E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అక్షయ్ వార్నింగ్.. అవని కోరికను తీర్చిన అక్షయ్ కుటుంబం..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అక్షయ్ వార్నింగ్.. అవని కోరికను తీర్చిన అక్షయ్ కుటుంబం..
Advertisement

Intinti Ramayanam Today Episode October 5th:  నిన్నటి ఎపిసోడ్ లో.. అవని నీకే తెలియకుండా ఇలాంటివి ప్లాన్ చేసింది అంటే ఎంత తెలివిగా ఆలోచించింది. నిన్నే దెబ్బ కొట్టింది అంటే నువ్వు ఇక జాగ్రత్తగా ఉండాలి. ఆ అవని ప్లాన్స్ కనుక్కోవడం కష్టం అనే చక్రధర్ పల్లవితో అంటాడు. అవనిని అంత ఈజీగా వదలను అంతు చూస్తాను అని వెళ్తుంది. మరోవైపు అంటాడు. ఇక అవని తల్లీ, తమ్ముడు అనాధ ఆశ్రమాల చుట్టు తిరుగుతూ ఉంటారు. ఇంట్లో అందరు క్రికెట్ ఆడతారు కమల్ కొట్టిన దెబ్బతో బాలు కనిపించకుండా పోతుంది. ఆరాధ్య ఆడాలని మొండికి వేస్తుంది. దాంతో మళ్లీ అందరు ఆడతారు. ఇక పల్లవి యాక్సిడెంట్ చేసిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో అవనికి ఒక ఫోటో దొరికిందని కమల్ అవనికి ఇస్తాడు. అది నాదే చిన్నప్పటి ఫోటో అని అంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనికి కమల్ ఫోటో దొరికిందని చెబుతాడు.. ఏంటి అంటే ఎవరిదో చిన్న పిల్ల ఫోటో దొరికిందని చెబుతాడు కమల్.. అవునా ఎవరిదీ అని అందరు చూస్తారు. అవని నాదే ఆ చిన్నప్పటి ఫోటో అని చెబుతుంది. నేను అనాధను కదా ఆ ఫోటో నాకు ఆధారం. నేను ఆశ్రమంలో చేరిన తర్వాత వాళ్ల తీసుకున్నాను. నా వాళ్లు నన్ను ఎందుకు వదిలేసారో తెలియదు.. నాకు ఎప్పటికైనా నా కుటుంబ సభ్యులు దొరుకుతారని ఆ ఫోటోను దాచుకున్నాను అంటుంది. అందరు కూడా అవనికి ధైర్యం చెబుతారు. నీ కుటుంబ సభ్యులు అందరు దొరుకుతారని ధైర్యం చెబుతారు.. ఇక అవని స్టోరీ విని బామ్మ ఏదో అనుకుంటుంది..

Advertisement

ఇక పల్లవి యాక్సిడెంట్ చేసిన ఆమెను తీసుకొని హాస్పిటల్ కు వెళ్తారు.. అక్కడ పేషంట్ కోసం సైన్ చెయ్యమని అడుగుతారు. పల్లవి వెళ్తుంటే డబ్బులు కట్టమని సిస్టర్ చెబుతుంది. నాకేమి అవసరం అని పల్లవి అడుగుతుంది. అతను పేషంట్ తాలూకా, మీరు అడ్మిడ్ చేసినట్లు చెప్తుంది. ఇక పల్లవి డబ్బులు కడుతుంది. మేడమ్ మీరు కట్టింది కేవలం అడ్మిట్ చేసిన దానికే ఇంకా ఫీజు కట్టాలని చెబుతారు.. అప్పుడే ఆమె కొడుకు వచ్చి మేము ఎందుకు కడతాము నువ్వే కట్టాలి అంటారు. ఒక నా ఫోన్ నెంబర్ ఇస్తాను అవ్వగానే డిశ్చార్జ్ చేసినప్పుడు నాకు కాల్ చెయ్యి అంటుంది. నీ మీద నమ్మకం లేదు అంటే విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్తుంది.. ఏదైన అయితే నేను రాకుంటే నా ఇంటికే వచ్చి అడుగు అంటుంది.. ఇక అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంది..

రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తాడు. అందరిని సంతోషంగా పిలుస్తాడు.. ఏమైంది అంటే మనల్ని వద్దనుకొని వెళ్లిన క్రాంట్రాక్ట్ లన్ని మళ్లీ వచ్చాయి. అక్షయ్ నిర్దోషి అని తేలడం తో అప్పుడు తిట్టినా వాళ్లే ఇప్పుడు క్షమాపణలు అడిగి మరి క్రాంట్రాక్ట్ లను ఇచ్చారు.. ఇదంతా అవని వల్లే జరిగింది అని చెబుతాడు. అప్పుడు అందరు అవును అవని ఇంటికి వచ్చాకే సంతోషాలు మొదలయ్యాయని అంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ సంతోషంగా ఉంటాడు. అవని నీకు ఏమి కావాలి కోరుకో అంటాడు. వదిన పుట్టిన రోజును గ్రాండ్ గా చెయ్యాలని అంటాడు కమల్.. అవును గ్రాండ్ గా హోటల్ ప్లాన్ చేద్దాం అందరు చూసి షాక్ అవ్వాలి అంటారు. అప్పుడే పల్లవి అక్క పుట్టినరోజు ఏ రోజో తెలిస్తే చెయ్యొచ్చు లేకుంటే ఎలా చేస్తారు అంటుంది. అదే అవని అక్క అనాధ కదా ఆమె పుట్టినరోజు ఆమెకే తెలియదు ఎలా చేస్తారు అంటుంది. అక్షయ్ మాటలు మర్యాదగా రానివ్వు… నీకు అవసరం లేని విషయాలు తల దూర్చకు అంటాడు.. ఇక రాజేంద్ర ప్రసాద్ నీకు ఏం కావాలో చెప్పు అంటాడు. నేను అనాధను నా పుట్టినరోజు నాకే తెలియదు మా అయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు అని అంటుంది అవని.. ఇక ఆ రోజునే పుట్టినరోజు జరుపుకుంటాను. అనాధ ఆశ్రమంలోనే పిల్లలతో జరుపుకుంటాను అంటుంది.

Advertisement

ఇక రాజేంద్ర ప్రసాద్ అలాగే నీ ఇష్టం అంటాడు. ఆ తర్వాత నీకు ఒక్క కోరిక ఇచ్చాను కోరుకో అంటాడు.. ఏమొద్దు అంటుంది. కానీ నేను ఒక బాధ్యత ఇస్తాను చేస్తావా అంటాడు. అలాగే మామయ్యా ఎంత పెద్ద బాధ్యత అయినా చేస్తాను అంటుంది. పల్లవిని ఇంటి తాళాలు తీసుకురమ్మని చెబుతాడు.. తెచ్చి అవనికి తాళాలు ఇస్తుంది. ఇక నైట్ కమల్ పల్లవి దగ్గరకు వస్తాడు. పల్లవి చిరాకు పడుతుంది. డ్యాన్స్ చెయ్యి చిరాకు పోతుంది అంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఓ ఫంక్షన్ కు అందరు వెళ్తారు. అప్పుడు అవని బాబు పై అక్షింతలు వేస్తుంటే వద్దమ్మా అని అక్కడి వాళ్లు ఆపుతారు.. వాడు నీ లాగే అనాద అవ్వాలని అనుకుంటావా అని అంటారు.. ఆ తర్వాత ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×