E-Paper
Advertisement

Mollywood: డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పిశాచి నటి.. పోలీసులు గాలింపు..!

Mollywood: డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పిశాచి నటి.. పోలీసులు గాలింపు..!
Advertisement

Mollywood..అసలే మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆడవారికి భద్రత లేదనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మరొకవైపు డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత మలయాళ సినీ ఇండస్ట్రీలో చాలామంది ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమా తన కమిటీలో నివేదించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వారిని టార్గెట్ చేస్తూ అవకాశాల పేరిట తమ కోరికలు తీర్చుకుంటున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. అందుకే జస్టిస్ హేమా కమిటీ మలయాళ ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలను బయట పెట్టడంతో చాలామంది ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తూ తమ బాధలను చెప్పుకుంటున్నారు.

లైంగిక వేధింపులే కాదు డ్రగ్స్ వ్యవహారం కూడా..

Advertisement

ఇదిలా ఉండగా జస్టిస్ హేమా కమిటీలో లైంగిక వేదింపులే కాదు డ్రగ్స్ వ్యవహారాలు కూడా మాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా తాజాగా మరో మాలివుడ్ స్టార్ సెలబ్రెటీలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్టు వార్తలు రావడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అంతేకాదు ఈ ఇద్దరికీ గ్యాంగ్ స్టార్ ఓం ప్రకాష్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు రావడంతో యావత్ సినీ ప్రపంచం మాలివుడ్ వైపు చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

మాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారం…

Advertisement

అసలు విషయంలోకెళితే గ్యాంగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓం ప్రకాష్ తన స్నేహితుడు షియోస్ తో కలసి ఒక హోటల్ గదిలో డీజే పార్టీ నిర్వహించారు. అయితే అందులో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. అక్కడ మొత్తం పదార్థాలతో పాటు డ్రగ్స్ కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓం ప్రకాష్ తో పాటు అతడు స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఓం ప్రకాష్ పై 20 కి పైగా క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం.

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న మాలీవుడ్ స్టార్స్..

ఇదిలా ఉండగా మరొకవైపు గ్యాంగ్ స్టార్ ఓం ప్రకాష్ పోలీసులకు ఆధారాలు లభ్యమవ్వకుండా మాయం చేసినట్లు సమాచారం . ఈ క్రమంలోనే పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా.. పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో 20 మందికి పైగా ఈ పార్టీలో పాల్గొన్నారని.. వారిలో ఇద్దరు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు గుర్తించారు.. ఇక వారెవరో కాదు ప్రముఖ మాలీవుడ్ నటి ప్రయాగ మార్టిన్ (Prayaga Martin) , శ్రీనాథ భాసి(Srinath basi). అయితే ఓం ప్రకాష్ తో వీరిద్దరికి సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపించగా.. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు , వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ప్రయాగ మార్టిన్ కెరియర్..

ఇక ప్రయాగ మార్టిన్ విషయానికి వస్తే.. 29 సంవత్సరాల వయసులో 2009లో మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 24 కి పైగా చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రయాగ మార్టిన్ ఎవరో కాదు పిశాచి సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గర అయ్యింది. మరొకవైపు శ్రీనాథ్ (36) కూడా తన నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.శ్రీనాథ్ భాసి కూడా ఇటీవల వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా మాలీవుడ్లో స్టార్ సెలబ్రిటీలుగా పేరు సొంతం చేసుకున్న వీరిద్దరూ ఇలా డ్రగ్స్ వ్యవహారాలలో ఇరుక్కోవడంతో సంచలనంగా మారింది. ఇక దీనిపై నిజా నిజాలు త్వరలోనే తెలియనున్నట్లు సమాచారం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×