BigTV English

Credit Card New Rules Apply: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్, నేటి నుంచి కోతలు, వాతలు.. తస్మాత్ జాగ్రత్త

Credit Card New Rules Apply: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్, నేటి నుంచి కోతలు, వాతలు.. తస్మాత్ జాగ్రత్త

Credit Card New Rules Apply: ముందు అలవాటు చేస్తారు.. ఆ తర్వాత వడ్డిస్తారు.. ఇండియాలో కొత్త ట్రెండ్. పీకల్లోతుల్లో మునిగిపోయిన తర్వాత తెలుసుకోవడం కామన్‌మేన్ వంతు. దీనికి ఏ ఒక్క సెక్టానేకో పరిమితం కాలేదు. చివరకు సెల్‌ఫోన్ కంపెనీలు సైతం అదేబాటను ఫాలో అవుతున్నాయి.


రైల్వేస్టేషన్లు, బస్ట్‌స్టేషన్ వద్ద మనకు బ్యాంకు  ఉద్యోగులు కనిపిస్తారు. సార్.. మా బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకుంటే ‘ఊహించలేని’ బెనిఫిట్స్ వస్తాయని చెబుతారు. క్షణాల్లో మీకు క్రెడిట్ కార్డును ఇచ్చేస్తామని చెబుతారు. కొందరు అవసరం నిమిత్తం వారి బుట్టలో పడిపోతారు. తీరా తెలుసుకునే సరికి నిండా మునిగిపోతారు.

క్రెడిట్ కార్డులు తీసుకునే, వాడుకునే వినియోగదారులకు నవంబర్ ఒకటి నుంచి స్ట్రాంగ్ హెచ్చరిక. నేటి నుంచి కొత్త రూల్స్ వచ్చాయి. రికార్డు పాయింట్లు, ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లింపులు, ఫ్యూయెల్ సర్ ఛార్జీల విషయంలో వాతలతోపాటు కోతలు పడనున్నాయి.


దేశంలో అతి పెద్ద బ్యాంకులు ఎస్‌బీఐ, ఐసీఐసీఐలు నవంబర్ ఒకటి నుంచి తమ క్రెడిట్ కార్డు నిబంధనల్లో ఊహించని మార్పులు చేపట్టారు. ఒకవేళ క్రెడిట్ కార్డు వాడితే వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకెందుకులే అని నిర్లక్ష్యం చేస్తే  కోతలు పడడం ఖాయం.

ALSO READ:  ట్రైన్ టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

ఎస్ఐబీ చేసిన మార్పుల్లో రివార్డు పాయింట్లు వ్యాలిడిటీని మార్చేసింది. నిర్ణీత సమయంలోపే వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేస్తే అదనపు ఛార్జీలు వినియోగదారుడు భరించాల్సి ఉంటుంది.

ఇన్‌సెక్యూర్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఫైనాన్స్ ఛార్జి నెలకు 3.75 శాతం నుంచి మొదలవుతుంది. బిల్లింగ్ వ్యవధిలో చెల్లింపులు మొత్తం 50 వేల కంటే ఎక్కువగా ఉంటే ఒక శాతం ఛార్జ్ విధిస్తారు. ఆటోడెబిట్ లావాదేవీలపై అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది.

ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు విషయానికొద్దాం. ప్రైవేటు బ్యాంకింగ్ సెక్టార్‌లో అతి పెద్దది. ఈ బ్యాంకు సైతం కొన్ని నిబంధనలను మార్చేసింది. క్రెడిట్ కార్డులపై ఇంధన సర్ ఛార్జీలపై ఇచ్చే మినహాయింపుల్లో స్వల్పంగా మార్పులు చేసింది. కొన్ని కార్డుల్లో దీన్ని తొలగించింది. కొన్నింటికి మాత్రమే పరిమితం చేసింది.

ఇన్యూరెన్స్, కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ సహా వివిధ సేవలపై ప్రభావం పడనుంది. రివార్డుల పాయింట్లలో రిడెంప్షన్ ప్రక్రియను మార్చేసింది. ఈఎంఐ కార్డుల్లో చేసిన కొనుగోళ్లపై వడ్డీ రేట్లలో మార్పులు తప్పవు. లావాదేవీలను బట్టి కొత్త వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఓవరాల్‌గా ఎటు చూసినా వినియోగదారుడి జేబుకు చిల్లు పడడం ఖాయమన్నమాట.

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×