E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్ ను ఎత్తుకెళ్లిన రణవీర్  

Nindu Noorella Saavasam Serial Today Episode April 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్ ను ఎత్తుకెళ్లిన రణవీర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఆకాష్‌ను హాస్పిటల్‌ నుంచి ఎత్తుకుని రణవీర్‌ వెళ్లిపోతుంటే.. అప్పుడే డ్యూటీ డాక్టర్‌ వస్తాడు. ఏయ్‌ ఎవరు నువ్వు ఎవరు..? నా పేషెంట్‌ ను ఎత్తుకెళ్తున్నావు ఎవరు నువ్వు అంటూ అడ్డుకోగానే.. రణవీర్‌ కోపంగా మర్యాదగా అడ్డు తప్పుకో డాక్టర్‌ ఈ పిల్లవాడితో నాకు పనుంది అని చెప్పగానే.. డాక్టర్‌ కంగారుగా ఆ బాబుకు చాలా సీరియస్ గా ఉందిరా..? ఆక్సిజన్‌ లేకపోతే చనిపోతాడు అనగానే.. అందుకే ఆక్సిజన్‌తో సహా తీసుకెళ్తున్నాను.. మర్యాదగా అడ్డుతప్పుకో అనగానే.. డాక్టర్‌ షాకింగ్‌ గా అంటే కిడ్నాప్‌ చేస్తున్నావా..? సెక్యూరిటీ.. సెక్యూరిటీ.. అంటూ పిలవగానే.. రణవీర్‌ ఏయ్‌ ఎందుకు అరుస్తున్నావు అంటాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డ్స్‌ ఇద్దరు ఐసీయూలోకి వస్తారు. డాక్టర్‌ వాళ్లకు సెక్యూరిటీ వీడెవడో లోపలికి వచ్చి బాబును కిడ్నాప్‌ చేస్తున్నాడు పట్టుకోండి అని చెప్పగానే..

సెక్యూరిటీ ఇద్దరూ రణవీర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. రణవీర్‌ కత్తి తీసుకుని ఎవరైనా ముందుకు వస్తే వీడి గొంతు కోస్తాను.. కోయమంటారా..? చెప్పండి అనగానే.. డాక్టర్‌ బాబును ఏమీ చేయోద్దు.. అనగానే.. అయితే మర్యాదగా అడ్డు తప్పుకోండి అంటూ ఆకాష్‌ను తీసుకుని వెళ్లిపోతాడు. హాస్పిటల్‌ పార్కింగ్‌ దగ్గరకు రణవీర్‌ ఆకాష్‌తో వెళ్లడం చూసిన మనోహరి హమ్మయ్య వచ్చేశాడా..? అనుకుంటూ కారు చాటుకు వెళ్తుంది. రణవీర్‌ వెనకాలే వచ్చిన డాక్టర్స్‌, సెక్యూరిటీ వాళ్లను చూసిన మనోహరి అయ్యో ఏంటి వీడు ఆకాష్‌ ఒక్కడినే తీసుకురమ్మంటే హాస్పిటల్‌ మొత్తాన్ని తీసుకొచ్చాడు అని భయపడుతుంది. రణవీర్‌ మాత్రం అందరినీ బెదరిస్తూ ఆకాష్‌ను కారులో వేసుకుని వెళ్లిపోతాడు. అబ్బా అందరినీ సినిమా చూపించి వెళ్తున్నాడు ఇప్పుడు అమరేంద్ర వస్తే ఏం జరుగుతుందో ఏంటో..? అని భయపడుతుంది. మరోవైపు మెడిసిన్‌ తీసుకుని హాస్పిటల్‌కు వస్తున్న అమర్‌కు డాక్టర్లు ఫోన్‌ చేసి విషయం చెప్పగానే.. అమర్‌ కంగారుగా హాస్పిటల్‌కు వస్తుంటాడు.

Advertisement

హాస్పిటల్‌లో స్పృహ కోల్పోయిన మిస్సమ్మకు ట్రీట్‌మెంట్‌ చేస్తుంటారు డాక్టర్స్‌.. బయట నిలబడిన మనోహరి.. కోపంగా చెత్త వెధవ సైలెంట్‌గా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లరా అంటే అంతా పెంట పెంట చేశాడు.. భాగీ, రణవీర్‌ను చూసిందేమో.. గుర్తు పట్టిందేమో..? ఇప్పుడు అమర్‌ వస్తే  ఏం చేయాలి ఏం చెప్పాలి  అయ్యో అనుకుంటూ భయపడుతుండగానే.. అమర్‌ వస్తాడు. మనోహరి ఏం జరిగింది అని అడగ్గానే.. మనోహరి ఏమీ తెలియనట్టు అమర్‌ త్వరగా రా అమర్‌ నాకు ఫోన్‌ వస్తే మాట్లాడదామని పక్కకు వెళ్లాను. ఈరోజు ఎవరో వచ్చి భాగీని కొట్టి ఆకాష్‌ను ఎత్తుకెళ్లిపోయారు అని చెప్పగానే.. అమర్‌ షాకింగ్‌గా వాట్‌ ఆకాష్‌ను ఎత్తుకెళ్లిపోయారా..? భాగీ ఎక్కడ అని అడగ్గానే.. ఆ రూంలో ఉంది అని మనోహరి చెప్పగానే.. అమర్‌ లోపలికి వెళ్తాడు. మిస్సమ్మకు ట్రీట్‌మెంట్‌ చేస్తుంటారు డాక్టర్‌. అమర్‌ను చూసిన డాక్టర్‌ సారీ సార్‌ బాబును కాపాడలేకపోయాం.. మేడం గారు స్పృహలో లేరు అని చెప్పగానే..

అమర్‌ కంగారు పడుతూ.. భాగీ నన్ను చూడు.. కళ్లు తెరువు.. అంటూ పిలుస్తుంటే.. మిస్సమ్మ ఆకాష్‌ ఆకాష్‌ అంటూ అరుస్తూ లేస్తుంది.. ఏవండి వచ్చారా..? ఎవరో వచ్చి  ఆకాష్‌ను ఎత్తుకెళ్లిపోయారు.. ఆకాష్‌ను కాపాడండి.. అంటూ అరుస్తుంది. దీంతో అమర్‌ భాగీ ఆకాష్‌కు ఏమీ కాదు.. నేను చూసుకుంటాను.. డాక్టర్‌ అసలు ఏం జరిగింది అని అడగ్గానే.. డాక్టర్‌ జరిగిన విషయం చెప్తాడు. పది నిమిషాల క్రితం ఎవరో ఒకతను వచ్చి మేడం స్పృహ తప్పేలా కొట్టి.. మమ్మల్ని అందరినీ కత్తితో బెదరించి వ్యానులో తీసుకెళ్లిపోయాడు సార్‌.. అని చెప్పగానే.. అతను ఎవరో తెలిసిందా..? అని అమర్‌ అడగ్గానే.. లేదు అమర్‌ ఫేస్‌కు ఒక మాస్క్‌ పెట్టుకున్నాడు.. అని చెప్పగానే..

Advertisement

అమర్‌ తన ఫోన్‌ తీసి పోలీసులకు ఫోన్‌ చేస్తాడు. ఆకాష్‌ను కిడ్నాప్‌ చేసిన విషయం చెప్తాడు. వాడు ఎంత స్పీడుగా వెళ్లినా ఐదు కిలోమీటర్ల కన్నా ఎక్కువవెళ్లి ఉండదు.. మీరు వెంటనే ఈ హాస్పిటల్‌కు ఆరు కిలోమీటర్ల రేడియస్‌లో సెక్యూరిటీ పెట్టండి.. ప్రతి వెహికిల్‌ చెక్‌ చేయండి.. బాబు సీరియస్‌ కండీషన్‌ వెంటిలేటర్‌ పైన ఉన్న వాడిని తీసుకెళ్లిపోయాడు.. అంటూ అమర్‌ పోలీసులకు చెప్తుంటే.. పక్కనే ఉండి అంతా వింటున్న మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×