BigTV English

VMHR School principal: విక్టోరియా స్కూల్ ప్రిన్సిపల్ ఆగడాలు.. డబ్బు, విద్యార్థులతో కూడా

VMHR School principal: విక్టోరియా స్కూల్ ప్రిన్సిపల్ ఆగడాలు.. డబ్బు, విద్యార్థులతో కూడా

VMHR School principal: మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ అని చెబుతారు. తల్లిదండ్రుల తర్వాత మన సొసైటీలో అంతటి స్థానం ఉపాధ్యాయులకు కల్పిస్తారు. పైన కనిపిస్తున్న అమాయక ప్రిన్సిపల్‌ పేరు ప్రభుదాస్. టీచర్ పేరుతో ముసుగు వేసుకున్న అవినీతిపరుడు, కామాంధుడు కూడా. ఈయన వ్యవహారంపై తీగలాగితే డొంక కదులుతోంది. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..


హైదరాబాద్‌‌లోని సరూర్‌నగర్‌ ప్రాంతంలో విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. దానికి ప్రిన్సిపల్‌గా చెలామణి అవుతున్నాడు అవినీతి ప్రభుదాస్. పాఠశాల ఆహారం విషయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి 29 వేల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.

ప్రభుదాస్ గురించి కూపీ లాగిన ఏసీబీ, కీలక విషయాలు బయటకు వచ్చాయి. దీంతో ఉప్పల్‌లోని ఆయన ఇంటిపై సోదాలు చేస్తోంది. భారీగా అక్రమాస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. దాడుల విషయాన్ని కాసేపు పక్కన బెట్టి అసలు విషయానికొద్దాం.


పాఠశాల కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించమే కాకుండా, ఇందుకోసం అనేక మార్గాలను ఎంచుకున్నాడట ప్రభుదాస్. పాఠశాల పనులు (నిర్మాణం, ఆహారం) టెండర్ల విషయంలో వారితో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ALSO READ: ‘ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

చివరకు ప్రభుదాస్ వ్యవహారంపై విసిగిపోయిన బాధితులు ఏసీబీకి ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన అక్రమాల కోసం ప్రత్యేకం గా కోటరీని ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం.

విక్టోరియా మెమోరియల్ గాళ్స్ ఎయిడెడ్ స్కూల్.  అందులో ఉంటున్న అనాధ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించేవాడన్న ఆరోపణలూ లేకపోలేదు. ప్రిన్సిపల్‌ ప్రభుదాస్ అరెస్ట్ కావడంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు మెల్లగా బయటకు వస్తున్నారు.

తొలుత ఉపాధ్యాయులకు నానా హింసలు పెట్టేవాడని సమాచారం. దీనికితోడు మాతో అసభ్యకరంగా ప్రవర్తించడం చేసేవాడని విద్యార్థులు  చెబుతున్నారు. మొత్తానికి ప్రభుదాస్ ఆగడాలను ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారుల విచారణ, బాధితుల ఫిర్యాదుతో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×