E-Paper
Advertisement

Psychological Horror Thriller OTT : 1 గంట 50 నిమిషాల మెగా ఫ్లాప్… బాబా ముసుగుపై దెబ్బ కొట్టాలని చూసే అమ్మాయి… క్లైమాక్స్ కేక

Psychological Horror Thriller OTT : 1 గంట 50 నిమిషాల మెగా ఫ్లాప్… బాబా ముసుగుపై దెబ్బ కొట్టాలని చూసే అమ్మాయి… క్లైమాక్స్ కేక
Advertisement

Psychological Horror Thriller OTT : గత ఏడాది థియేటర్లలో విడుదలైన ఒక మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే అదే మూవీ ఓటీటీలోకి వచ్చాక ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తోంది.1 గంట 50 నిమిషాల ఈ సినిమా విధి ఒక్క సారిగా మారిపోయింది. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ దీనిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ హిందీ మిస్టరీ హారర్ మూవీ పేరు ‘నికితా రాయ్’. ఇది కుష్ ఎస్. సిన్హా తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా టైటిల్ రోల్‌లో పరేష్ రావల్, అర్జున్ రాంపాల్, సుహైల్ నయ్యర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 జూలై 18న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా కుష్, సోనాక్షి సిన్హా సోదరుడు కావడం గమనించదగ్గ విషయం. ఇక ఈ సినిమా 2026 జనవరి 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మూడవ స్థానంలో ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది.

Advertisement

Read Also :  బందిపోటు రాణిగా మారే గృహిణి… తెల్ల దొరలకు చుక్కలు… క్రేజీ బెంగాలీ మూవీ

స్టోరీ ఏమిటంటే

నికితా రాయ్ (సోనాక్షి సిన్హా) లండన్‌లో నివశిస్తుంటుంది. ఆమె సైన్స్ ను ఎక్కువగా నమ్ముతుంటుంది. దెయ్యాలు, ఆత్మలు వంటి విషయాలను ఆమె అస్సలు నమ్మదు. అయితే నికితా సోదరుడు ఒకరోజు అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. అతని మరణం వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని గ్రహించిన నికితా, దానిని ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది. విచారణలో భాగంగా ఆమెకు ‘ది బుక్ ఆఫ్ డార్క్నెస్’ అనే ఒక ప్రాచీన పుస్తకం గురించి తెలుస్తుంది. ఆ పుస్తకం చుట్టూ కొన్ని చీకటి శక్తులు అల్లుకుని ఉన్నాయని, అది చదివిన వారికి వింత అనుభవాలు ఎదురవుతాయని కొంతమంది నమ్ముతుంటారు.

Advertisement

ఇప్పుడు తన సోదరుడి మరణానికి కారణమైన వారిని వెతికే క్రమంలో, నికితా తనకు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తుంది.  ఆమెకు ఆధ్యాత్మిక గురువు (పరేశ్ రావల్) ఎదురవుతాడు. ఈ బాబాపై అనుమానం కలిగిన ఆమె అతని గురించిన అసలు నిజాలు వెలికితీసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ప్రక్రియలో ఆమె ఒక భయంకరమైన చిక్కులో చిక్కుకుపోతుంది. అయితే ఆమె ఆ చిక్కులను అధిగమించగలదా ? నికితా తమ్ముడు ఎలా చనిపోయాడు ? ఆ పుస్తకం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? నికితాకి దెయ్యాలు ఎదురుపడతాయా ? ఈ ముగింపు ఎలాఉంటుంది ? అనేది తెలుసుకోవడానికి మీరు నికితా రాయ్ సినిమాను చూడాల్సిందే.

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×