E-Paper
Advertisement

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?
Advertisement

Jofra Archer In Sri Lanka:  ఇంగ్లాండ్ క్రికెటర్, డేంజర్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ గురించి తెలియని వారి ఉండరు. కరేబియన్ దీవుల్లో పుట్టి పెరిగిన జోఫ్రా ఆర్చర్, ఆ తర్వాత బతుకుతెరువులో భాగంగా ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. అక్కడే సెటిల్ అయిన ఆర్చర్, ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చి… ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లోను ఆడుతూ… అదరగొడుతున్నాడు. అయితే అలాంటి ఆర్చర్… శ్రీలంక జట్టులోకి వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆర్చర్ శ్రీలంక జెర్సీ వేసుకొని బౌలింగ్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండును కూడా వీడి.. శ్రీలంక జట్టులో చేరిపోయినట్లు వార్తలు క్రియేట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

శ్రీలంక జట్టులో ఉన్నది ఆర్చర్ కాదు, మ‌రి ఎవ‌రంటే?

Advertisement

శ్రీలంక జట్టుకు (Jofra Archer In Sri Lanka) సంబంధించిన జెర్సీ ధరించి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బౌలర్ జోఫ్రా ఆర్చర్ కాదు. అతడు శ్రీలంకకు సంబంధించిన క్రికెటర్. కానీ హెయిర్ స్టైల్, బౌలింగ్ యాక్షన్ అన్నీ కూడా ఆర్చర్ లాగానే ఉన్నాయి. దీంతో శ్రీలంక యువ సంచలనం చమిందు విక్రమసింఘేను ( Chamindu Wickramasinghe) చూసి, అందరూ ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చరని బ్రహ్మ పడుతున్నారు. శ్రీలంక క్రికెట్ జట్టులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చమిందు విక్రమసింఘే… బౌలింగ్ యాక్షన్ ఆర్చర్ లాగానే ఉంటుంది. అతని హెయిర్ స్టైల్ కూడా… అచ్చం అలాగే ఉంది. ఆర్చర్ అలాగానే చమిందు విక్రమసింఘే కూడా నల్లగానే ఉన్నాడు. దీంతో చమిందు విక్రమసింఘేను చూసి అందరూ ఆర్చరే అని బిత్తర పోతున్నారు.

ఇంతకు ఎవరి చమిందు విక్రమసింఘే ?

శ్రీలంక క్రికెట్ జట్టులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చమిందు విక్రమసింఘే, 2002లో జన్మించాడు. ఇతడు రైట్ ఆర్మ్ బౌలింగ్ చేస్తాడు. బ్యాటింగ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్. ఆర్చర్ తరహాలోనే లోయర్ ఆర్డర్ లో వచ్చి భారీ సిక్సర్లు కొడతాడు. అంటే చమిందు విక్రమసింఘే కూడా చిన్నపాటి ఆల్ రౌండరే. 2024 జూలైలో భారత జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టి20లలో అడుగుపెట్టాడు. 2024 నవంబర్ లో న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరిగింది.

Advertisement

అప్పుడు వన్డేల్లో కూడా అడుగు పెట్టాడు. ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్ జరుగుతున్న క్రమంలో అందులో కూడా అద్భుతంగా రానిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో జాఫ్నా కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విక్రమసింహ.. గతంలో దంబుల్లా సిక్సర్స్ తరఫున కూడా ఆడాడు. కొన్ని సందర్భాల్లో చమిందు విక్రమసింఘే స్ట్రైక్ రేట్ 250 కి చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతని వయసు కేవలం 23 సంవత్సరాలు కావడం గమనార్హం. ఆర్చర్ తరహా లోనే చమిందు విక్రమసింఘే కు మంచి కెరీర్ ఉందని నిపుణులు కూడా చెబుతున్నారు.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

 

Related News

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

ఫ్లాట్ పిచ్ లు ఉండ‌వు.. 2027 వరల్డ్ కప్ తొలి రౌండ్ కే టీమిండియా ఎలిమినేట్

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ఇస్తే, టీమిండియాను కుక్క కూడా ప‌ట్టించుకోదు

రిటైర్మెంట్ ఇవ్వాలంటూ రోహిత్ శర్మపై ఒత్తిడి.. గంభీర్ కుట్రలకు చెక్ పెట్టిన అంబానీ?

రోహిత్ శ‌ర్మను కాదు, ముందు గంభీర్ ను మెడ‌లు ప‌ట్టుకుని గెంటేయండి

2009లో మేం ఓడించాం, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ చిత్తుగా టీమిండియా ఓడించాలి

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..పాకిస్తాన్ కు అమ్ముడుపోయిన జై షా…ఆ ప్లేయ‌ర్ కు శిక్ష త‌గ్గింపు?

Big Stories

Advertisement
×