E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (15/11/2025) ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు – ఆ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (15/11/2025) ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు – ఆ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త 
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 14వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:  

ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు.  పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

వృషభ రాశి:

Advertisement

స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.

మిథున రాశి:  

ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

కర్కాటక రాశి:

Advertisement

విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.

సింహరాశి:

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కన్యారాశి :

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు.

వృశ్చికరాశి:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి:

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మకరరాశి:

దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు.

కుంభరాశి:

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మీనరాశి:

నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

 ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×