E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 16th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రకు నిజం చెప్పిన జ్యోత్స్న 

Karthika Deepam 2 Serial Today march 16th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రకు నిజం చెప్పిన జ్యోత్స్న 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కార్తీక్‌, దీప ఇద్దరూ కలిసి సుమిత్రను చూడటానికి వెళ్తారు. దీపను చూసిన సుమిత్ర కడుపుతో ఉన్న మనిషిని నువ్వు ఇంత దూరం రావాలా..? టెస్టులన్నీ చేయించుకున్నావా..? బిడ్డ క్షేమంగా ఉందని చెప్పారా..? డాక్టర్లు.. అంటూ సుమిత్ర అడుగుతుంటే అప్పుడే అక్కడికి జ్యోత్స్న వెళ్తుంది. బిడ్డ క్షేమం గురించి నువ్వు ఎన్నిసార్లు అడిగినా దీప సమాధానం చెప్పదు అంటుంది. ఎందుకంటే దీప తన బిడ్డను వదిలేసుకుంది.. తనకి పిల్లలు వద్దట, బిడ్డ భారంగా ఉందట అంటూ జ్యోత్స్న, దీపను తిడుతుంది.

దీంతో కార్తీక్‌ కోపంగా జ్యోత్స్నను తిడతాడు. నా బిడ్డ, నా భార్య.. నా ఇష్టం. నేను ఏం చేసుకున్నా అడిగే అధికారం ఎవ్వరికీ లేదంటూ తిట్టగానే.. జ్యోత్స్న కోపంగా అత్తని కూడా ఇలాగే నోరు మూయించాడు.. పాపం అత్త ఏడుస్తూ వెళ్లిపోయింది… చూశారా..? ఈ దీప ఎలాంటిదో ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. మీరే సరిగా అర్ధం చేసుకోవడం లేదు.. దీప ఎప్పుడూ ఎవరో ఒకరి చావు కోరుకుంటూనే ఉంది. ఒకప్పుడు మా డాడీని చంపాలనుకుంది, అయినాసరే మా వాళ్లకి సిగ్గు లేకుండా ఇంట్లోకి రానిచ్చారు అంటూ జ్యోత్స్న తిడుతుంటే.. కార్తీక్‌ కోపంగా అలా అయితే సిగ్గు లేనిది నీకు.. అగ్రిమెంట్ పేరుతో ఇంట్లో ఉండే పర్మిషన్ ఇచ్చింది నువ్వే అంటాడు..

Advertisement

దీంతో జ్యోత్స్న నేను మీలాగా మనుషుల్ని చంపే రకం కాదు అనగానే.. అవును మరి కారుతో గుద్దేయడం, లారీతో గుద్దేయడం మాకే అలవాటు అంటూ కార్తీక్ అనగానే.. పారు భయపడుతుంది. ఇంతలో శివనారాయణ వచ్చి కార్తీక్, దీపలను తిడతాడు. కాంచన అత్తకి ఉన్న ఒక్క సంతోషాన్ని దీప దూరం చేస్తోందని.. మళ్లీ తనకు పిల్లుల అవకాశం లేదట అని జ్యోత్స్న చెప్పగానే.. సుమిత్ర షాక్‌ అవుతుంది. వినడానికే ఇంత ఇబ్బందిగా ఉంటే నువ్వు ఈ పని ఎలా చేయగలుగుతున్నావంటూ దీపను ప్రశ్నిస్తుంది సుమిత్ర. అప్పుడే లోపలికి వచ్చిన దశరథ అందరినీ బయటకు వెళ్లమని చెప్తాడు. అందరూ వెళ్లిపోయాక.. దీప కడుపులో బిడ్డ బతకాలి.. అది ఈ లోకం చూడాలని సుమిత్ర, దశరథతో చెప్తుంది. దీంతో దశరథ మనసులో  అది ఈలోకం చూడాలంటే.. నువ్వు ఈ లోకంలో ఉండవు, నీ కోసమే నీ కూతురు త్యాగం చేస్తోంది అనుకుంటాడు.

బయటకు మాత్రం బిడ్డ బతకాలన్నది నీ కోరిక మాత్రమే కాదు.. నా కోరిక కూడా, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్తాడు. మరోవైపు దీపకు కడుపులో ఉన్న బిడ్డ గురించి కాంచన బాధపడుతుంది. ఎక్కడికి వెళ్లాలో అర్ధం కావడం లేదు.. ఇక్కడ ఉండలేను, ఇంకెక్కడికి వెళ్లలేను అంటూ శ్రీధర్‌తో చెప్తూ.. ఏడుస్తుంది. శ్రీధర్‌ మా ఇంటికి వెళ్దాం పద అనగానే.. కాంచన కోప్పడుతుంది. ఇంతలో కార్తీక్‌ వచ్చి ఏదో చెప్పబోతుంటే.. కాంచన కోపంగా వాడిని నాతో మాట్లాడొద్దని చెప్పండి అంటుంది. దీంత శ్రీధర్‌ కూడా కార్తీక్ ను తిడతాడు..  నువ్వు నీ బిడ్డను వద్దు అనుకున్నావు కానీ.. నేను నా బిడ్డను వద్దు అనుకోలేదు కదా? నీలాగా నేను వదిలేసుకునే తండ్రిని కాదు.. కొడుకే వద్దు అనుకున్నా వెంటపడి దక్కించుకున్న తండ్రిని అంటాడు.

Advertisement

నా కొడుకు ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడని అనుకునే వాడిని కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది అంటూ ఎమోషనల్‌ అవుతాడు శ్రీధర్‌.. నీ భార్యకు మళ్లీ బిడ్డలు పుట్టరని తెలిసినా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుందని అదేంటో నేనే తెలుసుకుంటానని శ్రీధర్‌ చెప్తాడు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×