BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమ్మును భయపెట్టిన మను – ఘోరాను పసిగట్టిన అమ్ము

Nindu Noorella Saavasam Serial Today October 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమ్మును భయపెట్టిన మను – ఘోరాను పసిగట్టిన అమ్ము

Nindu Noorella Saavasam Serial Today Episode:  తన రూంలోకి పిన్ను కోసం వచ్చిన అమ్ముకు మనోహరి వార్నింగ్‌ ఇస్తుంది. మరోసారి రూంలోకి  వచ్చిన్నప్పుడు డోర్‌ కొట్టి రమ్మని చెప్తుంది. అలాగేనని అమ్ము భయంగా అ రూంలోకి బయటకు వస్తుంది. పిన్ను తీసుకని పైకి వెళ్లకుండా హాల్లో నే కూర్చుని భయంగా ఏదో ఆలోచిస్తుంది.


అమ్ము వెళ్లిపోయాక మనోహరి కూల్‌ అవుతుంది. ఏంటి ఘోర ఇది అమ్ము ఏంటి అలా అంది. నువ్వు ఉన్నావని అనుమానం వచిందా ఏంటి? అని అడుగుతుంది. అనుమానం రాలేదు కానీ మనసుకు అర్థం అయింది. నేను తనను వశపరుచుకున్నాను కదా? అందుకే ఈ మంత్రించిన పొడి దగ్గరకు రాగానే తనకు అలా అనిపించింది అని చెప్తాడు ఘోర. అయ్యో నాకైతే ప్రాణం పోయినంత పనైంది. అరుంధతిని చంపడానికి కూడా నేను ఇంత కష్టపడలేదు ఘోర. దీన్ని బంధించే సరికి నా ప్రాణం పోయేలా ఉంది అంటుంది మనోహరి.

పిన్ను కోసం వచ్చిన అమ్ము ఇంకా రాలేదేంటని మిస్సమ్మ కిందకు వస్తుంది. హాల్లో కూర్చున్న అమ్మును చూసి ఏమైందని అడుగుతుంది. ఎందుకు డల్లుగా ఉన్నావని ప్రశ్నిస్తుంది. దీంతో అమ్ము పిన్ను కోసం నేను మనోహరి ఆంటీ రూంలోకి వెళ్లాను. అక్కడ నాకెందుకు భయంగా అనిపించింది. ఆంటీ కూడా ఏదోలా బిహేవ్‌ చేసింది. మరోసారి రూంలోకి వస్తే పర్మిషన్‌ తీసుకుని రావాలని చెప్తుంది అని రూంలో జరిగింది మొత్తం చెప్తుంది అమ్ము. అయితే అంజును రెడీ చేశాక నేను కనుక్కుంటాను పదా అంటూ అమ్మును తీసుకుని పైకి వెళ్తుంది మిస్సమ్మ.


గార్డెన్‌ లో అంజు కోసం గిఫ్ట్‌ రెడీ చేస్తున్న ఆరు.. రణవీర్‌ గిఫ్టు తీసుకుని రావడం గమనించి తిట్టుకుంటుంది. విధి చూశారా? గుప్త గారు ఎన్ని నాటకాలు ఆడుతుందో.. దూరం చేసిన వాళ్లను ఒక్కచోటకు చేరుస్తుంది. ఒకటి చేయాలని చూస్తున్నట్టుంది. నేను ఎప్పటికీ దగ్గర కానివ్వను అంజుకు వాళ్లు మధ్య గోడలాగా అడ్డునిలబడతాను. అంజు పుట్టుక గురించి ఎవ్వరికీ తెలియనివ్వను అంటుంది. గుప్త నవ్వుకుంటాడు. లోపలికి వెళ్లిన రణవీర్‌ను అమర్‌ పలకరిస్తాడు. అమర్‌ చేతిలో అంజు లాకెట్‌ ఉన్న పర్సు ఉంటుంది. అది చూసిన రణవీర్‌ అంజుకు గిఫ్టా సార్‌ అని అడుగుతాడు. అవునని అమర్‌.. అంజు లాకెట్‌ను రణవీర్‌కు చూపించబోతుంటే నిర్మల వచ్చి అంజుకు లాకెట్‌ వేయాలట ఇవ్వు అని తీసుకుని వెళ్తుంది.

గిప్ట్‌ తయారు చేస్తున్న ఆరును గుప్త హెచ్చిరిస్తాడు. బాలిక నా మాటను పెడచెవిన పెట్టి ఏమి చేయుచున్నావు అంటాడు.  చెప్పాను కద గుప్త గారు అంజు పాపకు గిఫ్ట్‌ ఇవ్వడానికి ఇది రెడీ చేస్తున్నాను అంటుంది ఆరు. నువ్వు ఈరోజు ఏ పని చేయకూడదు. ఏదీ ముట్టుకోకూడదు అని చెప్పాను అయినా వినడం లేదేంటి? అని గద్దిస్తాడు గుప్త. ఏంటి గుప్త గారు పోయిన జన్మలో మీరేమైనా హాస్టల్‌ వార్డెన్‌ గా పని చేశారా? ఏంటి. ఎందుకు ఎప్పుడు అది చేయకు ఇది చేయకు అంటుంటారు అంటూ కోప్పడుతుంది ఆరు. దీంతో బాలిక నువ్వు నన్ను ఏమి అనుకున్నా పర్వాలేదు. నీకు ఎటువంటి ప్రమాదం ఉందో నీకు తెలియడం లేదు  అని గుప్త హెచ్చిరస్తుంటే.. నీకు తల్లి ప్రేమ తెలియడం లేదు గుప్త గారు అని గిఫ్ట్‌ రెడీ చేస్తుంది ఆరు.

రూంలో ఉన్న  ఘోర మంత్రించిన పొడిని మనోహరికి ఇస్తాడు. ఆ ఆత్మతో ఈ పొడిని ముట్టుకునేలా చేస్తే.. ఆ ఆత్మ నాకు బంధీ అయిపోతుంది. నేను వెంటనే ఆత్మను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని చెప్తాడు. అయితే  ఆత్మ ఈ పొడిని ముట్టుకునేలా చేస్తాను. కానీ నువ్వు బయట ఉండి బంధించలేవా? అని అడుగుతుంది మనోహరి. బయట ఉండి బందించడం ఎంత ప్రమాదమో చెప్పాను కదా మనోహరి. అసలే ఆత్మకు స్పర్శ శక్తి కూడా వచ్చింది అని ఘోర బెదిరించడంతో అది కాదు ఘోర ఆత్మతో ఎలా అయినా ఉండొచ్చు. కానీ అమర్‌కు తెలిస్తే మనల్ని ఇక్కడే చంపేస్తాడు అని భయపడుతుంది మనోహరి.

నువ్వేం భయపడకు మనోహరి ఒక్కసారి ఆత్మ నాకు చిక్కిందంటే ఇక అమర్‌ కూడా మన కంట్రోల్‌ లోకి వస్తాడు అని ఘోర చెప్పగానే సరే అని పొడిని తీసుకుని నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి మనోహరి బయటకు వచ్చి డోర్‌ లాక్‌ చేస్తుంది. మనోహరి డోర్‌ లాక్‌ చేయడం చూసిన మిస్సమ్మ.. ఎందుకు డోర్‌ లాక్‌ చేస్తున్నావు మనోహరి అని అడగ్గానే మనోహరి షాక్‌అవుతుంది. ఎందుకు ఎప్పుడూ లేనిది ఇవాళ డోర్‌ లాక్‌ చేస్తున్నావు. నీ రూంలోకి రావాలంటే పర్మిషన్‌ తీసుకుని రావాలని చెప్పావట అని అనుమానంగా అడుగుతుంది మిస్సమ్మ.

మనోహరి నా రూం నాఇష్టం అడగడానికి నువ్వెవరు అంటూ మిస్సమ్మను తిడుతుంది. దీంతో మిస్సమ్మ ఈ ఇంటి కోడలును నేను అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో.. లోపల నా వస్తువలు ఎలా పడితే అలా వేస్తుంటాను. పిల్లలు ఇవాళ ఇంట్లోనే ఉన్నారు కదా? లోపలికి వెళ్లితే బాగోదని లాక్‌ చేశానని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది.

ఆరు, అంజుకు గిప్ట్‌ ఇవ్వడానికి రెడీ చేసిన  ప్యారెట్‌  బొమ్మను తీసుకుని లోపలికి వెళ్లబోతుంటే గుప్త ఆపుతాడు. ఆ బొమ్మలు నువ్వు మాత్రమే చేయగలవు అని నీ పిల్లలు తెలుసని.. ఆ విషయం పిల్లలు పసిగడితే పరిస్థితేంటని చెప్తాడు. అయినా సరే వినకుండా ఆరు ఇవ్వడానికి లోపలికి వెళ్లబోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం రచ్చ చేసిన శ్రీయా.. అన్నదమ్ముల మధ్య గొడవ..పల్లవి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today October 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన సందీప్‌ – డాక్టర్‌ కలవాలనుకున్న కావ్య

GudiGantalu Today episode: రోహిణి ప్లాన్ ఫెయిల్.. శృతికి తెలిసిన నిజం..ఇంట్లో రచ్చ చేసిన ప్రభావతి..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. ప్రేమ పై సీరియస్.. కోడళ్ల మధ్య ఫైట్..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Nindu Noorella Saavasam Serial Today September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం మనోహరి కొత్త ప్లాన్‌

TV: ఘోర విషాదం..పెళ్లి పీటలెక్కకుండానే నటి కాబోయే భర్త ఆత్మహత్య!

Brahmamudi Serial Today September 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య తాగే జ్యూస్‌లో అబార్షన్‌ టాబ్లెట్‌ కలిపిన రాజ్‌  

Big Stories

×