E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బాంబు గురించి తెలుసుకున్న అమర్

Nindu Noorella Saavasam Serial Today December 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బాంబు గురించి తెలుసుకున్న అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:      

కిచెన్‌లో వంట చేస్తున్న మంగళ దగ్గరకు రాథోడ్‌ వెళ్తాడు. నిన్న మీరు కారులో పెట్టిన బాక్స్‌ బయటకు తీశారా..? అని అడుగుతాడు. దీంతో మంగళ తెలియనట్టు ఏ బాక్స్‌ అని అడుగుతుంది. అంటే మీరు ఉదయం ఆ బాక్స్ ను కారులోంచి తీయలేదా..? అని రాథోడ్‌ అడగ్గానే.. నేను ఎందుకు తీస్తాను. మీరు ఇద్దరు కదా రెండు కార్లలో లగేజీ తెచ్చి ఇంట్లో పెట్టారు అని మంగళ చెప్పగానే..  అన్ని బ్యాగులు పెట్టాము కానీ ఆ రెడ్‌ బ్యాగ్‌ ఒక్కటే కనిపించలేదు అని రాథోడ్‌ అనుకుంటాడు. చాటు నుంచి మనోహరి, చంభా వింటుంటారు. చంభా భయంగా ఏంటి మనోహరి అన్ని సార్లు ఆ బాక్స్‌ గురించి అడుగుతున్నాడు. అంటే అమరేంద్రకు మన మీద అనుమానం వచ్చినట్టు ఉంది అని అడుగుతుంది.

దీంతో మనోహరి అనుమానం మన మీద కాదు ఆ మంగళ మీద నువ్వు టెన్షన్‌ పడి నన్ను టెన్షన్‌ పెట్టకు అని చెప్తుంది. ఇంతలో రామ్మూర్తి అక్కడికి రావడంతో మనోహరి, చంభా చాటుకు వెళ్తారు. రామ్మూర్తి కిచెన్‌లోకి వెళ్లి ఏమోయ్‌ టిఫిన్లు రెడీ అయ్యాయా..? భాగీ, పిల్లలకు ఆకలి వేస్తుంటుంది అని చెప్పగానే.. ఇదిగో ఆ పని మీదే ఉన్నాను అని మంగళ చెప్తుంది.  ఏమయ్యా రాథోడ్‌ కాఫీ టీ కానీ ఏమైనా తాగుతావా అని రామ్మూర్తి అడగ్గానే.. రాథోడ్‌ వద్దు సార్‌ మంగళ గారిని ఆ రెడ్‌ బాక్స్‌ గురించి అడగడానికి వచ్చాను అంటాడు. మంగళ చూడండి ఆ బాక్స్‌ కనిపించడం లేదని నన్ను అడుగుతున్నారు అని మంగళ చెప్పగానే.. రాథోడ్ సార్‌ అది సార్‌ అడగమన్నారు అని చెప్పగానే.. దూరం నుంచి గమనిస్తున్న మనోహరి భయపడుతుంది. ఆ బాక్స్‌ గురించి అమర్‌ అడగమన్నాడా..? అంటుంది. చంభ కూడా భయంతో మనోహరి అందులో బాంబు ఉందని అమరేంద్రకు తెలిసిపోయిందేమో అంటుంది.

Advertisement

ఇంతలో రామ్మూర్తి కూడా అవును ఆ బాక్స్‌ ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. దీంతో మంగళ బాగుందండి మీరు కూడా నన్నే అడుగుతున్నారా..? అంటుంది. దీంతో రామ్మూర్తి కోపంగా అడగడం కాదు అనుమానిస్తున్నాను..నీ చేతి వాటం నాకు తెలియదా..? మర్యాదగా అల్లుడు గారి దగ్గరకు వెళ్లి ఆ బాక్స్‌ ఎక్కడుందో చెప్పు అంటాడు రామ్మూర్తి. దీంతో మంగళ అయ్యో నిజంగా దాని గురించి నాకు ఏమీ తెలియదండి అంటుంది. చంభా భయంతో అయిపోయింది మనోహరి ఆ మంగళకు అంతా తెలుసు కదా..? అమరేంద్ర దగ్గర అంతా వాగేస్తుందేమో..? అని భయపడుతుంది. ఇంతలో రామ్మూర్తి కోపంఆ మరి దాన్ని నువ్వు కారులో ఎందుకు పెట్టావు.. అని అడగ్గానే.. అంటే అది మనోహరిది కదా అని కారులో పెట్టాను అంతే.. నాకు అంత వరకే తెలుసు.. అని మంగళ చెప్పగానే.. మనోహరి, చంభా షాక్‌ అవుతారు. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మన మెడకే చుట్టుకునేలా ఉంది. అంటూ చంభా భయపడుతుంది. మనోహరి కోపగా చంభాను నువ్వు నోర్మూయ్‌ అని  తిడుతుంది.

ఇంతలో రామ్మూర్తి మర్యాదగా నిజం చెప్పు మన ఊరిలో అల్లుడి గారి ముందు నా పరువువ తీయకు అని రామ్మూర్తి అడగ్గానే.. మీ మీద ఒట్టు ఆ రెడ్‌ బాక్స్‌ కారులో పెట్టడం వతరకు మాత్రమే నాకు తెలుసు..?        ఆ తర్వాత అది ఏమైపోయిందో కూడా నాకు తెలియదు అని మంగళ చెప్పగానే.. రామ్మూర్తి నేను నిన్ను నమ్మనే.. మర్యాదగా నిజం చెప్పు అని అడుగుతుంటే.. రాథోడ్‌ కల్పించుకుని సార్‌ ఆవిడ తీయలేదని చెప్తుంది కదా..? వదిలేయండి నాకు కొంచెం పని ఉంది వెళ్తాను అంటూ రాథోడ్‌ వెళ్లిపోతాడు. రామ్మూర్తి కూడా కోపంగా త్వరగా టిఫిన్‌ చేసి తగలడు అని చెప్పి వెళ్లిపోతాడు. మంగళ కోసంగా ఇది మరీ బాగుంది. ఆ బాక్స్ కనబడకపోతే దానికి నేనేనా కారణం అని తిట్టుకుంటుంది.

Advertisement

రాథోడ్‌ బయట ఉన్న అమర్‌ దగ్గరకు వెళ్తాడు. వెనకాలే మనోహరి, చంభా వెళ్లి అమర్‌, రాథోడ్‌ను గమనిస్తుంటారు. రాథోడ్‌ దగ్గరకు వెళ్లి సార్‌ మంగళ గారికి ఆ బాక్స్‌ గురించి తెలియదంట సార్‌ తాను తీయలేదని అంటున్నారు  అని చెప్పగానే..  మరి ఎవరు తీశారు రాథోడ్ అందులో బాంబు ఉందని తెలిసి తీశారా..? లేక తెలియక తీశారా..? అని అమర్‌ అడగ్గానే.. చాటు నుంచి వింటున్న మనోహరి, చంభా షాక్‌ అవుతారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×