E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఫ్రెండ్ తో అవనిని ఘోరంగా అవమానించిన పల్లవి.. అవని తల్లి ఎవరో నిజం తెలిసిపోతుందా?

Intinti Ramayanam Today Episode: ఫ్రెండ్ తో అవనిని ఘోరంగా అవమానించిన పల్లవి.. అవని తల్లి ఎవరో నిజం తెలిసిపోతుందా?
Advertisement

Intinti Ramayanam Today Episode October 8th: నిన్నటి ఎపిసోడ్ లో చూస్తే.. కమల్ గదిలోకి వస్తాడు. పల్లవి కోపంగా ఉండటం చూస్తాడు. ఏమైంది టెన్షన్ పడుతున్నావ్ అని పల్లవి తో అంటాడు. అయితే నీ టెన్షన్ తగ్గడానికి నేనొక మంచి ప్లాన్ చెబుతాడు. కమల్ సాంగ్స్ పెడతాడు.. డ్యాన్స్ చేస్తాడు. తన కొడుకు బారసాల అని చెబుతుంది. వాళ్ల ఇంట్లో పట్టింపులు చూసుకొని అవనిని అవమానించవచ్చు అని ప్లాన్ వేస్తుంది. తన ప్లాన్ ప్రకారమే పల్లవి అవనిని ఫంక్షన్ కు వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అవనికి అక్షయ్ సర్ ప్రైజ్ ఇస్తాడు. ఒక నెక్లేస్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. పల్లవి వీడు ఆఫీస్ కు వెళ్లకుంటే నా ప్లాన్ ఫెయిల్ అవుతుందని ఆఫీస్ కు పంపించాలని ప్లాన్ చేస్తుంది. ఇక పల్లవి డ్రామాను మొదలయింది. పల్లవి నా ఫ్రెండ్ కొడుకు బారసాల మిమ్మల్ని తీసుకొని వెళ్దామా అని అంటుంది.. అవని వెళదామని అనడంతో పల్లవి ఫుల్ ఖుషి అవుతుంది.. ఇక అందరు కలిసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. అనుకున్నట్లుగానే పల్లవి ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అనుకున్నట్లుగానే పల్లవి ఫ్రెండ్ అత్త అనాధ అని అవమానిస్తుంది..

ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనిని పల్లవి ఫ్రెండ్ అత్తయ్య దారుణంగా అవమానించింది. అనాధవి ఇలాంటి వాటికి రావడం అలవాటు లేదు. ఒక మూల కూర్చొని ఉండు.. ఫంక్షన్ వచ్చిన వారిని వెళ్ళమని చెప్పకూడదు కదా ఓ మూల కూర్చొని వెళ్ళు అంటుంది. ఇక పల్లవి ఆ విషయాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. పల్లవి కావాలనే నన్ను అవమానించాలని తీసుకొని వచ్చిందా అని ఆలోచిస్తుంది.. ఇక అందరు హడావిడి చేస్తారు.. దీనికి ఇది సరిపోదు ఇంకాస్త అవమానం చెయ్యాలి అనుకుంటుంది.. తన ఫ్రెండ్ కు పల్లవు చెబుతుంది. ఇంకా ఏదైన చెయ్యాలి అని. పల్లవి ఫ్రెండ్ నేను చూసుకుంటాను అని చెబుతుంది.. ఇక ఫంక్షన్ లో ఓ ఆవిడా గంధం రాస్తానని చెబుతుంది. అప్పుడే పల్లవి ఫ్రెండ్ వాళ్ల అత్తయ్య ఎక్కడికి వస్తుంది..

Advertisement

ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. గంధం రాస్తున్న అంటే ఆమె ఒక అనాధ ఇలాంటివి చేయించుకోవడం అలవాటు లేదు.. దాని విలువ కూడా ఆమెకు తెలియదు. ఏ ఫంక్షన్ కు వెళ్లి చేసుకోలేదు. దగ్గరుండి చూసి ఉండదు అని అంటుంది. దానికి అవని ఏడుస్తుంది. ఇక అవని వాళ్ల అత్తయ్య అప్పుడే అక్కడకు వస్తుంది.. ఏమైంది అవని ఇలా దూరంగా ఉన్నావు.. రా బాబును అన్న చూసి వద్దాం అంటుంది. లేదు అత్తయ్య మీరు వెళ్ళండి.. నేను రాలేను అంటుంది.. వాళ్లు అన్న విషయం తెలిస్తే బాధ పడతారు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే పల్లవి వచ్చి అత్తయ్య బాబు దగ్గరకు వెళ్దాం అని చెబుతుంది. అక్క నువ్వు రా అంటుంది. నేను రాను మీరు వెళ్ళండి అని అవని అక్కడే కూర్చుంటుంది..

పల్లవి యాక్సిడెంట్ చేసిన మీనాక్షి కొడుకు బిల్ కట్టాలని ఫోన్ చేస్తాడు. పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి దురుసుగా సమాధానం చెబుతుంది. నేను ఫంక్షన్ లో ఉన్నా ఫోన్ పెట్టేయి మళ్లీ చేస్తాను అంటుంది.. డిశ్చార్జ్ చెయ్యాలంటే డబ్బులు కట్టాలి. ఈమెకు మళ్లీ ఫోన్ చేస్తానని చేస్తాడు. దానికి పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. బిల్ కట్టాలి అండి మా అమ్మను తీసుకెళ్లాలి అంటాడు.. దానికి పల్లవి నేనొకటి ఆరెంజ్ చేస్తాను అని అంటుంది. వీడు నా దగ్గరకు వస్తే నేను యాక్సిడెంట్ చేసిన విషయం అందరికీ తెలిసింపోతుంది. డాడీకి విషయం చెప్పాలని ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది.. ఆ పేషంట్ పేరు మీనాక్షి, ఆమె కొడుకు పేరు భరత్ వాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. నాకు ఇక ఫోన్ చెయ్యొద్దని వార్నింగ్ ఇవ్వు అని చెబుతుంది. ఇక చక్రధర్ హాస్పిటల్ వెళ్లి బిల్ అడిగి పే చేస్తాడు. ఇంకోసారి మా అమ్మాయికి ఫోన్ చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు.. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

ఇక అత్తయ్య బాబును ఉయ్యాల్లో వేస్తున్నారు. రా అమ్మ అవని వెళ్లి చూద్దాం అని పల్లవి అంటుంది.. అవనికి ఒక చైన్ ఇస్తుంది. కానీ అవని పల్లవి లేదా మీరే వెయ్యండి అని చెబుతుంది. బలవంతంగా ఒప్పించి బాబు దగ్గరకు తీసుకొని వెళ్తారు. అక్కడ పల్లవి ఫ్రెండ్ చైన్ విసిరికొడుతుంది. అదేంటి అంటుంది. నువ్వు ఒక అనాధవి నా కొడుకు కూడా అనాధ అవ్వాలని చూస్తున్నావా అని అంటుంది. ఒక మంచి మర్యాద తెలియని వాళ్లను ఫంక్షన్ కు రావడం పెద్ద తప్పు అలాంటిది ఇలా చేస్తావా అని అంటుంది. అప్పుడే పల్లవి వాళ్ల అత్తయ్య అరుస్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో అవని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆశ్రమం వెళుతుంది. అక్కడ కమల్ చిన్నప్పటి ఫోటోను ఫ్రెమ్ కట్టించి గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి అక్కడ హెడ్ ఈ ఫోటోను ఎక్కడో చూసాను అని అంటుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో పల్లవికి అసలు నిజం తెలిసిపోతుందా.. తన వాళ్లను కలుసుకుంటుందా చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×