BigTV English

Intinti Ramayanam Today Episode: ముక్కలైన రాజేంద్రప్రసాద్ కుటుంబం..గదికోసం కొట్టుకున్న కోడళ్లు.. కమల్ షాక్..

Intinti Ramayanam Today Episode: ముక్కలైన రాజేంద్రప్రసాద్ కుటుంబం..గదికోసం కొట్టుకున్న కోడళ్లు.. కమల్ షాక్..

Intinti Ramayanam Today Episode june 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఇంట్లోంచి వెళ్ళిపోదాం అని పార్వతితో అంటారు. కమల్, శ్రీకర్ మాత్రం ఇక్కడ నుంచి వెళ్తే అవని వదిన ఫీల్ అవుతుందని అనుకుంటారు. కానీ అవని ఇంట్లోకి ఉండటం ఇష్టం లేదు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. శ్రీకర్, కమల్ ను వెళ్ళిపోదామని పిలుస్తాడు. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఈ ఇల్లు వదిన పేరు మీద ఉంది అంటే మనదే కాబట్టి మేము ఇక్కడి నుంచి రామ్ అన్నయ్య అని తెగేసి చెప్పేస్తారు. మీకు మీ వదిన చెప్పింది కాబట్టి మీరు ఇంట్లో ఉంటాను అని అంటున్నారు. నేను ఇంట్లో అస్సలు ఉండను ఇక మీ ఇష్టం అని అక్షయ్ అంటాడు. శ్రీకర్ కూడా వదిన మాటని మేము కాదనలేము అన్నయ్య అని అంటాడు.. తమ్ముళ్లు ఇద్దరు రాకపోయినా సరే మనం వెళ్ళిపోదాం అమ్మ అని అక్షయ్ పార్వతితో అంటాడు. శ్రీకర్, కమల్ మాత్రం మేము ఇక్కడే ఉంటాము అని అంటారు. కానీ అక్షయ్ మాత్రం నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని అక్కడి నుంచి తల్లి, నాయనమ్మ తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతిని భానుమతిని అక్షయ్ తీసుకొని వెళ్ళిపోతుంటే శ్రీకర్ కమల్ వద్దని ఆపుతారు. కానీ శ్రియ మాత్రం పార్వతిని నగలు కావాలని డిమాండ్ చేస్తుంది. శ్రియ పై శ్రీకర్ కమల్ సీరియస్ అవుతారు. అవని పేరు మీద కోట్లు విలువ చేసే ఇంటిని రాసిచ్చారు కదా.. మేము నగలు అడగడంలో తప్పు లేదు కదా అని శ్రియ అంటుంది. పార్వతి శ్రియ అన్న దాంట్లో తప్పేమీ లేదు. ముగ్గురు కోడలికి సమానంగా నేను నగలుస్తాను ఇవిగోండి తీసుకోండి అని పల్లవికి శ్రీయకు నగలు ఇస్తుంది.. వాళ్ళింట్లోంచి వెళ్లిపోవడం కమల్ అవని కి ఫోన్ చేసి చెప్తాడు. మీకు కొంచెం కూడా బుద్ధి లేదు పెద్దవాళ్లు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు అంటే ఆపాల్సింది పోయి నగలు కావాలని అంటారా అని శ్రీకర్ కమల్ తిడతారు..

అయితే శ్రీయ పల్లవి మాత్రం మౌనంగానే ఉండిపోతారు. అక్షయ్ తన తల్లిని నానమ్మని తీసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతారు.. ఎంత చెప్పినా కూడా అక్షయ్ వినకుండా వెళ్ళిపోతాడు. శ్రీకర్ కమ్మలు ఈ విషయాన్ని వెంటనే వదినకు చెప్పాలని అనుకుంటారు.. అయితే కమల్ అవనికి ఈ విషయాన్ని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. రాజేంద్రప్రసాద్ వాళ్ళ మొండితనమే వాళ్ళని ఈ పరిస్థితికి తీసుకువచ్చింది అని అంటాడు. అందరూ కలిసి అక్షయ్ వాళ్లను వెతకడానికి వెళ్తారు.. అవని రాజేంద్రప్రసాద్, భరత్, అందరూ కలిసి బయటకు వచ్చి వీధులు వెతుకుతారు.. కానీ వాళ్ళు కనిపించరు.


అవనిని చూసిన శ్రీకర్ కమల్ అక్కడికి వెళ్తారు.. అమ్మ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు అని అందరూ అనుకుంటారు.. అయితే అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అవని అడుగుతుంది. కచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఉంటారని అనుకుంటారు.. అటు పల్లవి శ్రీయ ఇద్దరు కూడా అవని అక్షయల రూమ్ కోసం గొడవ పడతారు. ఇంటికి పెద్ద కోడలు నేనంటే నేను.. అంటూ ఇద్దరూ రూమ్ కోసం గొడవ పడతారు. అయితే కమల్ శ్రీకర్ అక్కడికి వచ్చి ఈ రూము మా వదిన అన్నయ్యలది వాళ్ళు మాత్రమే ఇందులో ఉండాలి అని రూమ్ కి తాళం వేస్తామని ఇద్దరికీ షాక్ ఇస్తారు.. ఇంత పెద్ద రూము ఎవరికి కాకుండా పోతుంది అని శ్రియ పల్లవి ఇద్దరు బాధపడతారు.

ఆ తర్వాత కమల్, అవని, శ్రీకర్ అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్ ఇంటికి వెళ్ళారేమో చూడాలని వెళ్తారు. అనుకున్నట్లుగానే అక్షయ్ వాళ్లు అక్కడే ఉంటారు. అవని వెళ్ళగానే భాస్కర్ వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారా ఇది ఏమైనా హోటల్ అని మాట్లాడుతుంది.. మాటలు వినగానే అవని అత్తయ్య గారు మన ఇల్లు ఉండగా మీరు అక్కడే ఉండమని చెప్పిన కూడా ఎందుకు ఇలా వచ్చారు అని అంటుంది. అయినా అక్షయ్ వాళ్లు వినకుండా మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని అవనిని పంపిస్తారు. బయటికి వచ్చిన అవని దీని వెనకాల ఎవరో ప్లాన్ ఉంది ఇది తెలుసుకోవాలని శ్రీకర్ అవని మాట్లాడుకుంటారు. పల్లవి ఇదంతా చేసిందని నాకు అనుమానంగా ఉంది.. కన్నయ్యకు తెలియకుండా పల్లవిని చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి అసలు విషయాన్ని బయట పెట్టాలి అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×