E-Paper
Advertisement

Jabardast Komaram : మూడేళ్లు నరకం చూశాను.. మూటలు మోసాను..భార్య పై షాకింగ్ కామెంట్స్..

Jabardast Komaram : మూడేళ్లు నరకం చూశాను.. మూటలు మోసాను..భార్య పై షాకింగ్ కామెంట్స్..
Advertisement

Jabardast Komaram : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కమెడియన్ గా కొనసాగుతున్న ఎంతోమంది ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులను కష్టాలను అనుభవించిన వారే.. ఎవరికి సినీ కెరియర్ అనేది పూలపంపు లాగా లేదు.. ముఖ్యంగా జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్లు ఎన్నో కష్టాలను దిగమింగుకొని అవకాశాలను అందుకుంటు.. ప్రస్తుతం సినిమాలలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు.. అలాంటి వారిలో జబర్దస్త్ కొమరం ఒకరు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు.. జబర్దస్త్ ద్వారా మంచి పాపులర్ తిని సొంతం చేసుకున్నాడు.. ముఖ్యంగా లేడీ గెటప్ తో ఈయన అందరిని కడుపుబ్బా నవ్వించేశాడు.. ప్రస్తుతం కొమరం సినిమాలో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నాడు.. అంతే కాదు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు.. తాజాగా కొమరం ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన భార్య గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. తన భార్య గురించి కొమరం ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం..

మూటలు మోసి కుటుంబాన్ని పోషించాను…

జబర్దస్త్ కొమరం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో స్కిట్లలో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు.. లేడీ గెటప్ లో అతని నటనకు ఫిదా అయ్యారు జనాలు.. ఆ తర్వాత సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంటూ వచ్చాడు.. అయితే ఈ కొమరం జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన విషయం అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొమరం తన జీవితంలో పడ్డ కష్టాల గురించి బయటపెట్టారు.. అన్నదమ్ములు వేరే కాపురం పెట్టిన తర్వాత నేను చాలా కష్టాలను అనుభవించాను అని ఆ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. అంతేకాదు రోజు మూటలు మోసి కుటుంబాన్ని పోషించుకున్నాను. కానీ నా భార్య చాలీచాలని డబ్బులతో ఏమి చేయలేం కదా అని అంది. అలా సినిమాల్లోకి రావాలని ఆలోచన వచ్చింది అని కొమరం అన్నారు..

మూడేళ్లు భార్యకు దూరం..

Advertisement

నాకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఉండేది. అయితే నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేసాను. కానీ నా భార్య మాత్రం నాకు ఎప్పుడూ సపోర్ట్ గానే ఉండేది. మనకు వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది నీకు మూడేళ్లు టైం ఇస్తున్నాను.. ఆ మూడేళ్లలో నువ్వు నటుడుగా గుర్తింపు తెచ్చుకో అని నాకు చెప్పింది.. అలా నేను మూడేళ్లు కాదు ఐదు ఏళ్ళు కష్టపడ్డాను. అయితే ఆ ఐదేళ్లు నాకు నా భార్య నెలకు 3000 పంపించి ఖర్చులకు పెట్టుకోమని చెప్పేది.. బాబు స్కూల్ ఫీజు కట్టడం మాత్రమే కాదు.. ఇంట్లో గడుపుతూ వచ్చింది.. ఆమె నా జీవితంలో లేకున్నా అంటే నా జీవితం ఎలా పోయాదో ఊహించుకోవడం కష్టమే అని భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read :మహాను నమ్మించి మోసం చేసిన చక్రీ.. చక్రీ, మహా రిసెప్షన్ కు ఏర్పాట్లు..షాక్ లో మహా..

పిల్లలు పుట్టలేదని అవమానాలు..

Advertisement

అయితే నాతో పాటు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా ముగ్గురు పిల్లల్ని కన్నారు. నాకు మాత్రం ఒక బాబు ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు ఇంకా పిల్లలు ఎందుకు కలగలేదు అని చాలా దారుణంగా అవమానించారు అని కొమరం అన్నారు.. వీడికి ఏదో ప్రాబ్లం ఉంది వీడు భార్యని వదిలేసి వెళ్లిపోయాడు అంటూ నానారకాలుగా అందరూ మాట్లాడుకోవడం బాధేసింది. వాళ్ళ అన్న మాటలు నన్ను కసితో ఇంత దూరం తీసుకొచ్చాయి అని కొమరం అన్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈయన కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సినిమాలతో పాటుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు.

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×