలు చేస్తుంది. శ్రీకర్ శ్రీయాను ఎత్తుకొని తీసుకురావడం చూసినా అవని మురిసిపోతుంది.. అదేంటి అని అడగ్గానే తనకి నీరసంగా ఉంది వదిన వాంతులు అవుతున్నాయి అని అంటాడు శ్రీకర్. అవని శ్రియకున్న లక్షణాలు నీకు ఏమీ లేవు కదా అని పల్లవిని అడుగుతుంది. ఈ ఆ తర్వాత కమల్ పల్లవి చేత ప్రెగ్నెన్సీ వాళ్లు చేసే ఎక్సర్సైజు లను చేయమని చెప్తాడు. ఇలానే ఎక్సర్సైజ్ చేస్తూ వుండు నీకోసం నేను జ్యూస్ తీసుకొని వస్తాను అని అంటాడు.

Also Read : రాజేష్ ను ఫాలో అవుతున్న బాలు.. మీనా కోసం గిఫ్ట్.. మళ్లీ కలిసిపోతారా..?

కమల్ అలా వెళ్ళగానే పల్లవి మాత్రం అక్కడున్న సౌండ్ బాక్స్ పెట్టుకుని తీన్మార్ స్టెప్పులేస్తుంది.. కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నెమ్మదిగా నడవాలని అనుకుంటారు కానీ పల్లవి మాత్రం ఇలా పాటకు స్టెప్పులేస్తుంది అని అవని అనుమాన పడుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో పల్లవి కడుపుతో లేదని అవని తెలుసుకుంటుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

Related News

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Big Stories

Advertisement
×