E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 28th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కిడ్నాప్‌ కు మనోహరి ప్లాన్‌ – ఇంట్లోంచి వెళ్లిపోతున్న అమర్‌

Nindu Noorella Saavasam Serial Today January 28th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కిడ్నాప్‌ కు మనోహరి ప్లాన్‌ – ఇంట్లోంచి వెళ్లిపోతున్న అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : యమలోకంలో మాయపేటికలో జరుగబోయే విషయాలు చూస్తుంది ఆరు. గుప్త వెతుకుతూ వెళ్తాడు. మాయపేటిక చూస్తున్న ఆరును చూసి షాక్‌ అవుతాడు. మా లోకంలో కూడా నువ్వు నీ తింగరి వేషాలు వేస్తున్నావా..? అంటూ దగ్గరకు వెళ్లగానే మాయపేటికలో మనోహరికి రణవీర్‌ వార్నింగ్‌ ఇవ్వడం, మనోహరి, అంజు దగ్గరకు వెళ్లడం చూస్తుంది ఆరు. గుప్త కోపంగా బాలిక నువ్వు మాయాపేటిక చూడటం ఇక్కడ ఎవరైనా చూస్తే మాకు నరకంలో విధించే శిక్షలు విధిస్తారు అని భయపడుతుంటే.. మనో మళ్లీ ఏదో ప్లాన్‌ చేస్తుంది గుప్త గారు అంటుంది ఆరు. నేను ఏమీ మాట్లాడుతుంటిని.. నువ్వు ఏమీ సమాధానం ఇస్తుంటువి అంటాడు గుప్త.

మను ఎక్కడి నుంచో ఇంటికి రణవీర్‌తో ఏదేదో మాట్లాడుతుంది అని అరు చెప్పగానే.. ముందు నువ్వు ఆ మాయాపేటిక మూయుము అంటూ కోపంగా చెప్తూ.. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతున్నాయి బాలిక అంటాడు. ఆరు అర్థం కాలేదని చెప్పగానే.. ఆనాడు వద్దన్ని వదిలించుకున్నవాళ్లే ఈనాడు కావాలని దగ్గరకు చేర్చుకుంటున్నారు అని గుప్త చెప్పగానే.. అంజును తీసుకెళ్తున్నారా..? అయితే వెంటనే ఈ విషయాన్ని మా ఆయనకు చెప్పండి ఫ్లీజ్‌ గుప్త గారు. నేను ఇక ఎక్కడికి వెళ్లను.. ఫ్లీజ్‌  ఈ ఒక్క సాయం చేయండి అని రిక్వెస్ట్‌ చేయగానే.. నేను కూడా నీ లాగే చూడటం తప్ప ఏమీ చేయలేనని చెప్తుండగానే చిత్రగుప్తుడు పిలవగానే.. కంగారుగా వెళ్లిపోతాడు గుప్త.

Advertisement

మిస్సమ్మను తీసుకుని ఇంటికి వచ్చిన అమర్‌.. హ్యాపీయా అని అడుగుతాడు. మిస్సమ్మ సంతోషంగా చాలా చాలా అంటే చాలా మీకు ఎన్నిసార్లు థాంక్స్‌ చెప్పినా సరిపోదు అంటుంది. థాంక్స్‌ చెప్పొద్దు నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు ఈ ఇల్లు పిల్లలు  అడ్డు రాకూడదు.. ముందు ఎలా ఉండేదానివే అలాగే ఉండు. అని అమర్‌ చెప్పగానే.. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీకు కనిపించడం లేదా..? మీకు తెలియడం లేదా..? నేను హ్యాపీగా ఉండాలంటే నేను ఎక్కడికో వెళ్లి ఏదో చేస్తేనే రాదు.. ఈ ఇంట్లో మీ పక్కనే ఉంటే నాకు హ్యాపీ వస్తుంది అని చెప్తూ అమర్‌ కళ్లల్లోకి చూస్తుంది. అమర్‌ కూడా మిస్సమ్మ కళ్లల్లోకి చూస్తుంది. ఇంతలో మనోహరి వచ్చి వాళ్లిద్దరి ఆ పొజిషన్‌ లో చూసి బాధపడుతుంది. వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా..? అసలు తన జడలో మల్లెపూలు ఏంటి అని మనసులో అనుకుంటుంది.

ఇంతలో నిర్మల, శివరాం వచ్చి అమర్‌, మిస్సమ్మలను చూసి హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి ఏదో చేసేలా ఉందని దగ్గరకు వెళ్లి అమర్‌ను పలకరిస్తారు నిర్మల, శివరాం. మనోహరి దగ్గరకు వెళ్లి అమర్‌ పెద్దున్నే అనగా వెళ్లారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. అయనకు తెలిసిన వాళ్లను కలవడానికి తీసుకెళ్లారు అంటుంది మిస్సమ్మ. దీంతో మనోహరి ఓహో నువ్వేదో మిస్సమ్మకు బుల్లెట్‌ నేర్పిస్తున్నావేమో అనిపిస్తుంది అంటుంది మనోహరి. దీంతో అమర్‌, మిస్సమ్మ షాక్‌ అవుతారు. ఇంతలో పిల్లలు రాగానే.. డిన్నర్‌ చేశారా..? అని అమర్‌ అడుగుతాడు. చేశామని అంజు చెప్తుంది. డాడ్‌ మీరు బయటకు వెళ్లారని తెలిసి వీళ్లకు టైం టేబుల్ ఫాలో అవ్వాలని చెప్పాను.. అంటూ డాడ్‌ చెప్పడం మర్చిపోయా రణవీర్‌ అంకుల్‌ సిటీకి వచ్చారంట అంటుంది.

Advertisement

నీకెవరు చెప్పారు అని అమర్‌ అడగ్గానే.. మనోహరి ఆంటీ చెప్పింది అని అంజు చెప్పగానే.. రణవీర్‌ అంకుల్‌ వచ్చాడని నీకెందుకు చెప్పారు అని మిస్సమ్మ అడగ్గానే.. ఊరికే చెప్పారు అంటుంది. దీంతో మనోహరి భయంతో ఎలాగైనా తప్పించుకోవాలని ఏదేదో మాటలు చెప్పి తప్పించుకుంటుంది. ఇంతలో రాథోడ్‌ పేపర్‌ తీసుకుని వచ్చి సార్‌ మెసేజ్‌ అంటూ ఇస్తాడు. మిస్సమ్మ కంగారుగా ఏమైందండి అని అడుగుతుంది. మేజర్‌ గారు మెసేజ్‌ చేశారు. నెక్ట్‌ వీక్‌ జరగాల్సిన మీటింగ్‌ రేపటికి అరేంజ్‌ చేశారట.. నాకు రాథోడ్‌కు ఇంకో గంటలో ఫ్లైట్‌ ఉంది మేము వెళ్లాలి అని అమర్‌ చెప్పగానే.. మనోహరి హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటుంది. అమర్‌ ఊర్లో ఉండడు.. అంజును తీసుకెళ్లొచ్చు అనుకుంటుంది. వెంటనే తన రూంలోకి వెళ్లి రణవీర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్తుంది. రేపు పొద్దున్నే వచ్చి అంజలిని తీసుకెళ్లు అని చెప్తుంది. సరే అంటాడు రణవీర్‌.

యమలోకంలో ఉన్న ఆరు కోపంగా అరుస్తుంటే.. చిత్రగుప్తుడు వచ్చి బాలిక ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు. ఆరు కోపంగా మీరు నా అనుమతి లేకుండా ఇక్కడికి తీసుకొచ్చావు కాబట్టి నేను నీతో మాట్లాడను అంటుంది. ఇంతలో గుప్త వస్తాడు. మాయా పేటిక గురించి చెబితే నేను ప్రమాదంలో పడతాను అనుకుంటాడు. అప్పుడే మాయా పేటిక గురించి చెప్తుంది ఆరు. వెంటనే వెళ్లి యముడిని కలవడానికి గంట మోగిస్తుంది. యముడు కోపంగా రావడంతో ఆరు భయపడుతుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×