BigTV English

Intinti Ramayanam Today Episode : పల్లవి ప్లాన్ వర్కౌట్ అయ్యింది.. పిన్నితో కలసి పల్లవికి షాక్ ఇవ్వబోతున్న అవని..

Intinti Ramayanam Today Episode : పల్లవి ప్లాన్ వర్కౌట్ అయ్యింది.. పిన్నితో కలసి పల్లవికి షాక్ ఇవ్వబోతున్న అవని..

Intinti Ramayanam Today Episode September 28th : నిన్నటి స్వాతి ఇంట్లోకి వస్తుంటే చూసి బయటకు లాక్కొని వెళ్తుంది. ఇదిగో నువ్వు అడిగిన కోటి రూపాయలు. ఏమైనా చేసుకో.. ఇవి తీసుకొని నువ్వు దుబాయ్ వెళ్తావో లేక పాకిస్తాన్ వెళ్తావో నీ ఇష్టం అని చెబుతుంది. అప్పుడే అవని అక్కడకు వస్తుంది.. స్వాతి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి దగ్గరకు వస్తుంది. స్వాతి నీకెలా తెలుసు అంటుంది. నాకు తెలియదు అంటే పల్లవి చెంప పగలగొట్టింది. ఇప్పటివరకు నువ్వే ఇలాంటివి చేస్తున్నావని అనుమానం ఉండేది అది ఇప్పుడు నిజం అని తేలింది.. ఇంట్లో దొంగపడ్డాడు అని అందరిని నమ్మించి ఆ పెన్డ్రైవ్ ఇంట్లో పెట్టావా.. ఎందుకు చేశావు ఇదంతా అని చెంప పగలగొడుతుంది. ముసుగులో గుద్దులాట వద్దు అవును ఇదంతా చేసింది నేనే.. నాకు శ్రీకర్ ను దక్కనివ్వకుండా చేసిన ఈ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాను. ఇంట్లో ఎవరు సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేను.. కమల్ స్నానానికి పల్లవి నువ్వు నీళ్లు తీసుకురాకుంటే నేను ఇలానే ఉంటాను అని చెప్పి కమల్ వెళ్ళిపోతాడు.. దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. కమల్, బామ్మ, వినోద్ అందరు క్యారామ్స్ ఆడుతుంటారు. అప్పుడే వినోద్ భార్య వస్తుంది. నా చెల్లితో ఆటలు ఆడటం నాకు ఇష్టం లేదు. వాళ్ల దగ్గరకు వెళ్లి లేవవయే అని కూర్చొని ఆట ఆడుతుంది. ఆట ఓడిపోతుంది. ఇక అవని కమల్ దగ్గరకు వచ్చి కన్నయ్య శ్రీకర్ కు డ్రెస్సులు లేవు మాచిపోయాయి. అంటే అలాగే వదిన అని అంటాడు. ఇక ఆ విషయాన్ని పల్లవి వింటుంది. ఇదే అవకాశాన్ని నేను వాడుకుంటాను అంటుంది. ఇక ఇదే శ్రీకర్ కు ఆఖరి రోజు అని ఆలోచిస్తుంది.. ఇక అక్షయ్ రెడీ అవుతాడు. అప్పుడే పెర్ఫ్యూమ్ అయిపోతే.. పౌడర్ వేసుకుందామని అనుకుంటాడు. దాన్ని పట్టుకొని రివర్స్ అంటాడు పౌడర్ మోహం మీద పడుతుంది. ఇక అప్పుడే అవని వస్తుంది. అక్షయ్ ను చూసి నవ్వుతుంది. జోకర్ లా ఉన్నాడు అంటుంది. నన్నే అంటావా అని అవని మీద పౌడర్ వేస్తాడు. ఇద్దరు కాసేపు సరదాగా నవ్వుకుంటారు.. అప్పుడే పాప వచ్చి దెయ్యాలు అంటూ భయపడి పోతుంది.

ఇక కట్ చేస్తే.. కమల్ శ్రీకర్ కోసం డ్రెస్సులు తీసుకొని వెళ్లి ఇస్తాడు. శ్రీకర్ ఏదోకటి అని వేసుకుంటాడు. నాకు బాగా ఆకలి వేస్తుంది. నేను వెళ్తున్న నువ్వు ఆడవాళ్ళ లాగా రెడీ అవ్వకుండా త్వరగా వచ్చేయి అని వెళ్తాడు. ఇక శ్రీకర్ షర్ట్ వేసుకొని శ్రియా ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంటాడు.. ఇక్కడ ఏ సమస్య లేదు అని అంటాడు. అప్పుడు వెనకాల పల్లవి వస్తుంది. ఏ సమస్య లేదునా ఇప్పుడే నీకు చెబుతాను అని అంటుంది. ఫోన్ పెట్టినప్పుడు వెనకాల నుంచి కమల్ బావ అని హగ్ చేసుకుంటుంది. పల్లవి నేను శ్రీకర్ ను కమల్ ను కాదు అంటాడు. దానికి షాక్ అయిన పల్లవి కావాలనే అంతా చేస్తుంది. నువ్వు కమల్ డ్రెస్సు వేసుకున్నావేంటి అంటుంది. నాకు వేసుకోవడానికి డ్రెస్సులు లేవు అవని వదిన కమల్ డ్రెస్సు వేసుకోమని చెప్పింది అంటుంది. అవునా ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది.. నేను కావాలని చెయ్యలేదు అని పెద్ద రచ్చ చేస్తుంది. ఏడుస్తుంది. అది విని అందరు హాల్ లోకి వస్తారు..


శ్రీకర్ ఏమైందని అవని అడుగుతుంది. నేను కమల్ బావ షర్ట్ వేసుకుంటే కమల్ అనుకోని హగ్ చేసుకున్నాను. నేను కావాలని చెయ్యలేదు. ఏదో పొరపాటున చేశాను అని పెద్ద రచ్చ చేస్తుంది. మామయ్య నా తప్పే నేను మోహం చూపించలేని అందరు నన్ను అంటారు అంటూ గొడవ గొడవ చేస్తుంది. పల్లవి ఎందుకు అలా రచ్చ చేస్తుందని అవని ఆలోచనలో పడుతుంది. మామయ్యా నన్ను పంపించండి అని పదే పదే అంటుంది. అందరు షాక్ అవుతారు. నువ్వు కాదమ్మా వెళ్ళాల్సింది వీడు. వీడు లేకుండా ఉంటే ఇలాంటి జరిగేది కాదు అంటాడు. వీడి మోహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది అంటాడు. అందరు షాక్ అవుతారు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పల్లవిని వాళ్ల అమ్మ చెంప పగలగొడుతుంది. నువ్వు ఇలా చేస్తావా.. పెళ్ళైన తర్వాత అత్తవారి ఇల్లే నీకు పుట్టిన ఇల్లు అంటుంది. ఇప్పుడే ఇదంతా చెబుతాను అంటుంది. అమ్మా నువ్వు చెబితే నేను చేస్తాను అంటుంది. అది అవని చూస్తుంది. పిన్ని నువ్వు ఒక పని చెయ్యాలి అంటుంది. ఏంటి చెప్పు అంటూంది.. ఇక పల్లవికి వీళ్ల ప్లాన్ తెలిసిపోతుందా? శ్రీకర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Bigtv Kissik Talks:  మహేష్ విట్టా సినిమాల్లోకి అలా వచ్చాడా? ట్విస్టులు చాలానే ఉన్నాయే.. ఫన్ బకెట్ లేకపోతే?

Shobha Shetty: బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. రేపే ప్రారంభం!

Tv Serials: టీవీ సీరియల్స్ కు కమిట్మెంట్ తప్పనిసరినా? ఆ ఒక్కటి చెయ్యడం కుదరదు..

Intinti Ramayanam Today Episode: భరత్ ను ఇరికించిన పల్లవి.. అవనికి బిగ్ షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..?

Nindu Noorella Saavasam Serial Today october 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రామ్మూర్తి ఇంట్లో ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ   

Big Stories

×