తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐసీసీలో వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. వివిధ కమిటీ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది ఏఐసీసీ. తాజాగా తెలంగాణ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్‌కు కీలక బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ హైకమాండ్.
కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత వారిని తప్పించి ఈసారి యువకులు, కొత్తవారికి వివిధ కమిటీల్లో స్థానం కలిస్తున్నారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ నేతలకు కీలక పదవులు దక్కుతున్నాయి. తాజాగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్(ఏఐపీసీ)గా మధుయాష్కీ గౌడ్‌ని నియమించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ పదవిలో ఛైర్‌పర్సన్‌గా ప్రవీణ్ చక్రవర్తి సేవలు అభినందించారు. చక్రవర్తి స్థానంలో మధుయాష్కీ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖరారు చేసిన ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది. ఇటీవల తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ప్రవీణ్ చక్రవర్తి. రాజ్యసభలో తన కొత్త బాధ్యతలు స్వీకరించిన తర్వాత మధుగౌడ్ యాష్కీ ఇప్పుడు ఏఐపీసీ పగ్గాలు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అనేది.. దేశంలోని వృత్తి నిపుణులు-పారిశ్రామికవేత్తలు-నిపుణులు వివిధ రంగాలకు చెందిన కార్మికుల పార్టీ విధాన రూపకల్పన ప్రక్రియ. రాజకీయ కార్యకలాపాలకు అనుసంధానించేది. ప్రజా జీవితానికి దోహదపడాలని కోరుకూ సాంప్రదాయ రాజకీయ వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధం లేని వృత్తి నిపుణుల అవసరాలు, అనుభవాలు, ఆకాంక్షలపై దృష్టి సారిస్తుందని పార్టీ చెబుతోంది.
2017లో రాహుల్ గాంధీ చొరవతో ఏఐపీసీ-AIPC స్థాపించారు. వృత్తి నిపుణులు వర్గాలు-రాజకీయాలకు మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడం దీని లక్ష్యం. విధాన రూపకల్పన, పరిపాలన, దేశ నిర్మాణంలో నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచడం. ఈ సంస్థకు మొదటి అధ్యక్షుడిగా శశి థరూర్ ఉన్నారు. 2023 నవంబర్ లో ప్రవీణ్ చక్రవర్తి ఈ పదవికి నియమితులయ్యారు. ఆయన తర్వాత మధు గౌడ్ యాష్కీ ఈ వరుసలో మూడవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ALSO READ: పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే
తెలంగాణలోని నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు మధు గౌడ్ యాష్కీ. 2004, 2009 లోక్‌సభ ఎన్నికలలో ఆయన గెలుపొందారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. పార్టీలో అధికార ప్రతినిధిగా, సీనియర్ నాయకుడిగా సుదీర్ఘకాలం పని చేశారు. అంతేకాదు మీడియాలో, రాజకీయ చర్చలు రెండింటిలోనూ చురుకైన పాత్ర పోషించారు.
Congress President Shri @kharge has appointed Shri Madhu Goud Yaskhi as the Chairperson of the All India Professionals' Congress, with immediate effect. pic.twitter.com/9udpOrWoYu
— Congress (@INCIndia) September 9, 2026