E-Paper
Advertisement

Nukaraj – Asiya: నూకరాజ్, ఆసియా పెళ్లి తేదీ ఫిక్స్.. హనీమూన్ అంటూ..

Nukaraj – Asiya: నూకరాజ్, ఆసియా పెళ్లి తేదీ ఫిక్స్.. హనీమూన్ అంటూ..
Advertisement

Nukaraju – Asiya: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న వారిలో నూకరాజ్(nukaraj) ఒకరు. పటాస్ కార్యక్రమంతో ప్రారంభమైన ఈయన ప్రయాణం జబర్దస్త్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంతో పాటు పలు బుల్లి తన కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే నూకరాజ్ ఆసియా(asiya) అనే మరో జబర్దస్త్ లేడీ కమెడియన్ తో లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

పెళ్లికి సిద్ధమైన ఆసియా, నూకరాజ్

ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు జీవితంలో కాస్త సెటిల్ అయిన తరువాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ దిశగానే ఎంతో కష్టపడుతూ మంచిగా సెటిల్ అయ్యారని చెప్పాలి . ఇలా జీవితంలో సెటిల్ కావడంతో ఈ జంట పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా తమ పెళ్లి తేదీ ఫిక్స్ అయింది అంటూ చెప్పటం విశేషం.

వాలెంటైన్స్ డే స్పెషల్..

Advertisement

ఇక ఈ వీడియోలో భాగంగా వాలెంటైన్స్ డే సందర్భంగా నూకరాజ్ ఆసియాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అదేవిధంగా తమ పెళ్లి తేది గురించి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తాము అంటూ వీరిద్దరు పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేశారు. గత కొంతకాలంగా చాలా మంది అభిమానులు పెళ్లి ఎప్పుడు అంటూ అడుగుతున్నారు. అయితే మేము ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని నూకరాజ్ తెలిపారు. కచ్చితంగా 2026 డిసెంబర్లో గా మా పెళ్లి జరిగిపోతుందని తెలియజేశారు.

Advertisement

ఇకపోతే మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు మా నిశ్చితార్థం పెట్టుకోవాలి ఏ నెల మంచిది అనే విషయాల గురించి మీరు కూడా కామెంట్ల రూపంలో సలహాలు ఇవ్వండి అంటూ ఈయన కోరారు. అయితే ఆసియా పుట్టినరోజు ఏప్రిల్ 14 తనది జులై 25 తేదీ అని తెలిపారు. ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటే బాగుంటుందో, మీరే సలహా ఇవ్వండి అంటూ ఈయన అభిమానులను సలహా కోరారు కానీ పెళ్లి తేది మాత్రం చెప్పకపోవడం గమనార్హం. కానీ ఈ ఏడాది డిసెంబర్ లోగా మా పెళ్లి జరుగుతుందని, జనవరిలో హనీమూన్ అంటూ మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఏడాది చివరికి పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో అభిమానులు కూడా మీ ఇద్దరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: Uday Kiran: పవన్ సినిమాపై ఉదయ్ కిరణ్ అలా అన్నారా.. అసలు విషయం చెప్పిన వి.ఎన్ ఆదిత్య!

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×