Brahmamudi serial today Episode: పంతులు రాజ్, యామిని చేత పెళ్లి పనులు మొదలు పెట్టిస్తాడు. రాజ్, యామిని పూజలు చేస్తుంటారు. కావ్య బాధగా చూస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎమోషనల్‌గా చూస్తుంది. బాధపడుతున్న కావ్య వైపు వెటకారంగా చూస్తుంది యామిని. ఇంతలో పంతుల అమ్మా హారతి ఇచ్చి వినాయకుడిని మనసులో మొక్కుకుని పెళ్లిలో ఏలాంటి విగ్నాలు జరగకుండా చూడమని వేడుకోండి అని చెప్తాడు. దీంతో ఏర్పాట్లన్నీ సక్రమంగా చేస్తే విఘ్నాలు ఎందుకు వస్తాయి శాస్త్రి అని అడుగుతుంది ఇంద్రాదేవి. దీంతో పంతులు వస్తాయని కాదమ్మా.. రాకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అయినా పెద్దవారు అయ్యుండి మీరు ఇలాంటి ప్రశ్న అడగడం విడ్డూరంగా ఉంది అంటాడు. పెద్దవారైనంత మాత్రాన సందేహాలు రావా ఏంటి..? మీ సందేహాలు అన్ని పక్కన పెట్టి ముందు హారతి ఇవ్వండి అని చెప్పగానే.. యామిని కళావతి గారు మీరు వచ్చి హారతి ఇవ్వండి. మీ ఫ్రెండ్ పెళ్లిని దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చారు కదా అంటుంది. దీంతో కావ్య ఎందుకంత కంగారు పడతావు యామిని పెళ్లి దగ్గరుండే జరిపిస్తాను.. ముందు హారతి పెద్దవాళ్ల చేత ఇప్పించాలి. అది మీ అమ్మతో ఇప్పించు అని చెప్తుంది.
ఇంద్రాదేవి కూడా అవును హారతి పెద్దవాళ్లు ఇస్తేనే బాగుంటుంది అని చెప్తుంది. పంతులు వైదేహిని పిలిచి హారతి ఇవ్వమంటాడు. వైదేహి దంపతులు వచ్చి హారతి ఇస్తుంటే.. కర్ర విరిగిపడుతుంది. దీంతో ఇంద్రాదేవి అపశకునం ఇక్కడ ఇంత జరుగుతుంటే ముత్తయిదువులు మీరేం అనరేంటి అంటుంది. దీంతో ముత్తయిదువులు అయ్యయ్యో అపశకునం.. ఇక ఈ పెళ్లి జరగకూడదు జరిగితే మంచిది కాదు అంటారు. ధాన్యలక్ష్మీ కూడా అవును నాకు తెలిసిన వాళ్ల పెళ్లిలో ఇలాగే జరిగితే వినకుండా అలాగే పెళ్లి చేశారు. కానీ సంవత్సరం తిరిగే లోపు వాళ్లు విడిపోయారు అంటుంది. ఇవన్నీ వింటుంటే నాకు అనుమానం వస్తుంది అత్తయ్యా యామిని చెప్పినట్టు వాళ్లకు నిశ్చితార్థం అవ్వగానే రామ్‌కు యాక్సిడెంట్ అవ్వడం. కోమాలోకి వెళ్లి ఆరు నెలల తర్వాత రావడం. మళ్లీ ఇప్పుడు పెళ్లి అని ఏర్పాట్లు చేయగానే ఇలా పెళ్లి నాటు విరిగిపోవడం ఇదంతా చూస్తుంటే అసలు ఈ పెళ్లి చేయడం కరెక్టేనా అనిపిస్తుంది అంటూ అపర్ణ చెప్తుంది.
దీంతో యామిని శాస్త్రి గారు వాళ్లు అలా చెప్తుంటే మీరేమీ మాట్లాడరేంటి ఇదంతా నిజమేనా..? అని అడుగుతుంది. అమ్మా నేను ఒకసారి పంచాంగం చూసి ముహూర్తం పెట్టానంటే అలాంటివేం జరగవు అంటాడు. అయితే ఇలా ఎందుకు జరిగింది అని ఇంద్రాదేవి అడుగుతుంది. దీంతో పంతులు ఏవో దుష్ట శక్తులు ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నాయి అంటాడు. ఇంతలో ప్రకాష్ కల్పించుకుని దుష్టశక్తులు ఆపుతున్నాయో లేక ఈ పెళ్లి జరగడమే దురదృష్టమో సరిగ్గా ఆలోచించి చెప్పండి పంతులు గారు ఎందుకంటే రెండు జీవితాలు ముడిపడ్డాక మనం ఏమీ చేయలేం కదా పంతులు గారు అంటాడు. ధాన్యలక్ష్మీ కూడా అవును పంతులు గారు వీళ్ల జాతకంలో ఏదైనా దోషం ఉందేమో ఒకసారి చూస్తే మంచిది కదా అంటుంది. దీంతో పంతులు చూడండి కర్ర అన్నాక విరుగుతుంది. పడవ అన్నాక మునుగుతుంది. దానికే మీరింతలా రాదాంతం చేయడం ఎందుకమ్మా అంటాడు.
దీంతో ఇద్రాదేవి పడవ మునిగితే పర్వాలేదు శాస్త్రి గారు అందులో మనుషులు ఉంటేనే ప్రమాదం కదా అసలే నా మనవడు యాక్సిడెంట్ అయి చావు వరకు వెల్లి వచ్చాడు. ఏ కీడు లేకుండానే.. ఈ కర్ర ఎందుకు విరిగింది. అని అడుగుతుంది. అయితే మీరు ఇంత భయపడుతున్నారు కాబట్టి ఆ దుర్గా మాతకు కుంకుమార్చన చేస్తే ఎటుంటి దోషాలు ఉన్నా పోతాయి అని చెప్తాడు. అందరూ పూజ చేయడానికి వెళ్తారు. అపర్ణ, ఇంద్రాదేవి ఇక ఈ పెళ్లిని ఆపాలంటే కనకం రావాల్సిందే అని పిలవగానే వెంటనే కనకం ప్రత్యక్షమవుతుంది. రాగానే కనకం నా కూతురు జీవితాన్ని అన్యయం చేయాలనుకుంటున్న ఆ యామిని నా చేతులతో కొట్టి చంపేస్తాను అంటూ ఆవేశంతో ఊగిపోతుంది.
దీంతో ఇంద్రాదేవి అమ్మా తల్లి అంత సాహసం చేయకు. మేము నిన్ను ఇక్కడికి పిలిపించింది రక్తపాతం సృష్టించడానికి కాదు అంటూ తాను ఎలా ఉండాలో ఎలాంటి నాటకం ఆడాలో చెప్పి పంపిస్తారు. తర్వాత కనకం లోపలికి వెళ్లి కావ్యను తిడుతుంది. తర్వాత రాజ్ వెళ్లి కావ్యతో మాట్లాడబోతుంటే కావ్య వెళ్లిపోతుంది రాజ్ చేయి పట్టుకోగానే కావ్య, రాజ్‌ను తిడుతుంది. రాజ్ అవేమీ పట్టించుకోకుండా నేను మీతో మాట్లాడాలి అంటూ తన మనసులో మాట చెప్తుంటే.. ఇంతలో యామిని వస్తుంది. రాజ్‌ను తీసుకుని లోపలికి వెళ్తుంది. మరోవైపు లోపలికి వెళ్లి పంతులును చూసి కనకం ఈ శాస్త్రి మా కాలనీలోనే ఉంటాడు. ఆయనకు ఒక వీక్‌నెస్ ఉంది. ఆ వక్‌నెస్ మీద దెబ్బ కొడితే సరిపోతుంది అని కనకం చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?