E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 10th : పల్లవి ఇంట్లోని వాళ్ళందరూ ఇలా బాధపడిపోతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా బాధపడిపోతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ పల్లవి ఆనందపడిపోతూ ఉంటుంది.. కమల్ కన్నీళ్లు పెట్టుకుంటూ రాత్రంతా ఏడుస్తూనే పడుకొని ఉంటాడు అయితే తనని చూసిన పల్లవి నువ్వు ఇలా ఏడుస్తూ పడుకుంటే చచ్చినోడు తిరిగి వస్తాడా ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన మనసులో అనుకొని బాధపడినట్లు నటిస్తుంది. నిజం ఎన్ని రోజులు దాచలేరు ఎలాగైనా సరే బయట పెట్టాలి కదా అప్పుడు ఇంట్లో రణరంగం మొదలవుతుంది మరో చావు కూడా చూడొచ్చు అని పల్లవి మనసులో అనుకుంటూ సంతోష పడిపోతుంది..

రాజేంద్రప్రసాద్ కు పిండప్రధానం..

రాజేంద్రప్రసాద్ కి పిండ ప్రధాన కార్యక్రమాన్ని జరిపించాలని అవని పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది. ఇక పంతులుగారు పూజకి అన్నీ సిద్ధం చేయాలని అనుకుంటారు. ఇంటి బయట పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఇంట్లోనే వాళ్ళందరూ చేపిస్తారు అయితే పార్వతికి రాజేంద్రప్రసాద్ గురించి నిజం తెలిసేలోగా ఈ కార్యక్రమాలను పూర్తవ్వాలని అనుకుంటారు. ఇక పంతులు గారిని పిలిపించి అన్ని కార్యక్రమాలని చేస్తూ ఉండగా పల్లవి ఎలాగైనా సరే ఈ విషయాన్ని అత్తయ్యకు తెలిసేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను వెళ్లి అత్తయ్యకు నిజంగానే బావ చనిపోయిన నిజాన్ని చెప్పాలని అనుకుంటుంది.

అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. 

Advertisement

పార్వతీ ఒక్కటే గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. పల్లవి ఇలా మారిపోతుందని నేను అసలు ఊహించలేదు అంటూ బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య నేను మీతో మాట్లాడాలి అని పల్లవి గదిలోకి వస్తుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నువ్వు చెప్పాలనుకున్నవన్నీ హాస్పిటల్ లోనే చెప్పావు కదా.. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పడానికి నా గది లోకి వచ్చావు వెళ్ళు బయటికి అని పార్వతి అంటుంది.. కానీ మీకు ఒక నిజం చెప్పాలి ఇది చెప్పకుండా నేను అసలు దాచి పెట్టలేకపోతున్నాను అని పల్లవి పార్వతికి రాజన్న ప్రసాద్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.. నీకు ఒక విషయం చెప్పాలి ఆశ్రమంలో మావయ్య అని అనబోతుండగా అవని పల్లవి ఏం చేస్తున్నాను నువ్వు అని అడుగుతుంది.

అవనికి అడ్డంగా దొరికిన పల్లవి..

ఆశ్రమంలో మావయ్య గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది అని అత్తయ్యకి తెలుసు కదా మళ్లీ ఆశ్రమంలో మావయ్య అనే ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అని పల్లవి అవినీకి అడ్డంగా దొరికిపోతుంది.. అది కాదక్కా నేను అత్తయ్య గారికి మావయ్య గారు చనిపోయారు అనే విషయాన్ని చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. తన భర్త చనిపోయిన కూడా తను ఇలా ఉంది అంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని అందుకే అత్తయ్యకి నిజం చెప్పబోయాను అని త అంటుంది కానీ నువ్వు ఇలా చేస్తే అత్తయ్య బ్రతుకుతుందని అనుకుంటున్నావా? అత్తయ్య కూడా చంపేయాలి అనుకుంటున్నావా అని పల్లవిని అడుగుతుంది. కానీ పల్లవి నాటకం మొదలుపెట్టి ఎమోషనల్ అవుతుంది.. అది నిజమే అని నమ్మిన అవని సరే అని అనుకుంటుంది.

శ్రీయ బిడ్డను చంపుతుందా..? 

Advertisement

శ్రియ నేను ఇంకా రెడీ అవ్వలేదు పల్లవి నువ్వు కాస్త బాబుని చూసుకుంటావా అని పార్వతి దగ్గర ఉన్న పల్లవికి బాబుని ఇస్తుంది. ఏంటి నువ్వు నువ్వు బాబుని ఇస్తున్నావా సరే ఇవ్వు నువ్వు వెళ్లి రెడీ అవ్వు నేను చూసుకుంటాను బాబును అని పల్లవి అంటుంది. అయితే పల్లవి హాస్పిటల్ లో బాబు గురించి చెప్పిన విషయాలను విని పార్వతి మరోసారి గుర్తు చేసుకుని భయపడిపోతుంది. బాబుని నాకివ్వు అని ఎంత చెప్తున్నా సరే పల్లవి తీసుకుని ఆడిస్తున్నట్లు నాటకాన్ని మొదలు పెడుతుంది పార్వతి మాత్రం పల్లవి బాబుని ఏం చేస్తుంది అనే భయపడిపోతూ ఉంటుంది.. పల్లవి నిజస్వరూ పని అందరికీ తెలియజేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి.

పార్వతికి నిజం తెలిసిపోయిందా..? 

పార్వతి బాబుని చూసుకుంటూ ఉండగా… బయట రాజేందర్ ప్రసాద్ కి పిండ ప్రధాన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉంటారు. అక్షయ్ వెళ్లి రాజేంద్రప్రసాద్ చిట్టికలను తీసుకొని వస్తాడు ఇక అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు పల్లవి మావయ్య గారి ఫోటో లేదేంటి అని అడుగుతుంది. ఇక పంతులుగారు కూడా రాజేంద్రప్రసాద్ ఫోటో కావాలని చెప్పడంతో… అవని నేను వెళ్లి తీసుకుని వస్తాను అని అంటుంది. కొడుకు ఫోటోని తీసుకురావడం భానుమతి చూస్తే ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది అని పల్లవి అనుకుంటుంది కానీ భానుమతికి ఏదో ఒకటి చెప్పి లోపలికి పంపిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Related News

Ninnu kori Serial Today Episode September 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జగదీశ్వరికి ఫోన్ చేసిన విరాట్ – షాక్ అయిన షాలిని

Thursday Movies in Tv : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

ఆటో రాంప్రసాద్ కు ఓటు వేయద్దు.. ఫాన్స్ కు రిక్వెస్ట్ అంత పగేంటి ఉప్పల్ బాలు!

యాంకర్ గా తొక్కేయడంతోనే ఉదయభాను నిర్మాత అయ్యారా?

యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!

సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాద ఉండదు .. నాగార్జునకు బిగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×