BigTV English

Nitin Gadkari: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

Nitin Gadkari: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

Nitin Gadkari| మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఎవరైనా రోడ్డుపై ఉమ్మి వేస్తుంటూ వారి ఫొటోలు తీసి న్యూస్ పేపర్ లో ప్రచురించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నారు. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా.. గడ్కరి సొంత నియోజకవర్గం నాగపూర్ లో మునిసిపల్ అధికారులు బుధవారం స్వచ్ఛ భారత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ”గాంధీజీ పర్యావరణాన్ని కాపాడేందుకు పరిశుభ్రత చాలా అవసరమని చెప్పేవారు. అందుకే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన కర్తవ్యం. అందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బహిష్కరించాలి. అప్పుడే పర్యవరణాన్ని కాపాడగలం. ప్రజలు చాలా తెలివి గలవారు. చాక్లెట్లు తని దాని రాపర్‌ని రోడ్డపై బాధ్యరహితంగా విసిరేస్తారు. అదే ప్రజలు విదేశాలకు వెళ్లినప్పుడు ఆ చాక్లెట్ రాపర్‌ని జేబులో పెట్టుకొని ఆ తరువాత చెత్త కుండీ పడేస్తారు. విదేశాలకు వెళితే మంచి అలవాట్లు ఉన్నట్లు ప్రవర్తిస్తారు. నేను కూడా గతంలో అలాగే చేసేవాడిని. కారులో కూర్చొని చెక్లెట్ తిని దాని రాపర్ ని రోడ్డుపై విసిరేసేవాడిని.. కానీ ఇప్పుడు రాపర్ జేబులో పెట్టుకొని.. ఇంటికి వెళ్లి చెత్త కుండీ వేస్తున్నాను.

Also Read:  ‘ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!


ఇక మన సమాజంలో చాలామంది పాన్ మసాలా గుట్కా తినేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్లు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. వాళ్లంతా ఎక్కడ పడితే అక్కడ ఉమివేస్తూ ఉంటారు. ఆ గుట్కా, పాన్ మసాలా తినేవాళ్లు ఉమ్మివేసే సమయంలో వారి ఫొటోలు తీయండి. ఆ ఫొటోలు న్యూస్ పేపర్ లో ప్రచురిద్దాం. అప్పుడే ప్రజలకు తన పర్యావరణాన్ని నాశనం చేసే వారెవరో తెలుస్తుంది. గాంధీజీ ఇలాంటి ప్రయోగాలు చేసేవారు.” అని చమత్కరిస్తూ చెప్పారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అని నూతన టెక్నాలజీ గురించి కూడా ప్రస్తావించారు. బయో ప్రాడక్ట్స్ తయారు చేయడానికి చెత్త ఉపయోగపడుతుందని వాటిపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిసారించాలని అన్నారు.

Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×