E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరి ప్లానేంటి..? శ్రీయకు నొప్పులు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరి ప్లానేంటి..? శ్రీయకు నొప్పులు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 3rd : భరత్ కోసం అవని అక్షయలు రోడ్డుపై వెతుకుతూ ఉంటారు. ఇంకా భరత్ కనిపించలేదు ఏంటి? ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని వెతుకుతూ ఉండగా రాజేశ్వరి భారత్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావా ఎందుకు ఇలా చేశావు అని భరత్ ని మళ్ళీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. అయితే అవనికి ఫోన్ చేసి భరత్ ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అని చెప్పగానే చాలా సంతోషపడుతుంది..

చక్రధర్ తో రాజేశ్వరి గొడవ..

భరత్ నీ ఇంటికి తీసుకొచ్చానని రాజేశ్వరి చెప్పగానే అవని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. భరత్ ఇంటికి వెళ్ళాడు కదా ఇక మనం మన ఇంటికి వెళ్లి పోదాం పదండి అని అవని అనగానే.. అక్షయ్ అదేంటి మీ ఇంటికి వెళ్లాలి కదా అని అడుగుతాడు.. మనం ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏం చేస్తాం. వాళ్లు వాళ్లు చూసుకుంటారు మనం మధ్యలో ఎందుకు ఇంకా అనేసి అవని అంటుంది. చక్రధర్ కి ఫోన్ చేసి అవని అసలు విషయాన్ని చెప్తుంది. సరే అమ్మ నేను ఇంటికి వెళ్తాను అని చక్రధరంటాడు.. ఇక చక్రధర్ ని చూడగానే రాజేశ్వరి కోపంగా ఉంటుంది. సొంత ఇంటిని కట్టుకున్న భార్యని వదిలేసి ఈ వయసులో ఇక్కడ ఉండడమేంటి అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇక చక్రధారి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.

ఇంట్లోకి రాగానే భరత్ రచ్చ..

Advertisement

ఇంట్లోకి వచ్చిన భరత్ ఈ ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నా గురించి ఆలోచించే వాళ్ళు కూడా లేరు అని చాలా కోపంగా అన్ని విసిరి కొడుతూ ఉంటాడు. ప్రణతి వెళ్లిపోయిందని బాధపడిపోతూ ఉంటాడు. నేను ఇలా అనుసరించులుగా వెతకడం నా భార్య కూడా ఇష్టం లేదనుకుంటాను అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని భరత్ ఫీల్ అవుతూ ఉంటాడు. మీనాక్షి భోజనం తెచ్చి పెట్టిన సరే ఆ భోజనాన్ని విసిరి కొట్టేస్తాడు భరత్. నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇప్పుడు నేను ఎలా తింటానని అనుకున్నారు అని భరత్ అనగానే మీనాక్షి ఎందుకురా ఇలా మారిపోయావు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజేశ్వరి మాత్రం మీనాక్షి వద్దనుకుంటున్నాడు నా దగ్గరికి రావాలని అనుకుంటున్నాడు అని చాలా సంతోషంగా ఉంటుంది.

శ్రీయకు సడెన్గా నొప్పులు స్టార్ట్..

శ్రీయ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది.. ఆ సమయంలో తనకి పొట్టలో ఏదో నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక శ్రీకర్ పండ్లు తెచ్చి ప్లేట్లో ఇవ్వగానే తింటూ ఉండగా ఒక్కసారిగా నొప్పి అని అరుస్తుంది.. ఏమైంది శ్రేయ ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతాడు. నాకు సడన్గా నొప్పి వస్తుంది హాస్పిటల్ కి వెళ్దామని శ్రియ అడుగుతున్నా సరే శ్రీకర్ మాత్రం అవనికి ఫోన్ చేసి మా వదిన ను తీసుకొని వస్తాను అని అంటాడు. శ్రేయ సడన్ గా కడుపులో నొప్పి అంటుంది వదిన నువ్వు ఒకసారి అర్జెంటుగా రావా అని శ్రీకర్ అడుగుతాడు.. అవని వెంటనే శ్రీకర్ ఇంటికి వెళ్దాం అండి. సడన్గా శ్రేయకు నొప్పి వచ్చింది అంట అని చెప్పగానే అక్షయ్ శ్రీకర్ వాళ్ళింటికి తీసుకొని వెళ్తాడు..

అవని చేసిన పనికి శ్రీయా కన్నీళ్లు..

Advertisement

శ్రీకర్ ఇంటికి బయలుదేరిన అవని అక్కడ శ్రేయాన్ని చూసి షాక్ అవుతుంది. ఏమైంది ఎందుకు ఇలా సడన్గా నొప్పి వచ్చింది అని అడుగుతుంది. పొట్ట అంత గట్టిగా ఉంది కాసేపు అటు ఇటు నడిస్తే తగ్గిపోతుంది అని అవని అంటుంది. కానీ శ్రేయ మాత్రం నేను లేవలేను నడవలేను అని బాధపడుతూ ఉంటుంది. అయితే వంటగది ఎక్కడ అని శ్రీకర్ని అడిగిన అవని అక్కడికి వెళ్లి తనకోసం ఒక కషాయం చేసుకొని వస్తుంది. ఇది తాగితే నొప్పి వెంటనే తగ్గిపోతుంది అని అవని అంటుంది. శ్రేయ చేత బలవంతంగా కషాయాన్ని తాగిస్తారు. కొద్దిసేపటి తర్వాత నొప్పి తగ్గిపోతుంది. కడుపుతో ఉన్న వాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటే ఇలాంటి బాధలే పడాలి అందుకే అందరం కలిసి ఉంటాము అని అంటుంది అని క్లాస్ పీకుతుంది అవని. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో శ్రీయ శ్రీకర్లు ఇద్దరూ మళ్లీ తమ ఇంటికి వస్తే పల్లవికి మాత్రం షాకే. ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: కామాక్షి ఎంట్రీ అదుర్స్.. అర్ముఖంను ఆడుకున్న బాలు.. రోమతి తో మైండ్ బ్లాక్..

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×