E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రణవీర్‌ తీసుకొచ్చిన చైన్‌ చూసి షాకైన అమర్‌ – మనోహరి ప్లాన్‌ సక్సెస్‌  

Nindu Noorella Saavasam Serial Today February 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రణవీర్‌ తీసుకొచ్చిన చైన్‌ చూసి షాకైన అమర్‌ – మనోహరి ప్లాన్‌ సక్సెస్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :   మిస్సమ్మ వచ్చి అంజు మెడలో ఉన్న చైన్‌కు ఏదైనా స్పెషాలిటీ ఉందా..? అని అడుగుతుంది. దీంతో అమర్‌ అదేం లేదని చెప్పగానే.. నాకెందుకు ఈ చైన్‌ మామూలు చైన్‌ అనిపించడం లేదు. దానికి ఏదో స్పెషాలిటీ ఉందేమో అనిపిస్తుంది అంటుంది. దీంతో అమర్‌ షాక్‌ అవుతాడు. సోపా పక్కనే దాక్కున్న ఆరు.. మిస్సమ్మ తెలిసి అడుగుతుందా..? తెలుసుకోవడానికి అడుగుతుందా..? అని అనుకుంటుంది. ఇంతలో అమర్‌ దానికి అంత స్పెషాలిటీ ఏమీ లేదని.. ఆరు కొన్నది అని చెప్తాడు. అంజు కూడా మిస్సమ్మ ఇది ది గ్రేట్‌ అంజు మెడలో ఉంది. అందుకే ఈ చైన్‌కు అంత స్పెషాలిటీ ఉంది అని చెప్తుంది. ఇంతలో మనోహరి, రణవీర్‌ వస్తారు. కారు దిగగానే.. రణవీర్‌ ప్లాన్‌ చేంజ్‌ చేస్తున్నాను మనోహరి అని చెప్తాడు. అయితే అడిగి తీసుకెళ్దామనుకుంటున్నావా..? అంటుంది మనోహరి. రణవీర్‌ అవును మనోహరి.. అమర్‌ను నేరుగా ఢీకొట్టలేం.. మంచితనం.. మనుషుల మీద ఉన్న ప్రేమ అనే బలంతో కొట్టగలం ఇప్పుడు నేను అదే అస్త్రా్న్ని వాడబోతున్నాను అనుకుంటూ లోపలికి వెళ్తాడు.

లోపల మిస్సమ్మ అంజు చైన్‌ను చూస్తుంటే.. అంజు ఏంటి నా చైన్‌ను అలా చూస్తున్నావు.. అమ్మో దిష్టి తగులుద్ది నా చైన్‌కు అని లోపలికి వేసుకుంటుంది. రణవీర్‌ రాగానే హాయ్‌ రణవీర్‌ అంకుల్‌.. చేతిలో మళ్లీ కవర్‌.. ఏంటి మళ్లీ షాపింగ్‌కు వెళ్లారా అని అడుగుతుంది. మిస్సమ్మ..రణవీర్‌, మనోహరిలను చూసి కలసి వస్తున్నారు. కలిసి బయటకు వెళ్లారా..? లేదా బయటికి వెళ్లాక కలిశారా అని అడుగుతుంది. దీంతో రణవీర్‌ బయటకు వెళ్లాక కలిశాం.. నాకు హెల్ప్‌ కావాలంటే.. మనోహరి గారిని రమ్మని చెప్పాను.. అంటాడు. దీంతో మిస్సమ్మ ఏం హెల్ప్‌ అని అడుగుతుంది. దీంతో అంజలికి గిఫ్ట్‌ కొన్నాలని అనుకున్నాను అందుకోసం మనోహరిని గారిని రమ్మన్నాను అంటూ చైన్‌ తీసి ఈ గిఫ్ట్‌ అంజలి అని చెప్తాడు రణవీర్‌. చైన్‌ చూసిన అమర్‌ షాక్ అవుతాడు.  ఈ చైన్‌ ఈ చైన్‌ అంటూ అమర్‌ అంటుంటే.. ఈ చైనే ఏంటి అమరేంద్ర గారు మీరు ఎక్కడైనా చూశారా..? అని రణవీర్‌ అడుగుతాడు. చూశానని కాదు.. ఈ చైన్‌, డాలర్‌ ఎందుకు తీసుకొచ్చారు అని అమర్‌ అడుగుతాడు.

Advertisement

దీంతో రణవీర్‌ స్పెషల్‌ రీజన్‌ అంటూ ఏమీ లేదండి.. తీసుకురావాలని తీసుకొచ్చాను అంటాడు. దీంతో అమర్‌ ఇది నార్మల్‌ చైన్‌ కాదు కదా..? ఏదో ఆర్డర్‌ ఇచ్చి చేయించినట్టు ఉంది. ఇదే చైన్‌ ఎందుకు చేయించారు అని అడుగుతాడు. దీంతో రణవీర్‌ కంగారుపడుతూ అంటే మా ఊర్లో దుర్గామాతను ఎక్కువగా కొలుస్తామండి అందుకే అంజు పాప మెడలో దుర్గామాత మెడలో ఈ లాకెట్‌ వేస్తే రక్షగా ఉంటుందని ఈ చైన్‌ తీసుకొచ్చాను అని చెప్తాడు. మిస్సమ్మ గారు పాప మెడలో ఈ చైన్‌ మీరే వేయండి అంటాడు. ఇంతలో మనోహరి.. రణవీర్‌ గారు మీరే తీసుకొచ్చారు కదా.. మీరే అంజు మెడలో వేయండి అని చెప్తుంది. అమర్‌ కూడా అవునని అనడంతో రణవీరే అంజు మెడలో చైన్‌ వేస్తాడు.

చైన్‌ చూసుకున్న అంజు చాలా బాగుంది అంకుల్‌.. నాకు ఎలా ఉంది అంకుల్‌ అని అడుగుతుంది. చాలా బాగుంది అమ్మా అంటాడు రణవీర్‌. ఇంతలో అమర్‌ సేమ్‌ చైన్‌ ఎలా తీసుకొచ్చి ఉంటాడు అని మనసులో అనుమానపడతాడు. ప్రస్తుతానికి నిజం బయటపడలేదు కానీ రణవీర్‌ ఇక్కడే ఉంటే ఆ నిజం బయటపడుతుంది ఏదో ఒకటి చేయాలి అని ఆరు అనుకుంటుంది. వెంటనే చిత్రగుప్తుడి దగ్గరకు వెళ్తుంది ఆరు. చిత్రగుప్తుడు నాగమణి ఎక్కడ అని అడుగుతాడు. వెంటనే ఆరు మీకు నాగమణి కావాలంటే నా ఈ సమస్యను మీరు పరిష్కరిస్తే.. ఆ నాగమణి ఎక్కడుందో గుర్తుకు వస్తుంది అని చెప్తుంది. సరే అయితే నేను ఆలోచిస్తాను అంటాడు చిత్రగుప్తుడు.

Advertisement

 

మనోహరి, రణవీర్‌కు ఫోన్‌ చేసి అమర్‌ను అడుగుతాను.. నా దగ్గర ప్లాన్‌ ఉంది అన్నావు.. అస్త్రా్న్ని వాడబోతున్నాను అన్నావు ఏమైంది అని అడుగుతుంది. ఏమవడం ఏంటి.. ? మైండ్‌ అసలు పనిచేయడం లేదు. మనం తీసుకొచ్చిన చైన్‌ గురించి అమర్‌ అంత గుచ్చి గుచ్చి అడుగుతుంటే.. నేను ఎంత టెన్షన్‌ పడ్డానో తెలుసా..? ఆ చైన్‌ చూడ్డానికి డిఫరెంట్‌గా ఉంది కదా.. అందుకే అమర్‌ అలా అడిగి ఉంటాడు అని చెప్తుంది మనోహరి. లేదు మనోహరి అమర్‌ అడిగిన విధానం. ఆ చైన్‌ను చూసిన విధానం మామూలుగా లేదు అని చెప్తాడు. దీంతో మనోహరి.. నువ్వు ఎక్కువవగా ఆలోచిస్తున్నావు నీ ఫ్యామిలీ చైన్‌ గురించి అమర్‌కు ఎలా తెలుస్తుంది అంటుంది. అదే కనుక్కోవాలి అంటూ రణవీర్‌ అంజు మెడలో ముందురోజు అమర్‌ వేసిన చైన్‌ గుర్తుకు వస్తుంది.

అదే విషయం మనోహరిని అడిగితే నీకేమైనా పిచ్చి పట్టిందా..? అనవసరమైన అనుమానాలతో నీ డౌట్లు పక్కన పెట్టు అంటుంది. ఇంతలో అంజు పరుగెత్తుకుంటూ బయటకు రణవీర్‌ దగ్గరకు వస్తుంది. అంజు మెడలో చైన్‌ చూసి షాక్ అవుతాడు రణవీర్‌. వెంటనే అంజును నేను కోల్‌కతా వెళ్తున్నాను నాతో పాటు వస్తావా..? అని అడుగుతాడు. డాడీ ఒప్పుకోరు అంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను కానీ మీ డాడీ నిన్ను పిలిచి అడిగితే ఓకే అంటుంది.  ఇంతలో లోపలికి వెళ్లిన రణవీర్‌ అమర్‌ దగ్గరకు వెళ్లి నేను ఇవాళ కోల్‌కతా వెళ్తున్నాను అని చెప్తుండగానే.. మనోహరి వచ్చి నేను కూడా కోల్‌కతా వెళ్తున్నాను అని చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×