E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన పారిజాతం  

Karthika Deepam 2 Serial Today Episode May 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన పారిజాతం  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: శ్రీధర్‌ను కాపాడిన సూరజ్‌ను కలిసి కార్తీక్‌ థాంక్స్‌ చెప్తాడు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తాడు. ఇంతలో సూరజ్‌కు ఎవరో ఫోన్‌ చేసి మీటింగ్‌కు రాలేదని నష్టపోయానని తెలుసు కానీ తర్వాత మాట్లాడతాను అంటూ చెప్తాడు. అంతా విన్న కార్తీక్‌ చాలా రోజుల తర్వాత ఓ మనిషిని కలిసినట్టు అనిపించింది.. నువ్వు నిజంగా గ్రేట్‌, నీ వ్యక్తిత్వం చూస్తుంటే.. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉంది అంటాడు. దీంతో సూరజ్‌ నేను ఏం చేయలేదు.. నన్ను మరీ ఇబ్బంది పెట్టొద్దు అంతగా కావాలంటే మీరు ఒకరికి హెల్ప్‌ చేయండి అంటూ ఇద్దరూ కలిసి శ్రీధర్‌ దగ్గరకు వెళ్తారు. సూరజ్‌ సార్‌ ఎలా ఉంది అని అడగ్గానే.. నీ దయ వల్ల బాగానే ఉంది బాబు అని చెప్పగానే.. నా దయ కాదు సార్‌ అంతా దేవుడి దయ అంటాడు. దీంతో శ్రీధర్‌ నువ్వు నా కొడుకులాగే మాట్లాడుతున్నావు బాబు అనగానే.. బ్రదర్‌ దగ్గర దగ్గర అలాగే ఉన్నాడు మాస్టారు అని చెప్పగానే.. సూరజ్‌ మీరు మాస్టారా..? సారు అని అడుగుతాడు. దీంతో శ్రీధర్‌ లేదు బాబు నేను బిజినెస్‌ చేస్తాను.. అనగానే.. కార్తీక్ తన ఎందుకు అలా పిలుస్తున్నాడో చెప్తాడు. సూరజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

డాక్టర్‌ వచ్చి ఇంకోసారి శ్రీధర్‌కు స్ర్టోక్ వచ్చిందంటే చాలా డేంజర్‌. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. రెండు రోజులు హాస్పిటల్‌ లోనే ఉండాలని చెప్తాడు. దీంతో శ్రీధర్‌ రెండు రోజులు ఉండలేను ఈ విషయం మా వాళ్లకు తెలియదు.. తెలిస్తే మా వాళ్లు మొత్తం ఇక్కడే ఉంటారు. ఇంటి దగ్గరే ఉంటానని చెప్పగానే.. కార్తీక్‌ కూడా కొంచెం చూడండి డాక్టర్‌ అనగానే.. సరే ఇవాళ వెళ్లి మళ్లీ రేపు ఒకసారి వచ్చి వెళ్లండి అని చెప్పి వెళ్లిపోతాడు డాక్టర్‌. శ్రీధర్‌, కార్తీక్‌ కంగారు పడతారు.

Advertisement

ఇంటికి వచ్చిన దీపను కార్తీక్‌ ఎక్కడ అని అడుగుతుంది కాంచన. ఎక్కడికో వెళ్లాడు అని చెప్తుంది దీప. దీంతో కాంచన అసలు ఏమైనా గొడవ జరిగిందా..? అంటూ అడగ్గానే.. ఏం లేదు అని దీప చెప్పగానే.. కాంచన అనుమానంగా దశరథకు కాల్ చేస్తానని అనగానే.. జరిగిన గొడవ చెప్తుంది దీప. దీంతో కాంచన శ్రీధర్‌కు కాల్‌ చేస్తుంది. ఎక్కడున్నారు కార్తీక్‌ ఏమైనా కాల్ చేశాడా అని అడగ్గానే.. నా దగ్గరే ఉన్నాడు ఇద్దరం ఇంటికి వస్తున్నాం అంటూ చెప్పగానే.. ఒకసారి కార్తీక్‌ ఇవ్వండి అంటే శ్రీధర్‌ వెటకారంగా మాట్లాడతాడు. తిక్కతిక్కగా మాట్లాడుతుంటే.. కాంచన కాల్‌ కట్‌ చేస్తుంది.

మరోవైపు జ్యోత్స్న తనను తాను తిట్టుకుంటూ కోప్పడుతుంటే.. పారిజాతం వచ్చి అసలు నిజం చెప్తుంది. ఈ చీర కొన్నది నీ కోసమే.. ఈ ప్లానంగా కార్తీక్ గాడిదే. అంటూ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా అసలు మీరంతా నన్ను ఏం చేద్దాం అనుకున్నారు అంటూ అడగ్గానే.. పారిజాతం మొత్తం చెప్పి జ్యోత్స్నును  తిడుతుంది. నెల రోజుల్లో నీకు పెళ్లి చేస్తామని వార్నింగ్‌ ఇస్తుంది.

Advertisement

శ్రీధర్‌ను ఇంటికి తీసుకెళ్లిన కార్తీక్‌. కావేరీని శ్రీధర్‌ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏమైనా గొడవ జరిగిందా అని అడగ్గానే.. కావేరీ జరిగిన విషయం చెప్తుంది. దీంతో కార్తీక్ టాబ్లెట్స్‌ తీసి శ్రీధర్‌ వేసుకునే టాబ్లెట్‌ టైమింగ్‌ గురించి స్వప్నకు చెప్తాడు. వీటితో పాటు నువ్వు మనఃశాంతి అనే టాబ్లెట్‌ ఇవ్వాలని చెప్తాడు. ఎమోషనల్‌ అవుతూ.. స్వప్నను కన్వీన్స్‌ చేయాలని చూస్తాడు. దీంతో స్వప్న సారీ అన్నయ్య ఇంకెప్పుడూ నాన్నతో పోట్లాడను.. అని చెప్పగానే.. పోట్లాడితే ఆయన ఉండరు అంటూ కార్తీక్ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. నాన్నను జాగ్రత్తగా చూసుకో.. నీకు చేతకాకపోతే చెప్పు నేను తీసుకెళ్లిపోతాను అంటూ జాగ్రత్తలు చెప్పి కార్తీక్‌ వెళ్లిపోతాడు. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×