E-Paper
Advertisement

Horoscope  Today January 28th: ఆ రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు – ఆకస్మిక ప్రయాణాలు   

Horoscope  Today January 28th: ఆ రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు – ఆకస్మిక ప్రయాణాలు   
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 28న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు దూరప్రయాణాల వలన శ్రమ అధికమవుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగంలో మీ కష్టం ఫలించదు.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభాకార్య విషయాలపై చర్చలు చేస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో  సమస్యలు అధికమవుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు చిన్న పాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. రెండు రకములైన ఆలోచనల వలన ధన నష్టాలు తప్పవు.

వృశ్చిక రాశి: ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు  వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగస్థులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు  అందుతాయి.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు  దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. సన్నిహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఇంట్లో  ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు ఆశాజకనంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

 

ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×