BigTV English

Game Changer : ఇంకా డబ్బింగ్ పూర్తి కాలేదా.? రాజు గారు సంక్రాంతికి కర్చీఫ్ వేయనున్నారా.?

Game Changer : ఇంకా డబ్బింగ్ పూర్తి కాలేదా.? రాజు గారు సంక్రాంతికి కర్చీఫ్ వేయనున్నారా.?

Game Changer : భగవంతునికి భక్తునికి అంబికా దర్బార్ బత్తి అనుసంధానంగా ఉన్నట్టు, సంక్రాంతి సీజన్ కి నిర్మాత దిల్ రాజుకి కొన్ని సినిమాలు అనుసంధానంగా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి సినిమా రావడం మిస్ అవుతుంది కానీ, ఎప్పుడూ సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి కారణం శంకర్ మొదటిసారి తెలుగులో డైరెక్ట్ సినిమా చేయటం. శంకర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు జరుగుతున్నాయి గానీ ఒకప్పుడు శంకర్ తీసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్స్ అని చెప్పాలి. అయితే దాదాపు ఐదేళ్ల క్రితమే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.


గేమ్ చేంజర్ సినిమాతో పాటు నిర్మితమైన ఇండియన్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయిపోయింది. ఇండియన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రేక్షకులకు తెలిసింది. అప్పట్లో ఆ సినిమా ఒక సంచలనం. ఆ సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే చాలామంది మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా మినిమం అందుకోలేకపోయింది. ఇక చాలామంది ఈ సినిమా రిజల్ట్ తర్వాత గేమ్ చేజర్ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ గేమ్స్ చేంజర్ విషయానికి వస్తే, సినిమాకు కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్. కథ ఫెయిల్ అయిన కూడా ఒక ఫిలిం మేకర్ గా శంకర్ ఎప్పుడు ఫీల్ కాలేదు అని చాలామందికి తెలిసింది. ఇక కార్తీక్ సుబ్బరాజు కథ కాబట్టి ఈ సినిమా మీద మంచి నమ్మకాలు ఉన్నాయి. అలానే ఈ సినిమా పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా గురించి కొన్ని రోజులు పాటు కనీసం అప్డేట్స్ కూడా ఇవ్వలేదు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్. కానీ రీసెంట్ టైమ్స్ లో దిల్ రాజు ఎక్కడ కనిపించినా కూడా ఈ సినిమా గురించి చాలామంది ఫిలిం జర్నలిస్టులు అడుగుతూనే ఉన్నారు. అయితే కొన్నిసార్లు దిల్ రాజు ఆ ప్రశ్నలను దాటేస్తున్న కూడా మరికొన్నిసార్లు వాటి గురించి మాట్లాడక తప్పట్లేదు. మొత్తానికి ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు దిల్ రాజు స్వయంగా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అందుతున్న ప్రకారం డిసెంబర్లో ఈ సినిమా వచ్చే అవకాశాలు తక్కువ అని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అయితే మొత్తానికి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.


త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పూర్తిస్థాయి హీరోగా కనిపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన “రా మచ్చ” పాటకి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 మిలియన్లు పైగా వ్యూస్ సాధించింది. అయితే చాలామంది చరణ్ అభిమానంతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద మంచి నమ్మకం ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దేవర రూపంలో ఎన్టీఆర్ సక్సెస్ అందుకున్నాడు. ఒక గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ సక్సెస్ అందుకోవాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×