BigTV English
Advertisement

Intinti Ramayanam Today Episode : అవనికి సారీ చెప్పిన అక్షయ్.. పల్లవి ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరికి చెప్పిన అవని..

Intinti Ramayanam Today Episode : అవనికి సారీ చెప్పిన అక్షయ్.. పల్లవి ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరికి చెప్పిన అవని..

Intinti Ramayanam Today Episode November 5th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే… దీపావళి పూజకు సిద్ధం చేస్తారు. ఇక అవని పూజకు ఏర్పాటు చేస్తుంది. ఇక ఉదయం అవని అందరు రెడీ దీపావళి పూజలు చేస్తారు. ఇక పూజ పూర్తి అయ్యే సమయానికి కమల్ అక్కడకు వస్తాడు. కాఫీ కావాలి అని అరుస్తాడు. కాఫీ అని అడగటంతో అందరికీ హారతి మీరు ఇవ్వండి అత్తయ్య నేను వెళ్లి కమల్ కి కాఫీ ఇస్తానని అవని వెళ్తుంది. పండగ పూట కూడా ఏంటి కన్నయ్య అని అవని అడుగుతుంది. నాకు కాఫీ కావాలి వదిన అని కమల్ అడుగుతాడు. ఈరోజు పండగ నువ్వు వెళ్లి బ్రష్ చేసి స్నానం చేసి రా అప్పుడే నీకు కాఫీ అని అంటుంది. రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తాడు. పండగ పూట కూడా ఇలా బాధ్యత లేకుండా రాజేంద్రప్రసాద్. అప్పుడు కమల్ అందరూ తిడుతుంటే నవ్వుతాడు. ఎందుకురా తిడుతుంటే నవ్వుతున్నావ్ అని అడుగుతారు. నన్నే తిడుతున్నారు ఇంకా పల్లవి నిద్రపోతుంది మరి పల్లవిని ఎలా తిడతారు అనేసి నవ్వుతున్నా అని అంటాడు. కమల్ బావ పెట్టే గురకవల్లే నాకు నైట్ నిద్ర పట్టడం లేదు అందుకే ఉదయం ఆలస్యం అవుతుందని చెప్తుంది. ఇక అక్షయ్ అవనిని అందరి ముందు తిడతాడు.అందరు షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఏడవడం చూసి పల్లవి మురిసిపోతుంది. ఇలా ఏడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి సంబరపడిపోతుంది. శ్రీకర్ బావను నాకు దూరం చేసి శ్రియతో పెళ్లి చేశావు.ఇద్దరి మధ్య వాదన వినిపిస్తుంది. చివరికి నన్ను ఏడిపించాలని నాతో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నావ్ నేను అంత సులువుగా ఓడిపోతానని అనుకోవద్దు పల్లవి అని అవని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక కమల్ గేమ్ ఆడుకుంటూ కనిపిస్తాడు. అప్పుడు బామ్మ అక్కడికి వచ్చి పెళ్ళాంతో సరదాగా షికారుకి వెళ్ళడం షాపింగ్ కి వెళ్ళడం కాపురం చేయడం లాంటివి లేవు ఇలా గేమ్స్ ఆడితే పిల్లలు ఎలా పుడతారు అనేసి అడుగుతుంది. గేమ్ ఆడడం అంత ఈజీ అనుకుంటున్నావు అని కమల్ భామకు గేమ్ నేర్పిస్తాడు. గేమ్లో బామ్మ ఓడిపోతుంది. కమల్ ఫోను విసిరి కొడుతుంది. గేమ్ ఓడిపోయాను నాకు బీపీ పెరుగుతుంది వెళ్లి మాత్రం వేసుకోవాలని లోపలికి వెళ్తుంది. కమల్ ఫోన్ పని చేయకపోవడంతో లోపలికి వెళ్లి ఛార్జింగ్ పెట్టాలని అనుకుంటాడు చార్జింగ్ ఎక్కట్లేదు ఫోన్ పగలగొట్టేసింది అనేసి ఫీల్ అవుతాడు. పల్లవి వాంతులు చేసుకోవడం చూసి పల్లవి ప్రెగ్నెంట్ అని గంతులు వేస్తాడు.. పల్లవి బయటకు రాగానే అడుగుతాడు. ఏమైందని ఊరికే అని చెబుతుంది. అవునా నేను ఇంకా నువ్వు ప్రెగ్నెంట్ ఏమో అనుకున్నా అనుకుంటాడు..

అదేం లేదులే నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. ఇక కమల్ ఆరాధ్య దగ్గర కూర్చుని గేమ్ ఎలా ఆడాలి అని నేర్పిస్తాడు. అది అక్షయ్ చూస్తాడు ఆరాధ్య నువ్వు ఎప్పటి నుంచి మొబైల్ పట్టుకొని గేమ్స్ ఆడుతున్నావ్ అని అడుగుతాడు .దానికి ఆరాధ్య నేను కాదు నాన్న బాబాయ్ నేర్పిస్తాను అన్నాడు అనేసి అంటుంది. కానీ ఇప్పుడు మొబైల్ వల్ల చెడిపోతున్నారనేసి ఆరాధ్యను తిడతాడు. ఇక కమల్ ని కూడా అక్షయ్ తిడతాడు. ఇంకెప్పుడూ ఆరాధ్యకు మొబైల్ ఇవ్వద్దని అంటాడు. ఆరోగ్యం మనిద్దరం వెళ్లి ఆడుకుందాం రా అని అక్షయ్ అంటాడు. నేను నీతో ఆడుకోను బాబాయ్ తోనే ఆడుకుంటానని ఆరాధ్య అంటుంది. ఏమైందమ్మా ఎందుకంటున్నావంటే నువ్వు మమ్మీని తిట్టావు అందుకే నేను నీతో మాట్లాడను నీతో మాట్లాడను అనేసి ఆరాధ్య అంటుంది. దానికి కమల్ కూడా వదిన చాలా మంచిది నువ్వు ఎన్ని తింటా అసలు నువ్వు సారీ చెప్పాల్సిందే అని అంటాడు. నువ్వు సారి చెప్పేంతవరకు నేను నీతో మాట్లాడను మాట్లాడను అనేసి ఆరాధ్య అంటుంది. నువ్వు సారీ చెప్పాల్సింది అని ఇద్దరు అవని దగ్గరికి అక్షయ్ ని తీసుకొని వెళ్తారు. కొరియర్ అని కొరియర్ బాయ్ పిలవగానే అవని బయటకు వెళ్తుంది. పల్లవి గారికి కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ చెప్తాడు. అవని పల్లవి నా సిస్టర్ ఇవ్వండి నేను తీసుకుంటానని చెబుతుంది. అప్పుడే పల్లవి వచ్చి ఇది నా కొరియర్ అనేది తీసుకుంటుంది. అందులో ఏముంది పల్లవి అని అడిగితే నీకెందుకు చెప్పాలి అని లోపలికి వెళ్తుంది. పల్లవి వెళ్తున్న టైం లో అందులో నుంచి స్లిప్పు కింద పడిపోతుంది .ఆ స్లిప్పు తీసుకున్న అవని ప్రెగ్నెంట్ టెస్ట్ కోసం కిట్టని తెలుసుకుంటుంది. అది చూస్తున్నప్పుడే కమల్ అక్షయ్ అక్కడికి వస్తారు. వదినకు సారీ చెప్పు అని కమల్ తోస్తాడు అవని మీద పడతాడు అక్షయ్. అవని అబద్ధం చెప్పిందని గుర్తొచ్చి అవ్వనిని కింద పడేసి వెళ్ళిపోతాడు.


ఇక పల్లవి ప్రెగ్నెన్సీ టెస్ట్ ని చేసుకుంటుంది అందులో పాజిటివ్ వస్తుంది. డాక్టర్ కి ఫోన్ చేస్తుంది డాక్టర్ కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయదు ఇలా కాదు నేను డాక్టర్ దగ్గరికి ఎల్లేసి నేరుగా తెలుసుకోవాలని వెళుతుంది. తలుపు తీయగానే. పార్వతి ఉంటారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం కిట్టు తెప్పించుకున్నావంట ఏం వచ్చింది అని అడుగుతారు. అవి దాన్ని తీసుకొచ్చి పాజిటివ్ వచ్చింది అత్తయ్య పల్లవి ప్రెగ్నెంట్ అని అంటుంది, పల్లవి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఇంట్లో అందరూ సంబరి పడిపోతారు. ఇక ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ తో చెప్పాలని పార్వతీ వెళ్తుంది. ఇంట్లో అందరూ కలిసి పల్లవికి కమల్ కి కంగ్రాట్స్ చెప్తారు . అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంట్లో దీపావళికి దీపాలు పెడతారు. అవనికి అక్షయ్ సారీ చెప్పడం చూసి పల్లవి షాక్ అవుతుంది . రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big tv Kissik Talks: రాజు జీవితంలో రాణి లేదు.. బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన రాజు!

Big tv Kissik Talks: డ్యాన్సర్లు అంటే అంత చులకనా… ఎమోషనల్ అయిన రాజు!

Illu Illalu Pillalu Today Episode: సేనకు నర్మద వార్నింగ్.. భాగ్యంకు దిమ్మతిరిగే షాక్.. రామా రాజు ఇంట పెద్ద గొడవ..

Nindu Noorella Saavasam Serial Today November 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి ప్లాన్ సక్సెస్ 

Brahmamudi Serial Today November 5th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై శ్రీయ సీరియస్..తల్లి రాకతో అవని హ్యాపీ.. ఫ్రెండ్ ను కలిసిన పల్లవి..

GudiGantalu Today episode: మనోజ్ పై బాలుకు అనుమానం..బాలు, మీనాను దారుణమైన అవమానం.. ప్రభావతికి టెన్షన్..

Tv Serials Heros Remuneration: సీరియల్ హీరోల రెమ్యూనరేషన్.. అందరికంటే ఎక్కువ అతనికే..?

Big Stories

×