E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బుజ్జమ్మతో ఫోన్ మాట్లాడిన అమర్

Nindu Noorella Saavasam Serial Today January 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బుజ్జమ్మతో ఫోన్ మాట్లాడిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

ఆరకు ఆశ్రమంలో ఉన్న మిస్సమ్మకు సరస్వతి పేరుతో ఒక లెటర్‌ వస్తుంది. అది తీసుకెళ్లి మిస్సమ్మకు ఇస్తుంది సరస్వతి. ఆ లెటర్‌ ఓపెన్‌ చేసి చదివి షాక్‌ అవుతుంది మిస్సమ్మ. దీంతో సరస్వతి ఆశ్చర్యంగా చూస్తూ.. ఏంటమ్మా ఏంటి..? లెటర్‌ చదివి సంతోషపడతావు అనుకుంటే షాక్ అయ్యావేంటి..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఇది ఎలా సాధ్యం మేడం న బుజ్జమ్మకు మిలటరీ స్కూల్‌ లో సీటు వచ్చిందా..? అని అడగ్గానే.. ఎందుకు సాధ్యం కాదు. ఆరుకు ఏం తక్కువ అని చాలా తెలివైన చురుకైన పిల్ల చక్కగా చదువుతుంది. ఏకసంతాగ్రాహి. ఇన్ని క్లాలిటీస్‌ ఉన్న పిల్లకు సీటు ఇవ్వడం ఆ స్కూల్‌ కే గర్వకారణం.. అని సరస్వతి చెప్పగానే.. ఆశ్చర్యంగా మిస్సమ్మ కానీ నేను ఆ స్కూల్‌కు అప్లయ్‌ చేయలేదు.. బుజ్జమ్మ ఎంట్రన్స్‌ రాయలేదు అలా ఎలా సాధ్యం అవుతుంది మేడం అని మిస్సమ్మ అడగ్గానే..

మన ఆశ్రమం తరపున నేనే అప్లయ్‌ చేశానమ్మ మిగతా పిల్లలతో పాటు ఆరు కూడా ఎంట్రన్స్‌ రాసింది అని సరస్వతి చెప్పగానే.. ఇదంతా ఎప్పుడు జరిగింది మేడం నాతో ఎందుకు చెప్పలేదు మీరు అని మిస్సమ్మ అడగ్గానే.. నిన్ను సర్‌ఫ్రైజ్‌ చేద్దామని చెప్పలేదు అమ్మ.. ఆరు రెండు తెలుసు రాష్ట్రాల్లో మెరిట్‌ స్టూడెంట్‌ గా ఫస్ట్‌ ర్యాంకులో పాస్‌ అయింది. ఆ స్కూల్‌ వాళ్లు స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తామంటున్నారు.. ఆరు ప్రతిభకు తగ్గ స్కూల్లో తనకు స్థానం దొరికింది. నాకు చాలా సంతోషంగా ఉంది అని సరస్వతి చెప్పగానే.. కానీ నాకు చాలా భయంగా ఉంది మేడం అంటూ మిస్సమ్మ భయపడుతుంటే.. ఎందుకు భయం అమ్మ  అంటూ సరస్వతి అడుగుతుంది. దీంతో మిస్సమ్మ అది మిలటరీ స్కూల్‌.. పైగా అది ఉండేది హైదరాబాద్‌లో అని చెప్పగానే.. అయితే ఏంటమ్మా..? హైదరాబాద్‌ నీకు తెలియని ఊరా..? అక్కడ నీకేంటి భయం అని అడగ్గానే..

Advertisement

మిస్సమ్మ బాధగా ఏంటి మేడం అన్ని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు.. ఏ కారణం చేత అయితే నేను ఆ ఇంటిని హైదరాబాద్‌ వదిలేసి వచ్చానో మీకు తెలుసు కదా..? మళ్లీ బుజ్జమ్మను తీసుకుని నేను ఎలా వెళ్లగలను.. నేను ఆయన కంట కానీ పిల్లల కంట కానీ పడితే ఇంకేమైనా ఉందా మేడం.. అని అడగ్గానే.. నీ భయం నాకు అర్థం అయింది భాగీ కానీ ఇది అరుంధతి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఆలాంటి పెద్ద స్కూల్‌ లో చదివితే ఆరు ఫీచర్‌ చాలా బాగుంటుంది అని చెప్పగానే.. కానీ అమ్ము భవిష్యత్తు ఏం కావాలి మేడం.. మేము అక్కడకు వెళ్లాక అమ్ముకు ఏమైనా అయితే..?  అని అడగ్గానే.. మీరు ఆ ఇంటికి వెళ్లోద్దు.. అక్కడ మన ఆశ్రమంలోనే ఉండండి.. అప్పుడు ఏ సమస్య ఉండదు.. అక్కడ రాజు గారు ఉంటారు. మీకు కావాల్సిన వన్నీ చూసుకుంటారు.. అని చెప్పగానే..

ఒకే ఊర్లో రెండేళ్ల పాటు ఒకరికొకరు ఎదురుపడకుండా..? ఎలా ఉంటాము మేడం.. నేను కనిపించిన మరుక్షణం ఆయన ఇంటికి తీసుకెళ్తారు.. అప్పుడు అమ్ము పరిస్థితి ఏంటి మేడం.. అంటుంది మిస్సమ్మ.. దీంతో సరస్వతి ఆ దేవుడి మీద భారం వేయ్‌ భాగీ అంతా ఆయనే చూసుకుంటారు అని చెప్పగానే.. ఆ దేవుడే కదా మేడం మాఉక ఇలాంటి శాపం ఇచ్చింది. మళ్లీ ఆయన్నే నమ్ముకుని ఎలా వెల్లమంటారు… అని మిస్సమ్మ బాధపడుతుంటే.. అలా అని ఎంతో భవిష్యత్తు ఉన్న అరుంధతిని నువ్వు ఇక్కడే ఉంచుతానంటే నేను ఒప్పుకోనమ్మా..? మన నమ్మకాల కోసం పిల్లల ఫీచర్‌ పాడు చేయకూడదు ఇంకేం మాట్లాడకు భాగీ.. తనని వెంటనే స్కూల్‌ లో అడ్మిట్‌ చేయమని ఆ స్కూల్‌ వాళ్లు లెటర్‌ పంపించారు.. మీ ఇద్దరికి బస్‌ టికెట్‌ బుక్‌ చేశాను. వెంటనే బయలుదేరండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది సరస్వతి.

Advertisement

తర్వాత మిస్సమ్మ, బుజ్జమ్మలను సరస్వతి హైదరాబాద్‌ బస్సు ఎక్కిస్తుంది. హైదరాబాద్‌ వెళ్తుంటారు. మధ్యలో మిలటరీ వాళ్లు అదే బస్‌ ఎక్కుతారు. ఒక మిటలరీ అతను అమర్‌తో ఫోన్‌ మాట్లాడుతూ బ్యాగ్‌ పైన పెట్టబోతుంటే ఫోన్‌ కింద పడబోతుంది. వెంటనే బుజ్జమ్మ పట్టుకుని మీరు బ్యాగ్‌ పైన పెట్టండి నేను ఫోన్‌ పట్టుకుంటాను అని చెప్తుంది. ఫోన్‌ లో అమర్‌ హలో విక్రమ్‌ అనగానే బుజ్జమ్మ హలో అంటుంది. దీంతో అమర్‌ కు వెంటనే మిస్సమ్మ కడుపులో నాన్న అంటూ పలిచిన మాట గుర్తుకు వచ్చి ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×