E-Paper
Advertisement

Nellore Neerja : గెటప్ శ్రీను, చంద్ర నిజ స్వరూపం ఇదే..జబర్దస్త్ లో నమ్మలేని నిజాలు..

Nellore Neerja : గెటప్ శ్రీను, చంద్ర నిజ స్వరూపం ఇదే..జబర్దస్త్ లో నమ్మలేని నిజాలు..
Advertisement

Nellore Neerja : ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతున్న వాళ్ళు ఎందరో జీవితంలో కష్టాలను అనుభవించి ఒక్కో మెట్టు ఎదుగుతూ నటులుగా తమ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. కెరియర్ మొదలైన నాటి నుంచి ఎన్నో అవమానాలను, సవాళ్లను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ నటన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈమధ్య చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ సీనియర్స్ డామినేషన్స్ ఉంటుంది అంటూ ఆరోపిస్తున్నారు. ప్రతి షోలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని వింటున్నాం. తాజాగా కమెడియన్ నెల్లూరు నీరజ జబర్దస్త్ షో గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టేసింది. జూనియర్స్ అంటే విలువ లేదు. కొందరు సీనియర్స్ అవమానిస్తున్నారు అని జబర్దస్త్ కమెడీయన్స్ నిజ స్వరూపాలను బయటపెట్టింది… జబర్దస్త్ జరిగే పాలిటిక్స్ గురించి వివరించింది.

గెటప్ శ్రీను నెంబర్ బ్లాక్ చేశాడు .. 

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నెల్లూరు నీరజ జబర్దస్త్ గురించి ఎన్నో సంచలన నిజాలను బయటపెట్టింది. ఈటీవీ ప్లస్ లో ఆమె ఎన్నో షోలలో తన కామెడీతో నవ్వించింది. అదేవిధంగా జీ తెలుగులో కూడా కామెడీ షోలలో ఆమె కనిపించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేసింది. అంత టాలెంటెడ్ గా ఉన్న కమెడియన్ నెల్లూరు నీరజ ఆమె భర్త సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా తమ స్టైల్లో నెల్లూరు స్లాంగ్ తో కామెడీ చేస్తూ వస్తుంటారు. అయితే వీళ్ళు జబర్దస్త్కు రాకముందు అందులో ఉన్న కొందరు పరిచయమని ఆమె అన్నారు. గెటప్ శ్రీను అన్నని మా ఆయన ఎక్కడైనా కమెడియన్గా ఛాన్స్ ఉంటే చెప్పండి అని మెసేజ్ చేశాడు. ఆయన చూసి బ్లాక్ చేసేసాడు. మేము ఏమీ ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించే వాళ్ళం కాదు. అలాంటిది మా ఆయన నెంబర్ ను బ్లాక్ చేయడంతో చాలా బాధపడ్డాము.. ఆ తర్వాత లైట్ తీసుకున్నామని ఆమె అన్నారు.

చంద్ర దారుణంగా అవమానించాడు.. 

Advertisement

జబర్దస్త్ లో అవకాశం వచ్చినప్పుడు మేము కొత్తగా ఎంట్రీ ఇచ్చాము. జూనియర్స్ కదా పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు అని నీరజ అన్నారు. మొదట మమ్మల్ని ఎవరు తమ టీం లోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు కానీ చమ్మక్ చంద్ర ఆయన తమ టీం లోకి మమ్మల్ని తీసుకున్నారు. ఎన్నో స్కిట్లు చేసాము. ఒక సందర్భంలో మా ఆయన స్కిట్ చేయాల్సి ఉండేది. మాకు జబర్దస్త్ తో పాటుగా క్యాటరింగ్ బిజినెస్ కూడా ఉంది. నెల్లూరులో ఓ పెళ్లికి సంబంధించిన క్యాటరింగ్ పనిలో మా ఆయన బిజీగా ఉన్నారు. అప్పుడు చంద్రన్న నాకు ఫోన్ చేసి వేరే బిజినెస్ ఉన్నప్పుడు ఇది ఎందుకు చేయాలి? ఇంకేం పని లేదా మీకు అని దారుణంగా అవమానించాడు. దాని తర్వాత మేము ఆయనకి కాల్ కూడా చేయలేదు అలా జబర్దస్త్ ని వదిలేసాము అని నీరజ అన్నారు. జబర్దస్త్ లో సీనియర్స్ జూనియర్స్ అనేది ఉండేది. టీం లీడర్స్ గా ఉన్న మాకు కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. పాలిటిక్స్ నడిచేవి. అలా మేము జబర్దస్త్ ని చేయలేము అని అనుకోని బయటికి వచ్చేసాము అని నెల్లూరు నీరజ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ఈమె కెరీర్ విషయానికొస్తే.. 

చిన్న చిన్న నాటకాలు వేస్తూ నెల్లూరు స్లాంగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కమెడియన్ నెల్లూరు నీరజ. పలు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న కామెడీ షోలలో నటించి తమదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం పలు షోలలో నటించడమే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ఓ రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు చెప్పింది. ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×