E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ప్లాప్ – సూరజ్ కు దొరికిపోయిన మాణిక్యం 

Karthika Deepam 2 Serial Today Episode June 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ప్లాప్ – సూరజ్ కు దొరికిపోయిన మాణిక్యం 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: దీప, కార్తీక్‌ టీ తాగడానికి వెళ్లగానే.. సూరజ్‌ అదే పనిగా జ్యోను చూస్తుంటాడు. అది గమనించిన జ్యో హలో ఏంటలా చూస్తున్నావు అని అడగుగుతుంది. దీంతో సూరజ్‌ ఫోకస్‌ చేస్తున్నాను అంటాడు. దీంతో జ్యో కోపంగా నువ్వు ఫోకస్‌ చేయాల్సింది ఇక్కడ కాదు అక్కడ అని చెప్పగానే.. నేను ఎక్కడ ఫోకస్‌ చేయాలనుకుంటున్నానో అక్కడే చేస్తున్నాను అని చెప్పగానే.. జ్యో కోసంగా నీకు ఎంత ధైర్యం లేకపోతే నన్నే చూస్తావా..? పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తే నిన్ను జైళ్లో వేస్తారు అనగానే.. వేయని కానీ నేను ఏది చూడాలనుకున్నానో అదే చూస్తున్నాను అని చెప్పగానే.. ఇంతకీ ఏం చూస్తున్నావు అని అడగ్గానే.. నీ వెనకాలే ఉన్న క్లాక్‌ను చూస్తున్నాను అని చెప్పగానే.. జ్యో కోపంగా నేను ఫోకస్‌ చేయక నువ్వు ఇంతదాకా వచ్చావు.. లేదంటే ఎక్కడ ఉండేవాడివో నీకు తెలియదు అంటూ కోపంగా తిడుతుంది.

క్యాంటీన్‌లో కాఫీ తాగుతున్న దీప, కార్తీక్‌, దక్షిణమూర్తి గురించి ఆలోచిస్తుంటారు. ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అని దీప చెబితే తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు అంటాడు కార్తీక్‌. ముందు వర్క్‌ మీద ఫోకస్‌ చేయ్‌ నువ్వు ఈ కాంపిటీషన్‌ లో గెలవాలి. ఈ కంపెనీకి నువ్వు సీఈవో అవ్వాలి.. కొన్ని విషయాల్లో నేను నీకు సపోర్ట్‌ చేయలేకపోయినందుకు బాధగా ఉన్నా సూరజ్‌ వచ్చాక కాస్త రిలీఫ్‌ అనిపిస్తుంది అంటూ ఇక వెళ్దాం పద లేదంటే పెద్ద మేడం ఫీలవుతుంది. అంటూ ఇద్దరూ లోపలికి వెళ్తారు.

Advertisement

దీప లోపలికి వెళ్లగానే.. సూరజ్‌ తమకు చిన్న చిన్న ఆర్డర్స్‌ రెండు వచ్చాయని వాటి వల్ల పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు కానీ అంటూ ఏదో చెప్పబోతుంటే.. చిన్న ఆర్డర్సే రేపు పెద్ద ఆర్డర్స్‌కు దారి తీస్తాయని కార్తీక్‌ చెప్పబోతుంటే.. జ్యో నీ ఫోకస్‌ అంతా అక్కడే పెట్టినట్టు ఉన్నావు అంటూ కార్తీక్‌ ను తన వైపు తిప్పుకుంటుంది. ఇంతలో దీపకు మేనేజర్‌ ఫోన్‌ చేసి బ్రాంచ్‌లో గొడవ జరుగుతుంది అని చెప్తాడు. దీంతో దీప కంగారుగా తాను ఇప్పుడే వస్తున్నానని కాల్‌ కట్‌ చేసి విషయం కార్తీక్‌కు చెప్తుంది. దీంతో కార్తీక్‌, దీప, సూరజ్‌, జ్యో అక్కడికి వెళ్తారు. రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి తాను ఆర్డర్‌ చేసిన వెజ్‌ బిర్యానీలో బొద్దింక వచ్చిందని గొడవ చేస్తుంటాడు. దీప ఎంత చెప్పినా ఆ కస్టమర్‌ అసలు వినడు.. సోషల్‌ మీడియాలో లైవ్‌ పెట్టానని బెదిరిస్తుంటాడు. ఫుడ్‌ ఆఫీసర్‌కు కూడా కంప్లైంట్‌ చేశానని వాళ్లు కూడా వస్తుంటారని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

ఇంతలో పుడ్‌ ఆఫీసర్లు రాగానే.. ఆ వ్యక్తి వాళ్లకు తన ఫుడ్డులో బొద్దింక వచ్చిందని ఈ రెస్టారెంట్‌ను సీజ్‌ చేయమని చెప్తూ.. రెస్టారెంట్‌ మొత్తం లైవ్‌ వీడియోలో చూపిస్తుంటాడు. కార్తీక్‌ కూడా ఇక తాను ఏమీ చేయలేనని చెప్పగానే.. సూరజ్‌ మాత్రం వాడి వాలకం అనుమానంగా ఉంది నేను ఒక ప్రయత్నం  చేస్తాను మీరు ఇక్కడే ఉండండి అంటూ వాడి వెనకాలే వెళ్తాడు. వాణ్ని మాటల్లో పెట్టి అసలు నిజం తెలుసుకుంటాడు. తనతో ఈ గొడవ చేయమని చెప్పింది జ్యో అని సూరజ్‌కు నిజం చెప్తాడు. అందుకోసం తనకు పదివేలు ఇస్తానంది అంటాడు. దీంతో సూరజ్‌ మొత్తం వీడియో తీస్తాడు. లోపలికి వెళ్లి అందరికీ వీడియో చూపిస్తాడు. దీంతో అందరూ కలిసి ఆ వ్యక్తిని చితక్కొటి నిజం చెప్పమని నిలదీస్తారు. దీప కల్పించుకుని అతన్ని వదిలేయమని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Big Stories

Advertisement
×