E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : అవనిని దూరం పెట్టేసిన అక్షయ్.. పల్లవి అబార్షన్ ప్లాన్ అవనికి తెలిసిపోతుందా?

Intinti Ramayanam Today Episode : అవనిని దూరం పెట్టేసిన అక్షయ్.. పల్లవి అబార్షన్ ప్లాన్ అవనికి తెలిసిపోతుందా?
Advertisement

Intinti Ramayanam Today Episode October 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని భర్త రాలేదని టెన్షన్ పడుతుంది. కానీ పల్లవి మాత్రం నీ భర్త తాగేసి వస్తాడు ఇక నీకు ఉంటుంది అని పల్లవి మనసులో అనుకుంటుంది. ఇక అక్షయ్ తన ఫ్రెండ్ తో కలిసి ఫుల్లుగా తాగేసి వస్తాడు. ఇక అవని భర్త తాగేసి వచ్చాడని షాక్ అవుతుంది. ఇంట్లో అందరు చూస్తే బాధ పడతారు అని అక్షయ్ ను లోపలికి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. ఇక అక్షయ్ తనని అవని మోసం చేసిందని ఫీల్ అవుతాడు. ఇక పల్లవి నాకు కావాల్సింది ఇదే అని సంబరపడిపోతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇవాళ రాత్రి అక్షయ్ తాగి రావడం చూసి పల్లవి సంతోష పడుతుంది. ఇది కదా నాకు కావాల్సింది అని మురిసిపోతుంది. ఒక్కరోజు తాగించినందుకే ఇంత ఫీలవుతుంది ఇక రోజు తాగి వస్తే ఇంకా ఎలా ఉంటుందో అనేసి పల్లవి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది . పల్లవి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే కమల్ రూమ్లో బెడ్ పై పూల్ చల్లుతూ ఉంటాడు. ఏంటి ఇదంతా అనేసి పల్లవి కమలని అడుగుతుంది నాకు డేట్ అన్న సంగతి తెలుసు కదా మరి ఇదంతా ఏంటి అనేసి పల్లవి కమ్మలు కోపంతో తిడుతుంది ఈరోజు 12 తర్వాత నీకు ఐదు రోజులు వస్తాయి అప్పుడు మనము ఎంజాయ్ చేయొచ్చు అందుకే చిన్న సెటప్ చేశానని కమలంటాడు దానికి పల్లవి ఇంకా కోపంతో నీకు ఏమైనా పిచ్చా అనేసి కమల్ ని అరుస్తుంది అప్పుడు కమల్ బామ్మా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు డేట్ వచ్చిన ఆడవాళ్లు కోపంగా ఉంటారని ఆలోచించి నీకు కోపం తగ్గిస్తాను. సరే నువ్వు ఉండు నేను వెళ్లి బయట పడుకుంటాను అనేసి అంటాడు. ఇక పల్లవి వీరికి శోభనం కావాలంట వీడితో నాకేంటి శోభనం అనేసి ఇంకా మొత్తం అన్ని విసిరి కొట్టేసి పడుకుంటుంది. పొద్దున్నే అక్షయ్ లేవగానే తలనొప్పి ఉంటుంది. ఇంత హ్యాంగ్ ఓవర్ ఉంటుంది అని తెలిస్తే నేను అసలు తాగే వాడినే కాదు తల మీద ఎవరో సుత్తితో కొట్టినట్టు ఉంది అనేసి లేస్తూనే ఉంటాడు. అప్పుడే అవని మజ్జిగ తీసుకొని వస్తుంది. నామీద ఎందుకు అంత కోపం కనీసం మీ మజ్జిగైన తాగండి నా మీద కోపాన్ని మీరు మజ్జిగ మీద చూపించకండి అనేసి అవని అక్షయ్ తో అంటుంది. కానీ అక్షయ్ నాకు అవసరం లేదు నువ్వు నన్ను మోసం చేసావు అనేసి మజ్జిగ క్లాసులో విసిరి కొట్టేస్తాడు.

Advertisement

ఇక అందరూ కింద టిఫిన్ చేస్తూ ఉంటారు. కమల్ తిండిని చూసి అందరూ వింతగా చూస్తారు. అప్పుడే అక్షయ్ వచ్చే అక్కడ కూర్చుంటాడు. ప్రణవి నాకు టిఫిన్ పెట్టు అని అడుగుతాడు. ఆరాధ్య మమ్మీ పెడుతుంటే ఎందుకు వద్దన్నావ్ డాడీ అని అడుగుతుంది. దానికి అక్షయ్ నీకు స్కూల్ కి టైం అయింది నువ్వు ముందు తిను వెళ్ళు అనేసి అంటాడు వీరిద్దరిని చూసి పల్లవి మురిసిపోతుంది. గొడవ మొదలైంది అనుకున్నాను కానీ ఇంత ముదురుతుంది అనుకోలేదు అనేసి ఇందులో లోపల సంతోషపడుతుంది. పల్లవి బయటకి వెళ్తుంది పల్లవి బయటకు వెళ్తుంది వాంతులు చేసుకుంటుంది. అవని వాంతులు అవ్వడంతో టెన్షన్ పడుతూ చక్రధర్ కి ఫోన్ చేస్తుంది. హాస్పిటల్ కి వెళ్దాం డాడీ అనేసి చక్రధర్తో పల్లవి మాట్లాడుతుంది. అలా ఫోన్ పెట్టేసి పల్లవి వెనక్కి తిరగని అవని ఎక్కడ ఉంటుంది. అవని వాళ్ళ నాన్నతో మాట్లాడిన విషయం వినిందేమో అని పల్లవి టెన్షన్ పడుతుంది. కానీ పల్లవి వాంతులు చేసుకుంటున్నావేంటి ఏమైంది చెప్పు అనేసి గుచ్చి గుచ్చి అడుగుతుంది. పల్లవి మాత్రం నాకు హైజేనిక్ గా ఉండాలి అది ఫుడ్ విషయంలో అయినా ఏదైనా కానీ నీట్ గా ఉండాలని అనుకుంటాను. చట్నీలో హెయిర్ వచ్చింది అందుకే వాంతి అయ్యింది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది.

ఇక అవని తన తల్లి మీనాక్షికి ఫుడ్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళుతుంది. అమ్మ తమ్ముడికి తన చేత్తో భోజనం తినిపిస్తుంది. అవని ఆ తర్వాత పడుకోవద్దని మీనాక్షిని అలా వాకింగ్ చేయాలని బయటకు తీసుకొస్తుంది. ఇక చక్రధర్ పల్లవి ఇద్దరు అబార్షన్ చేయించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు బయట వెయిట్ చేయండి అని చెప్పి డాక్టర్ బయటకు పంపిస్తుంది. అవని మీనాక్షి చక్రధర్ ని చూసి షాక్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తున్నారని సిస్టర్ ని అవని అడుగుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది .. రేపటి ఎపిసోడ్లో తన తల్లిని తీసుకొని గదిలోకి వెళ్తుంది అవని ఆ తర్వాత అక్కడి నుంచి సిస్టర్ ని పిలిచి ఏమైంది వాళ్ళిద్దరు వచ్చారు ఏదైనా సమస్య అడుగుతుంది. ఆమె గర్భవతి అబార్షన్ చేయించుకోవాలని వెయిట్ చేస్తుంది అని చెప్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో పల్లవి మ్యాటర్ ని అవనీ ఇంట్లో చెప్పేస్తుందా? పల్లవి కడుపు పోకుండా అడ్డుపడుతుందా చూడాలి..

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×