Vadde Naveen: సినీ హీరో వడ్డే నవీన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈయన పేరు వినగానే పెళ్లి సినిమా గుర్తొస్తుంది.. ఆ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. కుటుంబ కళా చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయని అందరికీ తెలిసిందే.. అలాగే వడ్డే నవీన్ పరిస్థితి కూడా మారిందనే చెప్పాలి.. అప్పట్లో వరుస సినిమాల్లో నటించిన ఈ హీరో ఆ తర్వాత మెల్లగా సినిమాలకు దూరమయ్యాడు.. అయితే ఈ హీరో సినిమాలుకు దూరమైన కూడా పెళ్లి చేసుకొని తన ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి బాగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. మరి ఆయన పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో? ఆస్తుల వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
వడ్డే నవీన్ భార్య బ్యాగ్రౌండ్..?
తెలుగు సినిమా హీరో వడ్డే నవీన్ భార్య పేరు చాముండేశ్వరి.. ఈమె నందమూరి ఫ్యామిలీ అమ్మాయి. నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురు అయిన చాముండేశ్వరుని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లిళ్లు స్వర్గలో నిర్ణయించబడి ఉండవు అని చెప్పినట్లు వీళ్ళ పెళ్లి కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే మారింది. కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడిపోయారు. చాలాకాలం తర్వాత ఈయన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది. ఆమె ఎవరన్నది తెలియలేదు కానీ రెండో పెళ్లి తర్వాత నవీన్ పెద్దగా బయట కూడా కనిపించలేదని సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ సంతోషంగా జీవిస్తున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాల్లో టాక్.. అంటే నవీన్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారన్నమాట..
Also Read: వామ్మో.. పొట్టిదే కానీ గట్టిగానే లాగుంతుంది.. ఒక్కరోజుకు అంతనా..?
ఈయన సినిమాల విషయానికొస్తే..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు వడ్డే నవీన్.. ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ పర్వాలేదనే టాక్ ని సొంతం చేస్తుంది.. అప్పట్లో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా, మహేశ్వరి హీరోయిన్ గా తిరకెక్కించిన పెళ్లి చిత్రం ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీ తర్వాత నవీన్ ప్రేమించే మనస్సు, మనసిచ్చి చూడు, మా బాలాజీ, చక్రి వంటి సినిమాలు నవీన్ కి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇతను ఎంత వేగంగా తన కెరీర్ లో ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడని చెప్పవచ్చు..గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చివరగా మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాల్లో కనిపించారు. ఈమధ్య ఈయన సినిమాల్లో కనిపించలేదు. సడెన్ఎందుకు సినిమాలకు దూరమయ్యాడు అని ఇండస్ట్రీలో చర్చినీయాంశంగా మారింది.. ఇకముందు మంచి ఆఫర్స్ వస్తే నటిస్తాడేమో చూడాలి..