E-Paper
Advertisement

Mad For Each Other Promo: మా కోసం ఎవ్వరూ రారు అని ఏడ్చేసిన నూకరాజు..అమ్మాయి వల్ల భార్యను దూరం పెట్టిన నటరాజ్ మాస్టర్..

Mad For Each Other Promo: మా కోసం ఎవ్వరూ రారు అని ఏడ్చేసిన నూకరాజు..అమ్మాయి వల్ల భార్యను దూరం పెట్టిన నటరాజ్ మాస్టర్..
Advertisement

Mad For Each Other:

తెలుగు టెలివిజన్‌లో ఇప్పటికే ఎన్నో రియాలిటీ షోలు వచ్చాయి. అందులో ముఖ్యంగా బిగ్‌బాస్ తెలుగు మంచి పేరు సంపాదించింది. ప్రతి సీజన్‌ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే ఇప్పుడు అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించేలా మరో కొత్త రియాలిటీ షో రాబోతోంది. ఆ షో పేరు ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’.ఈ షోకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

Advertisement

ఈ కార్యక్రమం స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానుంది. అలాగే జియో హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమింగ్ ఉండనుంది. ఈ షోలో మొత్తం పది సెలబ్రిటీ జంటలు పాల్గొంటున్నారు. వారిని ఒకే ఇంట్లో ఉంచి వారి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, అనుబంధాన్ని పరీక్షించే విధంగా టాస్క్‌లు నిర్వహిస్తారు.

ఈరోజు విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఆ ప్రోమోలో ప్రతి జంట తమ ప్రేమ కథలను, జీవితంలో ఎదురైన కష్టాలను చెప్పుకున్నారు. కొన్ని జంటలు తమ మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలను కూడా వెల్లడించారు. ఈ కారణంగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ప్రోమోలో ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ తన ప్రేమ కథను చెప్పిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. తన జీవితంలో ప్రేమ ఎలా మొదలైంది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషయాలను ఆయన ఎమోషనల్‌గా వివరించారు. అలాగే మరో జంట అయిన సాండ్రా – మహేష్ మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సాండ్రా భర్త చెప్పిన ఎమోషనల్ మాటలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. అంతేకాదు నూకరాజు మాట్లాడుతూ తను ఎంత కోపంగా ఉన్న.. ఆసియా తనను ప్రేమగా చూసుకుంటుందని.. తనకు నేను.. నాకు తను.. మా కోసం ఎవ్వరూ రారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

జంటలు ఎవరంటే..!

ఈ షోలో పాల్గొంటున్న జంటల్లో శివ–ప్రియాంక జైన్, నూకరాజు–ఆసియా, వసంతి–కళ్యాణ్, జాను–భాను, బింటూ–సంధ్య, సోనియా–సిద్దు, సాండ్రా–మహేష్, నీతూ–నటరాజ్, హరిత–హరీష్, అంజలి–పవన్ వంటి జంటలు ఉన్నారు. వీరు పదివారాల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉండబోతున్నారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, అలాగే సీనియర్ నటీమణులు లయ.. రాధా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. జంటల మధ్య జరిగే టాస్కులు, భావోద్వేగ క్షణాలు, ప్రేమపూరిత సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చెబుతున్నారు.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రియాలిటీ షోగా కనిపిస్తోంది. ఈ షో ఎంతటి ఆదరణ పొందుతుందో, నిజంగా బిగ్‌బాస్‌కు పోటీగా నిలుస్తుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం విడుదలైన ప్రోమోతోనే ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో మంచి చర్చకు కారణమైంది.

ALSO READ: OTT Movies: ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొత్త సినిమాల స్ట్రీమింగ్ పై కఠిన నిబంధనలు..!

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×