E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్‌ లను తిట్టిన దశరథ – ఒంటరిగా రూంలో కూర్చుని బాధపడిన జ్యో  

Karthika Deepam 2 Serial Today Episode September 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్‌ లను తిట్టిన దశరథ – ఒంటరిగా రూంలో కూర్చుని బాధపడిన జ్యో  
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  హాస్పిటల్‌ లోనే కూర్చున్న దీప, కార్తీక్ బాధపడుతూ సూరజ్‌ వెళ్తూ వెళ్తూ మనల్ని ఎందుకు ఇరికించి వెళ్లాడు అని ఆలోచిస్తారు. ముగ్గురు కలిసే ప్లాన్‌ చేసి మనల్ని ట్రాప్‌ చేశారు. ముందు సూరజ్‌ వచ్చాడు. తర్వాత దక్షిణమూర్తి తాత వచ్చాడు. ఆ తర్వాత మాలిని వచ్చారు మనమే సూరజ్‌ మంచి వాడు అని సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నాము.. మా నాన్న ఆరోజే చెప్పాడు. ఒకడు తన సామర్థ్యాన్ని తగ్గించుకుని తలవంచుకుని బతుకుతున్నాడంటే వాడిన ఏదో ఒక శక్తి ఆపుతుందని ఆ బలమైన శక్తి వాడి పగే.. సూరజ్‌కు సుమిత్ర అత్త ఫ్యామిలీ మీద ఉన్న పగే వాడిని ఆపింది. సూరజ్‌ విషయం మనం ఎప్పటికప్పుడు మోసపోయాం.. ఎందకంటే మనది మంచితనం. అది అడ్డుపెట్టుని అందరినీ ఫూల్స్‌ను చేశాడు. మనల్ని ఇలా ఫ్యామిలీకి దూరం చేయడానికి కూడా ముందే ప్లాన్‌ చేశాడు. ఇక నేను వాడిని వదిలిపెట్టను. నా తల్లిని అవిటి దాన్ని చేశారు. వాళ్లను అసలు వదలను అంటూ కార్తీక్ ఎమోషనల్‌ అవుతాడు.

రూంలోకి ఒంటరిగా బాధపడుతూ వెళ్లిన జ్యోత్స్న ఏడుస్తూ.. పెళ్లికి ముందు సూరజ్‌ వచ్చి ఇచ్చిన గిఫ్ట్‌ గుర్తు చేసుకుని గిఫ్ట్‌ తీసుకుంటుంది. నీ మాటే నిజం అయిందిరా నేను ఒంటరిగానే ఇది ఓపెన్‌ చేస్తున్నాను. అసలు ఇందులో ఏముంది అనకుంటూ గిఫ్ట్‌ ఓపెన్‌ చేస్తుంది. అందులో జ్యో, సూరజ్‌కు గిఫ్ట్ గా ఇచ్చిన చైన్‌ లాకెట్‌, రింగ్‌, వాడిపోయిన గులాబీ పువ్వు ఉంటాయి. అవి చూసి ప్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేసుకుంటుంది జ్యో. అందులోనే ఒక లెటర ఉంటుంది. అందులో అన్ని తిరిగి ఇచ్చేశాను అని రాసి ఉంటుంది. అది చదివిన జ్యోత్స్న బోరున ఏడుస్తుంది.

Advertisement

అప్పుడే పారిజాతం వస్తుంది. ఏడుస్తున్నావా..? కన్నీళ్లు వస్తున్నాయి అంటూ అడగ్గానే.. లేదు గ్రాని నాలోని బాధ వదిలేస్తున్నాను అంటూ చెప్తుంది. పారిజాతం కోపంగా సూరజ్‌ను తిడుతుంది. జ్యోత్స్నను తిడుతుంది. ఇంకా వాడి కోసం ఏడుస్తున్నావా..? వాడిని మర్చిపో అని చెప్తుంది. నేను ఆస్థికోసం మారిపోమ్మని చెప్తే.. నువ్వు వాడి కోసం మారిపోయావు అంటూ తిడుతుంది. ఇక సూరజ్‌ గాడిని మర్చిపో అంటే వీలు కాదు గ్రాని చాలా దూరం వచ్చేశాను. మారడం వీలు కాదని చెప్తుంటే.. లాకెట్‌ ఉన్న జ్యో, సూరజ్‌ ఫోటోలు చూసి పారిజాతం కోపంగా సూరజ్‌ ఫోటో తీసేస్తుంటే.. సూరజ్‌ లాకెట్‌ లో మాత్రమే లేడు నా మనసులో ఉన్నాడు అని చెప్తుంది. దీంతో పారిజాతం కోపంగా సూరజ్‌ను తిడుతూ. నీ కన్నీళ్ల ఉసురు ఆ సూరజ్‌ గాడికి తగులతుందే అంటూ ఏడుస్తూ శపిస్తుంది.

హాస్పిటల్‌ లోనే బాధగా కూర్చున్న దశరథ దగ్గరకు దీప, కార్తీక్‌ వెళ్తారు. మీరు వెళ్లిపోయారు అనుకున్నాను అంటాడు దశరథ. అమ్మకు ఎలా ఉంది నాన్న అని దీప అడిగితే.. నా భార్యకు బాగానే ఉంది అంటాడు. ఆ మాటలకు దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. మీరు నిజం చెప్పకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయిందని దశరథ చెబితే కార్తీక్‌ ఏంటి మామయ్య మీరు అలా మాట్లాడుతున్నారు అంటే.. అవును మీరు మాలిని అన్న మాటలు గుర్తు చేసుకోండి.. జ్యోత్స్నను సుమిత్ర కూతురువి అయినందు వల్లే నువ్వు ఈ శిక్ష అనుభవించాలి అంది. అప్పుడైనా మీరు జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదన్న నిజం చెప్పొచ్చు కదా..? నా దగ్గర చెప్పొద్దని మాట తీసుకున్నారు కాబట్టి నేను ఆగిపోయాను. కానీ మీరైనా చెప్పాలి కదా అంటాడు.

Advertisement

అందుకు దీప అది చెప్పు సందర్భమేనా నాన్న అని అడిగితే.. జ్యోత్స్న జీవితమే నాశనం అయిపోతుంటే.. చెప్పే సందర్భమేనా అని అడుగుతావేంటి అమ్మ..? దాని మీద నీకున్న పగని ఇలా తీర్చుకున్నావా..? అమ్మా అంటూ దశరథ ప్రశ్నిస్తే.. దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. జ్యోత్స్న మాట కోసం నిలబడింది. ఆ క్షణమే జ్యోత్స్న మా సొంత కూతురు అయిపోయింది. కానీ నువ్వు నీ తోడబుట్టిన చెల్లెలి లాంటి జ్యోత్స్న జీవితం నాశనం అయిపోతుంటే మౌనంగా భర్త పక్కన ఉండిపోయావు.. జరిగిన అన్నింటికీ మీరిద్దరే కారణం.. మిమ్మల్ని సుమిత్ర చూస్తే తట్టుకోలేదు అంటూ దశరథ తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×