Intinti Ramayanam Today Episode july 18th: నగలు నేనే తీశాను. బాబుని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కడియాలు వేసి చూస్తే అవి గుచ్చుకుంటున్నాయి. సరిగ్గా లేవు కాబట్టే వాటిని సైజు చేయించాలి అని మళ్లీ ఆ నగల షాపుకి తీసుకొని వెళ్ళాను. అక్కడ అతనికి చెప్పాను అయితే ఇంకొక నాలుగు ఐదు రోజులు పడుతుంది అని ఆ షాప్ అతను చెప్పాడు. ఆ సంగతి నేను మర్చిపోయాను అని ఏదో ఒకటి చెప్పి అవని అందరిని నమ్మిస్తుంది. ఇదంతా మీనాక్షిని కాపాడడానికి చేసిన ప్రయత్నం అని పల్లవి అనుకుంటుంది. మీనాక్షి అవని చెప్పిన మాట విని షాక్ అవుతుంది. మీరేం కంగారు పడకండి నేను బాబు కోసం వేరే చేను చేయించాను అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఉంటారు.. నేను వెళ్లి ఆ చైన్ తీసుకొని వస్తాను అని అవని అనగానే అందరూ అవని నిజంగానే గ్రేట్ అంటూ పొగిడేస్తారు..
బాబు కోసం నేను వేరే చేంజ్ చేయించాను కదా దాన్ని తీసుకొని వస్తాను అని అవని పైకి వెళ్లి ఆ చైన్ తీసుకొని వస్తుంది.. శ్రియ ఈ చైన్ ని బాబు మెడలో వెయ్యి అని అవని ఆ చైన్ ఇచ్చి శ్రేయ కి వెయ్యమని చెప్తుంది.. తను ఆ చైన్ వేయగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్క ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ చైన్ వేసావ్.. ఆ నగల నువ్వే తీసి ఇప్పుడు మళ్లీ నువ్వే కొత్త చైన్ తీసుకొని వచ్చావా ఇందాకటి నుంచి అదేంటో చెప్పొచ్చు కదా.. మళ్లీ ఇప్పటివరకు ఎందుకు ఇలా చేశావు అని పల్లవి సీరియస్గా అవనిని అడుగుతుంది.. మా అమ్మని నేనే అత్తయ్య గారి గదిలోకి పంపించాను.. దాన్ని నువ్వు వీడియో తీసి ఇంత రచ్చ చేస్తావని నాకు తెలియలేదు అని అవని పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. నువ్వు వీడియోలు తీస్తావని నాకెలా తెలుసు అని అవని అనగానే.. శ్రీయ నీకు అంతగా వీడియోలు తీయాలి అనిపిస్తే పెళ్లిళ్లకి ఫంక్షన్లకు తీస్తే కనీసం డబ్బులైనా వస్తాయి కదా అని అనగానే కమల్ నవ్వుతాడు..
అవని బాబు కోసం తెచ్చిన బంగారం ఎక్కడ మిస్ అయింది పల్లవి ఎందుకు ఇలా చేస్తుంది అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. అసలు పల్లవి ఎత్తుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి ఏంటక్కా రమ్మన్నావు అని పిలుస్తుంది. ఏంటి ఇందాక మా అమ్మ దొంగతనం చేసింది. నేను రెచ్చిపోయావు కదా ఇప్పుడు నువ్వెందుకు ఇంత గ రియాక్ట్ అవుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని పల్లవి అంటున్నాయి. ఎందుకు మా అమ్మ మీద నువ్వు నిందలు వేసావు అసలు ఆ నగలు తీయడం చూసావా అని అవని పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది.. అయితే పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది..
మా అమ్మ దొంగతనం చేసింది అని నువ్వు అంటున్నావు కదా. మరి ఈ వీడియో చూడు ఎవరు దొంగతనం చేశారో అని పల్లవికి అవని ఒక వీడియో చూపిస్తుంది.. ఆ వీడియోలో పల్లవి దొంగతనం చేసినట్లు కనిపిస్తుంది.. నువ్వు రెండు రోజుల నుంచి తేడాగా ఉన్నావు.. ఏదో కంగారుపడుతున్నట్లు కనిపిస్తుంది అందుకే నిన్ను నేను అబ్జర్వ్ చేస్తున్నాను.. కచ్చితంగా నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని నేను ఊహించాను అందుకే నిన్ను ఫాలో అవుతున్నాను.. అప్పుడే ఈ వీడియో తీస్తాను ఇందాక మా అమ్మ దొంగ అని అన్నావు కదా.. ఇప్పుడు ఈ వీడియోను మళ్లీ అందరితో కలిసి ఒకసారి చూద్దు పది లోపలికి అని చెంప పగలగొడుతుంది.. పద వెల్దామని అవని బెదిరించడంతో పల్లవి అక్క వద్దక్క ఈ వీడియో చూస్తే కమల్ నన్ను చంపేస్తాడు.. అవును బాబు నగలు తీసింది నేనే అని పల్లవి నిజం ఒప్పేసుకుంటుంది.. ఆ నగలని ఎందుకు తీసావు అని అవని అడుగుతుంది.. ఒక చిన్న పని వల్ల తీయాల్సి వచ్చింది అక్క రెండు రోజులు నేను ఆ నగల్ని తెచ్చి మళ్ళీ నీ చేతికి ఇస్తాను అని పల్లవి చెప్పగానే.. అవని ఏం జరుగుతుంది ఎందుకు భయపడుతుంది అని ఆలోచిస్తుంది..
పల్లవి ఎందుకింత కంగారుపడుతుంది. ఏదో పెద్ద తప్పే చేసి ఉంటుంది. పల్లవి ఇంత కంగారు పడుతూ ఉండడం నేనెప్పుడూ చూడలేదు. చెప్పుకోలేని తప్పు చేసింది కాబట్టే పల్లవి ఇంత భయపడుతుంది.. ఏదైనా సమస్యలో ఇరుక్కుంటుందా..? లేకుంటే పల్లవికి కొత్త శత్రువులు ఎవరైనా తయారయ్యారా.? ఏదో జరుగుతుంది పల్లవి ఏదో సమస్యలో ఉన్నట్లుంది అదేంటో తెలుసుకోవాలి అని అవని అనుకుంటుంది.. పల్లవి కంగారు పడుతుండడం చూసి అవనికి ఇంకాస్త అనుమానం పెరుగుతుంది.. ఎలాగైనా సరే పల్లవి అంత టెన్షన్ పడడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :స్టైలిష్ లుక్ లో చక్రి.. ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు పడి చచ్చిపోరు..!