BigTV English

Director Krish Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన డైరెక్టర్ క్రిష్.. వధువు ఎవరంటే..?

Director Krish Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన డైరెక్టర్ క్రిష్.. వధువు ఎవరంటే..?

Director Krish Second Marriage : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు అందుకున్న డైరెక్టర్ క్రిష్ (Director Krish) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత కొన్నాళ్ల క్రితం రమ్య (Ramya ) అనే ఒక డాక్టర్ ను ఈయన వివాహం చేసుకున్నారు. అయితే ఆమెతో విభేదాలు రావడం వల్లే మ్యూచువల్ డివోర్స్ తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం.. డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారట. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన మళ్లీ ఒక డాక్టర్ నే వివాహం చేసుకోబోతున్నట్లు తెలిసింది.


రెండో పెళ్లికి సిద్ధమవుతున్న డైరెక్టర్ క్రిష్..

అయితే ఆమెకు కూడా అప్పుడే వివాహం జరిగి, తన భర్త నుంచి విడాకులు అయ్యాయని, ఆమెకు 11 ఏళ్ళ కుమారుడు కూడా ఉన్నాడని, అలాంటి ఆమెతో ఈయన ఇప్పుడు వివాహానికి సిద్ధమవుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదటి భార్య లాగే ఇప్పుడు రెండవ కాబోయే భార్య కూడా డాక్టర్ కావడంతో డాక్టర్లను డైరెక్టర్ క్రిష్ వదిలేలా లేడే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.


పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్..

డైరెక్టర్ క్రిష్ విషయానికి వస్తే.. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను అలరించే ఈయన , చివరిగా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కాంబినేషన్లో వచ్చిన ‘కొండపొలం ‘అనే సినిమా చేశారు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకకపోవడం, ఆయన రాజకీయాలలో బిజీ అవడం కారణంగా ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు. ఇక ఈయన స్థానంలో నిర్మాత AM .రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

అనుష్కతో ఘాటి మూవీ..

ఇకపోతే డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో ‘ఘాటి ‘అనే సినిమా చేస్తున్నారు .ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని, మళ్లీ తన కెరీర్ ను గాడిలో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏ మేరకు ఆయన కెరియర్ సక్సెస్ అవుతుందో చూడాలి. ఇకపోతే ఇదివరకే డైరెక్టర్ క్రిష్ – అనుష్క కాంబినేషన్లో ‘వేదం’ సినిమా వచ్చింది. వేదం సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే సినిమా షూటింగ్ మరో మూడు రోజుల్లో కంప్లీట్ చేసి అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ తో పాటు స్పెషల్ గ్లింప్స్ తో పాటు ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా ఈసారి అనుష్కను ఈయన ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు అనే విషయాలు కూడా ఆసక్తికరంగా మారాయి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×