BigTV English

Nindu Noorella Saavasam Serial Today June 27th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ   

Nindu Noorella Saavasam Serial Today June 27th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ   

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోమరి అమర్ రూంలోకి వెళ్లి కీస్‌ వెతికి తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడే అమర్‌, మిస్సమ్మ వస్తారు. మనోహరి షాక్‌ అవుతుంది. దీంతో మిస్సమ్మ, అమర్‌ కోపంగా చూస్తుంటారు. ఇంతలో మిస్సమ్మ.. మనోహరి గారు మీరు మా రూంలోంచి ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది. అమర్‌ కూడా మనోహరి మా రూంలో నేను కానీ భాగీ కానీ లేనప్పుడు నువ్వెందుకు వచ్చావు అంటూ కొంచెం కోపంగా అడిగితే మనోహరి పలకదు. అమర్‌ మరింత కోపంగా అడుగుతుంది నిన్నే మనోమరి మా రూంలోకి ఎందుకు వెళ్లావు అని అడుగుతాడు. మనోహరి మౌనంగా చూస్తూనే ఉంటుంది. దీంతో మిస్సమ్మ కోపంగా మనోహరి గారు అడుగుతుంటే చెప్పరేంటి అసలు మీరు రూంలో ఏం చేస్తున్నారు కీస్ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.


ఇంతలో చిత్ర వచ్చి బావగారు నేను చెప్తేనే తను మీ రూంలోకి వెళ్లింది. నేను అడిగితేనే తను కీస్ తీసుకొచ్చింది అని చెప్తుంది. దీంతో అమర్‌ నువ్వా..? ఎందుకు అని అడుగుతాడు. దీంతో చిత్ర ఆరు ఫోటో చూడాలనిపించింది. ఎక్కడ ఉందని మనును అడిగితే గదిలో ఉందని చెప్పింది. అందుకే ఫోటో చూడాలని కీస్‌ తీసుకురమ్మని చెప్పాను అంటుంది. దీంతో మిస్సమ్మ అందుకు నేను ఆయన లేనప్పుడు మీరు మా రూంకు వెళ్తున్నారా..? అని అడుగుతుది. అమర్‌ కూడా కోపంగా మనోహరి ఆ రూంకి సంబంధించిన ప్రతిదీ ఎంత పర్సనల్లో తనకు తెలియకపోవచ్చు కానీ నీకు తెలుసు కదా.. అంటాడు. మనోహరి తెలుసు అమర్‌ అంటుంది. దీంతో మరి తను అడగ్గానే మా రూంలోకి వెళ్లి పీక్స్‌ అన్ని వెతికి కీస్‌ తీసుకున్నావంటే నేను ఏమనుకోవాలి అంటాడు. దీంతో మనోహరి సారీ అమర్‌ అని చెప్తుది.

ఇంతలో చిత్ర కలగజేసుకుని బావగారు ఆరుంధతి ఫోటో ఉన్న గది కూడా ఈ ఇంట్లో భాగమే కదా మరి ఆ రూంలోకి వెళ్లే రైట్‌ అందరికీ ఉంది కదా…? అయినా నా ఫ్రెండ్‌ ఫోటో నేను ఒకసారి చూడాలనుకోవడం తప్పా..? నేను తనతో ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నాను అది తప్పా అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ మరింత కోపంగా చిత్ర అది తప్పేం కాదు కానీ ఇలా మేము గదిలో లేనప్పుడు అడక్కుండా ఆ గదిలోకి వెళ్లి కీస్‌ తీసుకోవడం తప్పు అంటుంది. దీంతో చిత్ర కోపంగా అరే ఏంటి భాగీ నువ్వు.. బావగారు ఏంటిది నేను మను ఏదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. అయినా ఇది మీది ఇది మాది అనుకోవడానికి ఆస్థి ఇంకా భాగాలు ఏమీ పెట్టలేదు కదా..? భాగాలు పెట్టనప్పుడు అన్ని అందరివి అవుతాయి కదా బావగారు అంటుంది.


దీంతో మిస్సమ్మ కోపంగా చిత్ర ఎవ్వరితో ఏం మాట్లాడుతున్నావో గుర్తు చేసుకుని మాట్లాడు. ఆయన సహనాన్ని పరీక్షించడం నీకంత మంచిది కాదు చెప్తున్నాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. అమర్‌ కోపంగా మనోహరి కీస్‌ ఇవ్వు అందరికీ లాస్ట్‌ టైం చెప్తున్నాను మనోహరి రూం ఓపెన్ చేయాలంటే నాకు చెప్పండి. ఇలాంటి పని ఇంకోసారి చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు అమర్‌. మనోహరి, చిత్ర వెళ్లిపోతారు. రణవీర్‌ కోపంగా బయటకు వెళ్లబోతుంటే లాయర్‌ వచ్చి ఆపేస్తాడు. నువ్వు అమర్‌ మీద అటాక్‌ చేసిన విషయం అమర్‌కు తెలిసినట్టు ఉంది. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్లడం సేఫ్‌ కాదు అని చెప్తాడు.

దీంతో రణవీర్‌ లాయరు అమర్ కు నిజం తెలిసి ఉంటే ఈపాటికి ఆయన గన్‌ నా తల మీద ఉండేది. లేదు అంటే అమర్‌కు నిజం తెలియకకుండా ఉండాలి. లేదా తెలిసినా ఊరుకుని ఉండాలి. అంజలిని కిడాన్నప్‌ చేసింది నేనే ఇవాళ పిల్లలను చంపాలని చూసింది నేనే అని తెలిసినా కూడా  అమర్‌ ఏమీ చేయలేదంటే దాని వెనక  కచ్చితంగా బలమైన కారణం ఉండాలి అదేంటే నేను తెలిసుకుని తీరాలి అని చెప్తాడు.  ఎందుకు రణవీర్‌ అమర్‌ విషయంలో ఇంత మొండిగా ఆలోచిస్తున్నావు.. నీకు కు ప్రాణ కన్నా ఆస్థి ముఖ్యమా అంటే అవును లాయరు నాకు నా ప్రాణం కన్నా ఆస్థే ముఖ్యం అంటూ వెల్లిపోతాడు రణవీర్‌.

తర్వాత మిస్సమ్మ రూంలో అంతా క్లీన్‌ చేస్తుంటే.. ఒక పాస్‌ఫోర్ట్‌ సైజు ఫోటో కింద పడుతుంది. ఎవ్వరిదా అని చూస్తూ అది ఆరుదై ఉంటుంది. ఆ ఫోటో చూడగానే ఆరు షాక్‌ అవుతుంది. వెంటనే గార్డెన్‌లో ఉన్న ఆరు దగ్గరకు వెళ్లి అక్కా ఈ ఫోటో నీదే కదా..? అంటూ ఫోటో చూపిస్తుంది. ఆరు షాక్‌ అవుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్‌ పడుతూ గుప్త వైపు చూస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి బండారం బయటపెట్టబోతున్న నర్మద.. ధీరజ్ కు షాక్.. నగల గుట్టు బయట పడుతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి వార్నింగ్ ఇచ్చిన భానుమతి.. ప్రణతికి తెలిసిన నిజం.. పెళ్లి ఆగిపోతుందా..?

Nindu Noorella Saavasam Serial Today August 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రావును వెళ్లిపోమ్మన్న అమర్‌

Gundeninda GudiGantalu Today episode: మౌనికకు మాటిచ్చిన మీనా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..ప్రభావతికి షాక్..

Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు కాల్‌ చేసిన ఇంద్రాదేవి – స్వరాజ్‌ను తీసుకొచ్చిన రాజ్‌

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒకటి వేరీ స్పెషల్..

Big Stories

×