BigTV English

Prabhas Fans: ప్రభాస్‌ని చూడాలంటూ.. జూబ్లీహిల్స్‌లో అభిమానులు హల్‌చల్‌

Prabhas Fans: ప్రభాస్‌ని చూడాలంటూ.. జూబ్లీహిల్స్‌లో అభిమానులు హల్‌చల్‌

Prabhas Fans: జూబ్లీహిల్స్ లోని సినీ హీరో ప్రభాస్ అభిమానులు హల్ చల్ చేశారు. అర్ధరాత్రి జూబ్లీహిల్స్ వద్ద భారీగా చేరుకుని, అక్కడ తమ నడుడ్ని చూడాలని డిమాండ్ చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయంత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రభాస్ అభిమానులకి, పోలీసులకి వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభాస్‌ ని కలవాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు. అభిమానులు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు.


ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులకు పండుగే పండుగ. పాన్ ఇండియా లెవల్‌లో ఉంటుంది హవా. ప్రభాస్ సినిమాల నుంచి ఏ చిన్న అప్డేట్ అయిన రాకపోతుందా అని ఫాన్స్ తెగ ఎదురుచూస్తుంటారు. ఇక అందరి ఆలోచనలకి తగ్గట్టే ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్‌ని లైన్ పెట్టాడు. ఒక దాని మించి మరొకటి అనేలా ఉన్నాయి డార్లింగ్ అప్ కమింగ్ సినిమాలు. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. సినిమా రిలీజ్ ముందు ఏ రేంజ్‌లో అయితే హడావిడి ఉంటుందో.. ప్రభాస్ బర్త్‌డే కి కూడా అంతే హడావిడి చేస్తున్నారు అభిమానులు.

బాహుబలి పుట్టినరోజుకి ఎన్నడూ లేనటువంటి హడావిడి జరుగుతుంది ఈ సారి. సలార్ లో కాటేరమ్మ జాతర చేసినట్టు.. కల్కీలో ఐదు మిలియన్ల బౌంటి దొరికినట్టు.. ఈ సారి మన డార్లింగ్ బర్త్‌డే కి మాత్రం  రచ్చ రచ్చే అంటున్నారు అభిమానులు. ఈ తరుణంలో తాజాగా జూబ్లిహిల్స్‌లోని ప్రభాస్ ఇంటి వద్ద అభిమానులు అర్ధరాత్రి  హల్ చల్ చేశారు. ప్రభాస్‌ని చూడాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


Also Read: ప్రభాస్ కు ఆ సాంగ్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా?

అయితే..ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలపైనే ఎక్స్‌పెక్టేషన్ చూశాం.. కానీ ఇప్పుడు బర్త్‌డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను వారం రోజుల ముందే మొదలు పెట్టారు అభిమానులు. ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత విదేశాల్లో ప్రభాస్‌కి అభిమానులు ఎక్కువయ్యారు. థియోటర్లో సినిమా విడుదలయ్యిందంటే చాలు.. మనోళ్లతో పోటీ పడీ మరీ చూసేస్తుంటారు ఫారెన్ ఫాన్స్.

మొత్తంగా చూస్తే ప్రభాస్ సినిమా ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం భారీ స్థాయిలో సాధిస్తాయి. అన్నిటికి మించి జపాన్‌లో ప్రభాస్‌కి ఫాన్స్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. అందుకే ఈసారి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు జపాన్ ఫాన్స్. డార్లింగ్ బర్త్‌డేని తమ లైఫ్‌లో ఓ స్పెషల్ డేగా ట్రీట్ చేస్తున్నారు అభిమానులు. స్పెషల్‌గా ఓ సీడీపీ పోస్టర్‌ను రెడీ చేసుకుని తమ సోషల్ మీడిలో హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ షేర్ చేసుకుంటున్నారు అభిమానులు. ఇక ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆరు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అందుకున్న సలార్, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, ఈశ్వర్, రెబల్, మిర్చి మూవీస్ రీరిలీజ్ అవుతున్నాయి.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×