E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కార్తీక్ ను తాళి కట్టమన్న జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode April 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కార్తీక్ ను తాళి కట్టమన్న జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2  serial today Episode: గుడిమెట్ల మీద కూర్చుని జ్యోత్స్న, సుమిత్రల గురించి ఆలోచిస్తుంటారు కార్తీక్‌, దీప. జ్యోత్స్న ప్రవర్తన గురించి నిజం తెలిస్తే సుమిత్ర తట్టుకోలేదని ఇక జ్యోత్స్న తన సొంత కూతురు కాదన్న విషయం తెలిస్తే వెంటనే గుండె ఆగి చనిపోతుందని ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు. అప్పుడే పక్క నుంచి వచ్చి జ్యోత్స్న వింటుంది. సుమిత్ర నిజం తెలిసినా తట్టుకోగలదు అన్న రోజు మనం ఈ డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని కార్తీక్‌ చెప్తుండగానే.. జ్యోత్స్న దగ్గరకు వెళ్లి తనకు తల తిరుగుతుందని వెంటనే హాస్పిటల్‌కు వెళ్దాం పద అంటుంది. అప్పుడే వచ్చిన పారిజాతం వాడి డ్యూటీ అయిపోయింది. నేను వస్తాను పదా అంటూ చెప్పగానే.. జ్యోత్స్న పారిజాతం మీద సీరియస్‌ అవుతుంది.

నీతో వాదించడం నా వల్ల కాదు.. నేనే కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోతా.. దేన్నో ఒక దాన్ని గుద్దేస్తా అనగానే.. పారిజాతం వద్దు అలా జరిగితే మీ అమ్మ గుండె పట్టుకుంటుంది. మా ఆయన నా పీక పట్టుకుంటాడు.. ఒరేయ్‌ మనవడా..? నువ్వు దీన్ని తీసుకెళ్లు.. నేను దీపను తీసుకెళ్తాను అని చెప్పగానే.. దీప తాను కూడా కార్తీక్‌ తో వెళ్తాను అంటుంది. దీంతో వద్దని ఇద్దరు జ్యోత్స్న , కార్తీక్‌ను తీసుకుని వెళ్లిపోతుంది.  మధ్యలోకి వెళ్లాక కొబ్బరి బొండం తాగాలని కారు ఆపమని చెప్తుంది జ్యోత్స్న. దీంతో కార్తీక్‌ ఈరోజు మా పెళ్లి రోజని ముందే తల తిరుగుతుంది ఎక్కడో కాలుతున్నట్టు ఉంది.. అందుకే చల్లగా కొబ్బరి బొండం తాగు అంటూ సెటైర్‌ వేస్తాడు. ఇంతలో కార్తీక్‌ కు ఫోన్‌ చేస్తుంది దీప. నువ్వు ఇంటికి వెళ్లు నేను వస్తానని కార్తీక్‌ చెప్పగానే.. సరే అంటూ కాల్ కట్‌ చేస్తుంది. జ్యోత్స్న మణికొండలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్లాలి అంటూ చెప్పగానే.. కార్తీక్‌ కోపంగా చూస్తుంటాడు. పద బావ లేకపోతే ఇక్కడే పడిపోయేలా ఉన్నాను తర్వాత నువ్వే నన్ను ఎత్తుకెళ్లాలి అని చెప్పగానే.. కార్తీక్‌ కార్‌ స్టార్ట్ చేస్తాడు..

Advertisement

మరోవైపు కారులో వెళ్తున్న పారిజాతానికి శివనారాయణ కాల్ చేస్తాడు. ఎప్పుడో గుడికి వెళ్లారు.. ఇంకా రాలేదేంటని అడుగుతాడు. జ్యోత్స్న ఫోన్‌ కలవడం లేదని చెప్పగానే.. తను ఎక్కడుందని అడగ్గానే.. పారిజాతం షాక్‌ అవుతుంది. జ్యోత్స్న కార్తీక్‌ను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లిందని చెప్పగానే.. అందరూ కంగారు పడతారు. గుడి దగ్గర జరిగిన విషయం చెప్పగానే.. శివనారాయణ కోపంగా గుడి దగ్గరే నాకు చెప్పాలి కదా అంటూ తిడతాడు.

మరోవైపు కార్తీక్‌ కోపంగా మీరు చెప్పినట్టు నేను చేయలేను ఇవాళ నా పెళ్లి రోజు అంటాడు. దీంతో జ్యోత్స్న బానిసలకు సొంత ఆలోచనలు ఉండకూడదు బావ.. ముందు అక్కడ కారు ఆపు అని చెప్పగానే.. కారు ఆపిన కార్తీక్‌ ఇక్కడ ఎందుకు కారు ఆపావు అని అడగ్గానే.. నాకు పుల్ల ఐస్‌క్రీమ్ తినాలని ఉంది. అందుకే అంటూ కారు దిగి వెళ్తిపోతుంది జ్యోత్స్న. పుల్ల ఐస్‌క్రీమ్‌ తీసుకుని వచ్చి కార్తీక్‌కు ఒకటి ఇస్తుంది. కార్తీక్‌ వద్దని చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటే.. ఇంకో దగ్గర కారు ఆపమని చెప్తుంది. కారు ఆగాక జ్యోత్స్న కారు దిగి ఈ ప్లేస్‌ చాలా బాగుంది. అంటూ మాటలు చెప్తుంటే.. కార్తీక్‌ కోపంగా త్వరగా వెళ్లాలి అంటూ అడగ్గానే.. వెళ్దువులే కానీ ఇక నేను దీపే అసలైన వారసురాలు అని చెప్తాను అలాగే నీకో పెళ్లి గిఫ్ట్‌ ఇస్తాను అంటుంది. ఆ మాటలకు కార్తీక్‌ షాక్‌ అవుతాడు. జ్యోత్స్న గిఫ్ట్ తీసుకో బావ అంటూ తాళిబొట్టు కార్తీక్‌ చేతిలో పెడుతుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×