E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్ ఇచ్చిన బుజ్జమ్మ

Nindu Noorella Saavasam Serial Today January 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్ ఇచ్చిన బుజ్జమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

తన చేతి వంట పిల్లలు ఇష్టంగా తిన్నారని తెలుసుకున్న మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. ఇన్ని రోజులకు పిల్లలకు నా చేతితో వండే అదృష్టం కలిగింది అని ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో బుజ్జమ్మ వెంటనే అమ్మా అని పిలుస్తుంది. ఏంటి బుజ్జమ్మ అని మిస్సమ్మ అడగ్గానే.. అమ్మా నువ్వు వాళ్ల కోసం వంట చేసి నా గురించే మర్చిపోయావు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ నీకేం కావాలి బుజ్జమ్మ చెప్పు అని అడుగుతుంది. దీంతో బుజ్జమ్మ ఇందాక నువ్వు చేసిన వంటలే కావాలి.. ఆ స్మెల్‌ చూస్తుంటే.. నాకు కూడా నోరు ఊరిపోతుంది. నాకు మళ్లీ అన్నం పెట్టవా..?  అని అడుగుతుంది.

దీంతో మిస్సమ్మ దానికేం ఉంది. అంటూ వెళ్లి భోజనం తీసుకుని వస్తుంది. బుజ్జమ్మకు అన్నం తన చేతులతో తినిపిస్తుంది. ఇంతలో బుజ్జమ్మ అమ్మ నీ చేతి వంట ఎప్పుడూ సూపర్‌.. చాలా టేస్టీగా ఉంటాయి. నీలాగా ఎవ్వరూ చేయరు..? అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ అవును ఆ రోజు స్కూల్‌లో నీ ఫ్రెండ్‌ నా వంట తిన్నది అని చెప్పావు కదా..? అప్పుడు ఏమన్నది నీ ఫ్రెండ్‌ అని అడగ్గానే.. బుజ్జమ్మ ఎగ్జైట్‌మెంట్‌ గా నిన్ను చాలా అంటే చాలా మెచ్చుకుంది. వాళ్లింట్లో వంటావిడ సరిగ్గా వంట చేయదట. ఐదు సంవత్సరాలు అయిందట అంత టేస్టీ ఫుడ్‌ తిని అని బుజ్జమ్మ చెప్తుంటే.. ఇంకా ఏం చెప్పింది అని మిస్సమ్మ అడగ్గానే.. ఇంకా అంటే వాళ్ల మిస్సమ్మ గురించి చెప్పింది తను కూడా నీలాగే వంట బాగా చేస్తుందట.. అంజు అక్క నాతో ఎప్పుడు పది నిమిషాలు మాట్లాడినా.. దానిలో తొమ్మిది నిమిషాలు వాళ్ల మిస్సమ్మ గురించే చెప్తుంది. అంజు అక్క మాత్రమే కాదు నేను వాళ్ల ఇంటికి వెళ్లానా..? అమ్ము అక్కా.. ఆనంద్‌ అన్నయ్య, ఆకాష్‌ అన్నయ్య.. అందరూ వాళ్ల మిస్సమ్మ గురించే చెప్పారు. ఆ మిస్సమ్మ అంటే వాళ్లకు ఇష్టం ఉన్నట్టు ఉంది. అని బుజ్జమ్మ చెప్తుంటే..

Advertisement

మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతుంది. ఆ మిస్సమ్మను నువ్వు చూశావా బుజ్జమ్మ అని అడగ్గానే.. లేదమ్మా ఆవిడ ఇంట్లోంచి వెళ్లిపోయిందట.. ఎక్కడుందో తెలియదట.. ఆవిడకు కూడా నాలాగే చిన్న పాప ఉందట.. ఆ పాపను నువ్వు నన్ను పిలిచినట్టే వాళ్లు కూడా బుజ్జమ్మ అని పిలిచేవారట. ఆ మిస్సమ్మ ఫోటో వాళ్ల నాన్న బీరువాలో ఉందని అంజు అక్క చెప్పింది. ఈ సారి నేను వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఆ మిస్సమ్మ ఫోటో చూస్తాను  అని బుజ్జమ్మ చెప్పగానే.. మిస్సమ్మ వద్దు బుజ్జమ్మ వద్దు వేరే వాళ్ల ఫోటోలు అలా చూడకూడదు అని చెప్పగానే.. ఆవిడ ఎలా ఉంటుందో నేను చూడాలి కదా..? అంటుంది బుజ్జమ్మ. దీంతో మిస్సమ్మ ఏదో ఫ్లోలో ఆవిడ నాలాగే ఉంటుంది అనుకో అని చెప్తుంది. బుజ్జమ్మ నీలా ఉంటుందా..? అని ప్రశ్నించగానే.. నాలా ఉంటుందని అనుకుని ఆవిడ ఫోటో చూడొద్దు అని చెప్తున్నాను అనగానే.. బుజ్జమ్మ సరేనమ్మా కానీ నేను ఆ ఇంట్లో ఇంకో ఫోటో చూశాను అని చెప్తుంది. ఎవరి ఫోటో అని మిస్సమ్మ అడగ్గానే.. నా ఫోటో అని బుజ్జమ్మ చెప్తుంది. బుజ్జమ్మ మాటలకు మిస్సమ్మ షాక్‌ అవుతుంది. నీ ఫోటోనా..? అని అడుగుతుంది. అవును నా ఫోటో అరుంధతి ఫోటో.. ఆవిడ అంజు అక్క వాళ్ల అమ్మట.. నా పేరే ఆవిడ పేరు అరుంధతి అని చెప్పగానే.. మిస్సమ్మ ఏడుస్తూ.. ఆ అరుందతి అక్కవి నువ్వే బుజ్జమ్మ నీ పేరే మళ్లీ నీకు పెట్టాము అని మనసులో అనుకుంటుంది.

ఆ ఫోటోను నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించంది అమ్మ.. ఎక్కడ చూసి ఉంటాను అని అడగ్గానే.. ఎక్కడో చూసి ఉంటావు.. తర్వాత నీకే గుర్తుకు వస్తుందిలే ఇదిగో అన్నం తిను అనగానే.. ఇంక చాలు అమ్మ కడుపు నిండిపోయింది అంటుంది బుజ్జమ్మ.. ఈ ఒక్క ముద్ద తిను అంటూ తినిపిస్తూ.. ఆలోచిస్తుంది మిస్సమ్మ ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×