BigTV English

Intinti Ramayanam Today Episode : పల్లవి, కమల్ మధ్య జరిగిన శోభనం.. చక్రధర్ కు నిజం చెప్పిన పల్లవి..

Intinti Ramayanam Today Episode : పల్లవి, కమల్ మధ్య జరిగిన శోభనం.. చక్రధర్ కు నిజం చెప్పిన పల్లవి..

Intinti Ramayanam Today Episode October 3rd: నిన్నటి ఎపిసోడ్ లో రాజేశ్వరి పల్లవి గురించి నిజం తెలుసుకొని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి నిలదీస్తుంది.. కూతురు చేస్తున్న పని తప్పు అని వాదిస్తుంది. పల్లవి తన కుటుంబాన్నే ముక్కలు చెయ్యాలని చూస్తుంది. ఇంకో విషయం పల్లవి, కమల్ కు శోభనం కూడా జరగలేదని చెబుతుంది. వీరిద్దరికీ శోభనం జరిగితే ఇక తనకు ప్రేమ పుడుతుంది అని అంటుంది అవని.. మరి ఈ విషయం కమల్ కు తెలియదా.. ఇంట్లో ఎవరితోనూ అనలేదా అంటుంది. నైట్ ఏం జరిగిందో తెలియకుండా ఉండేందుకు పాలల్లో నిద్ర మాత్రలను కలిపి ఇస్తుంది.. ఆ తర్వాత కమల్ మల్లెపూలు, స్వీట్స్ పట్టుకొని వస్తాడు. విషయం తెలుసుకున్న పల్లవి పాలు తాగుతావా అని అడుగుతుంది. వద్దు పాలు తాగితే నిద్ర వస్తుందని చెబుతాడు. మూడు రావాలంటే పాలు తాగాలి అని పాల కోసం వెళ్తుంది. అది గమనించిన అవని చక్కెర డబ్బాని దాచిపెడుతుంది. అవని, రాజేశ్వరి ఇద్దరు కలిసి కూతురు శోభనం ప్లాన్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి పాలల్లో నిద్ర మాత్రలు వేసి చక్కర కోసం చూస్తుంది. అక్కడ లేకపోవడంతో అత్తయ్య ను అడగాలని వెళ్తుంది. ఇక పల్లవి వెళ్లడంతో అవని, రాజేశ్వరిలు గ్లాస్ మారుస్తారు.. పల్లవి అత్తయ్యను పిలుచుకొని వస్తుంది. రాజేశ్వరి మార్చిన గ్లాసులో చక్కరను వేసుకొని తీసుకొని వెళ్తుంది. ఇక ఆ పాలను కమల్ దగ్గరకు తీసుకొని వస్తుంది. కమల్ ఎక్స్సైజులు చెయ్యడం చూస్తుంది పల్లవి. పాలు తాగి పడుకొనేవాడికి ఇంత అవసరమా అని అనుకుంటుంది. కమల్ బావ నా ప్రేమను కలిపి తీసుకొని వచ్చాను అంటుంది. ఇక కమల్ కు పల్లవి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని నువ్వు పాలు తాగు అంటాడు. ఎలాగో తాగితే పాడుకోవడమే లేకుంటే వీడికి అనుమానం వస్తుందని టెన్షన్ పడుతుంది. ఇక తాగు అని కమల్ బలవంతం పెట్టాడు.. తాగుతుంది. ఇద్దరు కలిసి ఒక డ్యూయేట్ సాంగ్ వేసుకొని శోభనం జరిగిపోతుంది.

ఇక కమల్ బెడ్ రూమ్ ముందు అవని ఉండటం చూసిన అక్షయ్ అడుగుతాడు. ఏం లేదండి ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అంటుంది. అవునా మన బెడ్ రూమ్ లో వెళ్తే వేరేవి చూసుకుందాం అంటాడు.. సరే వస్తాను అంటుంది. నావల గురించి ఆలోచిస్తున్న అని అంటుంది. అవునా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని వెళ్ళిపోతారు. ఇక ఉదయం పల్లవి లేచి షాక్ అవుతుంది. ఏం జరిగిందని అడుగుతుంది. కమల్ అసలు జరిగింది ఇదని చెప్పడంతో పల్లవి స్టన్ అవుతుంది. ఇక అవని ఇదంతా చేసిందాని తెలుసుకొని అవని దగ్గరకు వస్తుంది.. గది బయట అవని ఉంటుంది. అది చూసిన పల్లవి ఇదంతా నువ్వే చేశావా అంటుంది. అవని డ్యాన్స్ చేస్తుంది. నాటకాలు ఆడకు ఇదంతా నువ్వు చేశావా.. నేనేం చేశాను అంతా మీ అమ్మ చేసింది. కన్న తల్లిగా పద్దతిగా చేసింది అంటుంది. సిగ్గు అనిపించలేదా అంటుంది పల్లవి..


నువ్వు ఇన్నాళ్లు జరిగిందని కలర్ ఇచ్చినా విషయాన్నే నిజం చేసాము అంతే అంటుంది. నువ్వు కోడలిగా అడుగు పెట్టిన ఇల్లు మాత్రమే కాదు. నువ్వు కాపురం చేసిన భర్త ఇంటిని ముక్కలు చెయ్యాలని అనుకుంటున్నావు అని అంటుంది. రాజేశ్వరి రావడం చూసి అమ్మా నువ్వు ఇలా చేస్తావా అంటుంది. తల్లిగా నేను చెయ్యాల్సింది చేశాను అంటుంది. నీ ఒక్కరికే కాదు అందరికీ తెలివి ఉంటుంది అని అంటుంది. ఇక పల్లవి ఈ విషయాన్ని చక్రధర్ కు చెప్పాలని వెళ్తుంది. తండ్రికి జరిగిన విషయాన్ని గురించి చెబుతుంది. అతడు కూతురును అవని చేతిలో మోస పోయావా అని తిడతాడు. ఇలాంటి చేస్తావని అనుకోలేదు అంటాడు. దానికి పల్లవి మోసపోయాను అని ఏడుస్తుంది. ఇక అవని మీద అంతకు అంతగా రివేంజ్ తీర్చుకుంటాను అని అంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కమల్ కు ఒక పెట్టే దొరుకుతుంది. అందులో ఒక ఫోటో దొరుకుతుంది. అది అవనికి ఇస్తాడు. ఆ ఫోటోను చూసి అవని ఎమోషనల్ అవుతుంది. అవని తల్లీ గురించి నిజం తెలుస్తుందా? అవని కుటుంబం ఎక్కడుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Big Stories

×