E-Paper
Advertisement

iPhone 16 Plus discount: ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.21,000 ఆదా చేసే గోల్డెన్ ఛాన్స్!

iPhone 16 Plus discount: ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.21,000 ఆదా చేసే గోల్డెన్ ఛాన్స్!
Advertisement

iPhone 16 Plus discount: బడ్జెట్‌లో ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్. సాధారణంగా యాపిల్ ఫోన్లపై భారీ తగ్గింపులు రావడం చాలా అరుదు. కానీ విజయ్ సేల్స్‌లో iPhone 16 Plus‌పై కళ్లు చెదిరే ఆఫర్ నడుస్తోంది. బేస్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ కలిపితే ఏకంగా రూ.21,000 వరకు తగ్గింపును పొందవచ్చు. మరెందుకు ఆలస్యం స్టాక్ అయిపోయేలోపు ఈ డీల్‌ను ఎలా పొందాలో ఓసారి చూసేయండి.

ధర తగ్గిందిలా..

భారతదేశంలో iPhone 16 Plus విడుదలైనప్పుడు దీని ప్రారంభ ధర రూ.89,900. అయితే ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఎలాంటి కూపన్లు, ఎక్స్ఛేంజ్ అవసరం లేకుండానే నేరుగా రూ.71,890కే అందుబాటులో ఉంది. అంటే.. ఇక్కడ మీకు రూ.18,010 తగ్గుతుంది. దీనికి అదనంగా.. మీ వద్ద HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే EMI ఆప్షన్ ద్వారా మరో రూ.3,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ తగ్గింపులన్నీ పోయాక మీకు నచ్చిన ఐఫోన్ చాలా తక్కువ ధరకే మీ సొంతమవుతుంది.

Advertisement

Also Read: ఈ దుస్తులను పొరపాటున కూడా వాషింగ్ మెషీన్‌లో వేయకండి, ఎందుకంటే?

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్..

ఈ iPhone 16 Plusలో లేటెస్ట్ A18 చిప్‌సెట్ ఉండటం వల్ల ఫోన్ ఎక్కడా స్లో అవ్వదు. ముఖ్యంగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు మీ రోజువారీ పనులను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడుకోవడానికి 6.7 అంగుళాల పెద్ద సూపర్ రెటినా XDR డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. ఇక ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాతో ప్రొఫెషనల్ క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు.

27 గంటల వీడియో ప్లేబ్యాక్..

Advertisement

చాలామంది ఐఫోన్ అనగానే బ్యాటరీ గురించి ఆలోచిస్తారు. కానీ ఈ iPhone 16 Plusను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే.. ట్రావెలింగ్‌లో ఉన్నా, రీల్స్ స్క్రోల్ చేసినా టెన్షన్ అక్కర్లేదు. అలాగే వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే మాత్రమే ఉంటుంది.

Also Read: మార్కెట్లోకి అదిరిపోయే పోర్టబుల్ ఏసీలు.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలో పెట్టుకోవచ్చు!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×