BigTV English

Intinti Ramayanam Today Episode : అవనికి అక్షయ్ దూరం.. మీనాక్షినికి వార్నింగ్ ఇచ్చిన చక్రధర్..

Intinti Ramayanam Today Episode : అవనికి అక్షయ్ దూరం.. మీనాక్షినికి వార్నింగ్ ఇచ్చిన చక్రధర్..

Intinti Ramayanam Today Episode November 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ పెళ్లిరోజు వేడుకలను ఇంట్లో వాళ్ళు ఘనంగా జరుపుతారు.. అవనిని దారుణంగా అవమానించాలి అని అనుకుంటుంది పల్లవి. కానీ పల్లవి ప్లాన్ ప్రకారం రావడం ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. ఇక అతను అందరిలోకి మెల్లగా వెళ్తాడు. ఎవరికి అనుమానం రాకుండా గెస్ట్ లాగా తిరుగుతాడు.. అవని నగలు ఇచ్చిందని అతను చెబుతాడు. దానికి ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. ఇక అవని తప్పు ఏమి లేకపోవడంతో అంతా హ్యాపిగా ఫీల్ అవుతారు.. ఇక పల్లవి రాత్రి అందరికి కోపం తెప్పించేలా మాట్లాడుతుంది. అక్షయ్ కు అనుమానం వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. గదిలోకి వెళ్లిన అక్షయ్ లైట్ ఆఫ్ చేసి ఉండటం చూసి ఎందుకు రూమ్ లో లైట్ ఆఫ్ చేశావని అడుగుతాడు. అప్పుడు ఎదురుగా అవని రొమాంటిక్ గా రెడీ కనిపిస్తుంది. అవనిని అలా చూసి షాక్ అయిన అక్షయ్ తో అవని నన్ను దూరం పెడతావా అని బాధ పడుతుంది. ఇక నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు.. ఎందుకు అబద్దం చెప్పావు.. ఇంటికి వస్తే ఉన్నానని ఎక్కడో ఉండి అబద్దం చెప్పావు. అసలేం జరుగుతుంది. నిజం చెప్పు నిన్న ఎవడో వచ్చి బాయ్ ఫ్రెండ్ అని అన్నాడు. ఇక ఎంత కాలం దాచిపెడతావు.. మొగుడుకు చెప్పుకోలేని సీక్రెట్స్ ను ఉన్నాయా? ఎవరైనా ఫోన్ చేస్తే బయటకు వెళ్లి మాట్లాడుతావు. ఇదంతా ఎందుకు ఏమైంది.. ఎవరికోసం వెళ్తున్నావ్ అని నిజం చెప్పేవరకు మనం ఎవరికీ వారే అన్నట్లు ఉంటాం.. బయట వాళ్లకు మనం మాత్రమే మనం భార్య భర్తలు అంతే అంటారు.

ఇక చక్రధర్ చేతికి గాయం తగిలితే హాస్పిటల్ కు వెళ్తాడు. అక్కడ మీనాక్షిని చూస్తాడు. అయితే రాజేశ్వరి ఉందని వస్తాడు. ట్రీట్మెంట్ అవ్వగానే రాజేశ్వరి డాక్టర్ని వెళ్ళొస్తాం అంటుంది. అప్పుడు డాక్టర్ వెళ్ళొస్తామని హాస్పిటల్ లో చెప్పకూడదమ్మా అనేసి అంటాడు. దానికి రాజేశ్వరి అయితే గుడ్ నైట్ అండి అని చెప్తుంది. ఇక చక్రధర్ తో డాక్టర్ మీరు ఎప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరు చెప్తే మీ దగ్గరికి నేను డాక్టర్లని పంపిస్తాను అనేసి చెప్తాడు. ఇక అక్కడి నుంచి రాజేశ్వరి చక్రధర్ బయటికి వెళ్తారు. రాజేశ్వరిని నువ్వు వెళ్లి కార్లో కూర్చో నేను డాక్టర్ తో పర్సనల్ గా మాట్లాడాలని చక్రధర్ లోపలికి వెళ్తాడు. చక్రధర్ లోపలికి రావడం చూసిన మీనాక్షి షాక్ అవుతుంది.


నువ్వు హైదరాబాద్ కి ఎందుకు వచ్చావు అనేసి మీనాక్షిని చక్రధర్ అడుగుతాడు. నా ఆస్తిలో వాటర్ కోసం వచ్చావా నీ పిల్లల్ని నా కొడుకులుగా నా వారసులుగా పరిచయం చేయాలని అనుకుంటున్నావా అని చక్రధర్ మీనాక్షిని అడుగుతాడు. ఇక మీనాక్షి నీలాంటి నీచుని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పు ఇంక నీ ఆస్తి అంటావా నాకు గడ్డిపరకతో సమానం చక్రధర్ తో వాదనకు దిగుతుంది. నా ఆస్తి మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు అర్థమైంది. నా జోలికొచ్చిన నా గురించి నీ పిల్లలకు చెప్పిన అందరినీ చంపేస్తాను తెలుసు కదా అనేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మీనాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది నా పిల్లల్ని కాపాడుకోవాలి అని భయపడుతూ ఉంటుంది. ఇక భరత్ అప్పుడే వచ్చి వాళ్ళ అమ్మకి జరిగిన విషయం చూసి డాక్టర్ని పిలుస్తాడు. ఇక అవని వాళ్ళ ఇంట్లో అందరూ పూలు కడుతూ ఉంటారు.

అప్పుడే అవనికి ఫోన్ వస్తుంది. అవని ఈ టైం లో భరత్ ఫోన్ చేస్తున్నాడేంటి? అమ్మకు ఏమైనా అయిందా అని ఆలోచిస్తూ ఫోన్ ని కట్ చేస్తుంది. ఇక పల్లవి అవని మొహం చూసి ఇది అక్షయ్ అన్న మాటలకి ఫీలవుతున్నట్టు ఉంది అనేసి అనుకుంటుంది. అందరూ ఏమైంది అనేసి అడుగుతారు. కానీ అవని నా భర్తకే చెప్పుకోలేకున్నాను మీకెలా చెప్తానని అనుకుంటారు అత్తయ్య నన్ను క్షమించండి అనేసి మనసులో అనుకుంటుంది. ఇక ఎక్కిళ్ళు వస్తున్నట్టు యాక్ట్ చేసి లోపలికి వెళ్తుంది. భరత్ తో ఫోన్ మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రాత్రి బయటకు వెళ్లడం అక్షయ్ చూస్తాడు. మీనాక్షి ని కలిసి ఏమైందని అడుగుతుంది. మరి అక్షయ్ కు నిజం తెలుస్తుందా చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని ఇరికించబోతున్న పల్లవి.. శ్రీకర్ కు డెడ్ లైన్.. అక్షయ్ డబ్బులు కొట్టేసింది ఎవరు..?

GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. రెండో పెళ్లికి సత్యం రెడీ.. ఫ్రెండ్ ను కలిసిన బాలు..

Nindu Noorella Saavasam Serial Today october 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్ ఇచ్చిన అంజు  

Illu Illalu Pillalu Today Episode: వేధవతికి క్లాస్ పీకిన రామరాజు.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today October 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ప్లాన్ సక్సెస్‌ – కావ్యను కలవని డాక్టర్‌

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం రచ్చ చేసిన శ్రీయా.. అన్నదమ్ముల మధ్య గొడవ..పల్లవి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today October 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన సందీప్‌ – డాక్టర్‌ కలవాలనుకున్న కావ్య

Big Stories

×