Intinti Ramayanam Today Episode july 26th: అక్షయ్ ఉదయం లేవగానే ఏంటి ఇంత టైం అయింది. నేను రాత్రి అవని నేను లేపమని చెప్పాను కదా మరి నన్ను లేపకుండా అలానే వెళ్ళిపోయింది ఏంటి అని అవని అంటూ కేకలు వేస్తూ అక్షయ్ ఒక్కసారిగా బయటికి వెళ్లిపోతాడు.. నన్ను 5:30కే లేపమని చెప్పాను కదా క్లైమేట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా.. మరి నువ్వు ఎందుకు నన్ను లేపలేదు నీకు కోపం వస్తే మనిషిని పట్టించుకోవా అని అక్షయ్ అరుస్తాడు.. నేను ఐదు గంటలకి లేపమని చెప్పాను కానీ మీరు లేవలేదు అని ఒక పేపర్స్ చూపించగానే అక్షయ్ షాక్ అవుతాడు. నేను లేపాను కానీ మీరు లేవలేదు అంటూ మళ్ళీ ఇద్దరూ పేపర్లో మీరు రాసుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. నా మీద ఊరికే అరవద్దు అంటూ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. అవనీ నీకు కోపం వస్తే ఇలా తీర్చుకుంటావా? నన్ను ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నావు అని అక్షయ్ అనుకుంటాడు.. ఇక చక్రధర్ మంచి కోడలు అంటూ పొగిడేస్తాడు. భరత్ కి ఆస్తులు అప్పగిస్తాను అని ఎంతగా చెబుతున్నా సరే వద్దు మామయ్య అని చెప్తుంది అది విన్న చక్రధర్ సంతోషంగా ఉంటాడు. వీరిద్దరూ గొడవపడటం ఎపిసోడ్ కు హైలెట్ గా నిలుస్తుంది..
భానుమతి ఆరాధ్యను ఇరికించేస్తుంది. అవని హారతికి జడ వేస్తూ ఉండగా ఒకటే తుమ్ములు తుమ్ముతూ ఉంటుంది. నీకు పెట్టిన నీళ్ళు కాకుండా నువ్వు ఎక్కడైనా వేరే నీళ్లు తాగావా అని అవని అడుగుతుంది. ఏమి తాగలేదు అమ్మ. మరి కూల్ డ్రింక్ ఏమైనా తాగావా అని అవని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి డబ్బాలకు డబ్బాలు ఐస్క్రీం తింటే తుమ్ములే వస్తాయి కదా అని ఆరాధ్యును అడ్డంగా ఇరికించేస్తుంది. నాకు నిన్న ఐస్ క్రీమ్ పెట్టమంటే కొంచెం కూడా పెట్టవా అందుకే నిన్ను ఇలా ఇరికించేస్తాను అని భానుమతి అనగానే ఆరాధ్య ఫీల్ అవుతుంది. కమల్ బాబాయి ఇప్పిస్తే నేను ఐస్ క్రీమ్ తిన్నాను మమ్మీ అని ఆరాధ్య చెప్పగానే భానుమతి ఇప్పుడు ఇలాంటివి జరిగా రేపు ఇంకెలాంటివి తీసుకొని వస్తుందో అని భానుమతి అనగానే అవని సీరియస్ అవుతుంది..
ఎంతగా నేను ఐస్ క్రీమ్ వద్దు అని చెప్తున్నా సరే నువ్వు మాత్రం వినకుండా మీ బాబాయితో కలిసి తింటున్నావా అని చెప్పగానే ఆరాధ్య ఫీల్ అవుతుంది. నాకు నిన్న కొంచెం ఐస్క్రీం పెట్టలేదు కదా అందుకే ఇరికించేసాను అని భానుమతి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. కమల్ని పిలిచిన అవని మీరిద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తిన్నారా ఎందుకు కమల్ ఇలా చేస్తున్నావు అని అవని తిడుతుంది. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. అది కూడా ఎక్కువగా తింటే ఇలానే ఉంటుంది మరి అని కమల్ తో చెప్పడంతో కమల్ చాలా ఫీల్ అవుతాడు.. దీని అంతటికి కారణం ఈ ముసలిదే దీన్ని చంపేస్తాను అని కోపంగా ఉంటాడు.. మొత్తానికి భానుమతి అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది.. అవని ఇంకొకసారి ఇలాంటి ఐస్ క్రీములు తింటే నేను అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది.
పల్లవి ఎలాగైనా సరే ఆ అశ్విన్ గాడికి డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి చేసి నగలను బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికి ఎప్పుడు పది లక్షలు అంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని పల్లవి ఆలోచిస్తూ బుర్ర గోక్కుంటుంది. పల్లవి ఏదో పెద్ద సమస్యలను ఎదుర్కొంది కాబట్టి తనని బయటికి తీసుకోవాలి అనుకుంటున్నారని పల్లవి అంటుంది. ఎలాగైనా సరే వారి మొహాన డబ్బులు కొట్టి బాబుకి చేయించిన నగలను తీసుకొని రావాలి అని పల్లవి వాడికి ఫోన్ చేసి ఎందుకు నన్ను ఇలా బెదిరిస్తున్నావు నీకు కావాల్సినట్లు డబ్బులు ఇచ్చాను కదా అని అంటారు. పల్లవి కమల్ కి విడలా తెలుసు అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పల్లవి ఇంకాస్త టెన్షన్ పెట్టేలా అశ్విన్ మాట్లాడుతూ ఉంటాడు.
అవని తను తాకట్టు పెట్టిన నగలని తీసుకునేందుకు బంగారపు కొట్టుకు వెళుతుంది. ఇక్కడ రిసిప్ట్ ఇచ్చి నన్ను వదలను తాకట్టు పెట్టాను కదండీ వాటిని నేను తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటుంది. వెంటనే ఆ సేటు అవనికి నగలు ఇవ్వడం మొదలుపెడతాడు. అవని నగలను చూస్తూ ఉండగా పల్లవి అశ్విన్ ఇద్దరు ఒకే కారులో అక్కడికి దిగుతారు. అక్కడ అవన్నీ చూసి పల్లవి ఒక్క సరిగా షాక్ అవుతుంది. మా అక్క ఇక్కడే ఉంది ఒకవేళ నీతో నేను చూసింది అంటే కచ్చితంగా నన్ను చంపేస్తుంది అని అవని అంటుంది. కానీ అశ్విని మాత్రం నేనెవరో ఆమెకు తెలియదు కదా నేను వెళ్లి వాటిని తీసుకుని వస్తాను అని అంటాడు. పల్లవి వీడు దొరికిపోతే నేను అడ్డంగా దొరికి పోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..