BigTV English

Brahmamudi Serial Today October 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అత్త  ప్లాన్‌ సక్సెస్‌ – ఒక్కటైన రాజ్‌, కావ్య

Brahmamudi Serial Today October 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అత్త  ప్లాన్‌ సక్సెస్‌ – ఒక్కటైన రాజ్‌, కావ్య

Brahmamudi serial today Episode:  కళ్యాణ్‌ ను చూసిన ధాన్యలక్ష్మీ  హ్యపీగా ఎదురెళ్లి పలకరిస్తుంది. అప్పును మాత్రం ఇన్‌డైరెక్టుగా తిడుతుంది. దీంతో కళ్యాణ్‌ అమ్మా నువ్విలాగే మాట్లాడితే ఇటు నుంచి ఇటే వెళ్లిపోతామని చెప్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ లోపలికి వెళ్లిపోతుంది. కళ్యాణ్‌, అప్పుకు సారీ చెప్తాడు. మా అమ్మా మాటలు పట్టించుకోవద్దని అంటాడు. అత్తయ్య మాటలకు నేనేమీ ఫీల్‌ అవ్వలేదని అప్పు చెప్తుంది.


కంగారుగా ఆఫీసుకు వెళ్లిన రాజ్‌, శరత్‌ను పిలిచి ఏమైందని అడుగుతాడు. శరత్‌ ఏమీ తెలియనివాడిలా మీరు దేని గురించి అడుగుతున్నారు సార్‌ అంటాడు. అదే ఎక్సెస్‌ గోల్డ్‌ గురించి ఫోన్‌ చేసి చెప్పారు కదా..? దాని గురించే అంటాడు రాజ్‌. దీంతో శరత్‌ నేను ఫోన్ చేయడం ఏంటి? సార్‌.. మీరు నిన్నే చెప్పారు కదా? ఇవాళ ఇంపార్టెంట్‌ పని ఉందని డిస్టర్బ్‌ చేయోద్దని అందుకే ఇవాళ ఉన్న మీ అపాయింట్‌మెంట్స్‌ వేరే డేట్‌కు ఫిక్స్‌ చేస్తున్నాను అంటాడు శరత్‌.

అదేంటయ్యా.. నువ్వే కదా నాకు ఫోన్ చేసి అర్జెంట్‌గా రండి సార్‌ అన్నారు ఇదిగో ఈ నెంబర్‌ నుంచే ఫోన్‌ చేశావు అంటూ నెంబర్‌ చూపిస్తాడు. దీంతో శరత్‌ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్‌. నేను ఫోనే చేయలేదు అంటాడు. ఎవరో మీకు ఎవరో రాంగ్‌ కాల్ చేసి ఉంటారు.. అని శరత్‌ చెప్పగానే రాజ్‌ సరే నువ్వు వెళ్లు అటాడు. తర్వాత రాజ్‌ గోల్డ్‌ గురించి శృతిని అడుగుతాడు.. ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదని శృతి చెప్తుంది.


ఇంట్లో దర్జాగా కూర్చున్న కనకం బంటితో కొబ్బరిబొండం తెప్పించుకుని తాగుతుంది. లోపలికి వచ్చిన అప్పు అనుమానంగా కనకాన్ని నిలదీస్తుంది. ఓ పక్క అక్కాబావ దూరంగా ఉన్నారు. మేము మీకు దూరంగా ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మీ పెళ్లి రోజు ఇంత గ్రాండ్‌ గా చేసుకోవడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో కనకం నాకేం తెలియదని అంతా అల్లుడుగారే చూసుకుంటున్నారని చెప్తుంది. కనకం. ఇంతలో మూర్తి రావడంతో అప్పు మూర్తితో మాట్లాడుతుంది. కనకం నేను సేఫ్‌ అయ్యాను అనుకుంటుంది.

అపర్ణ, ఇందిరాదేవి గుసగుసలాడుకుంటుంటే చాటు నుంచి వాళ్ల మాటలు వినాలని ట్రై చేస్తుంది రుద్రాణి కానీ ఒక్కమాట వినబడకపోయేసరికి రుద్రాణి ఏదో జరుగుతుంది అని టెన్షన్‌ పడుతుంది. ఇంతలో రాహుల్‌ వచ్చి ఏంటి మమ్మీ టెన్షన్‌ పడుతున్నావు అని అడుగుతాడు. టెన్షన్‌ కాక ఇంకేంటి రాజ్‌ ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారే తెలియదు. ఏం చెప్పి ఒప్పించారో తెలియడం లేదు.

మీ అత్తయ్యా.. అమ్మమ్మను చూస్తేంటే ఏదే సీక్రెట్‌ గా మాట్లాడుకుంటున్నారు అని రుద్రాణి చెప్పడంతో  ఇందులో సీక్రెట్‌ ఏముంటుంది. రాజ్‌ ను కావ్యను కలపడానికి  ఇదంతా చేస్తుంటారు అంటాడు రాహుల్‌. ఉండొచ్చు కానీ కావ్య మీద అంత కోపం ఉన్న రాజ్‌ ఇక్కడికి రావడానికి ఎలా ఒప్పుకున్నాడా? అని అనుమానంగా ఉంది అంటుంది రుద్రాణి. సరే ఏదో ఒకటి ఫంక్షన్‌ అయిపోయేలోపు తేలుద్దాం అంటుంది.

ఆఫీసు నుంచి రాజ్‌ డల్లుగా ఇంటికి రావడం గమనించిన ఇందిరాదేవి వెళ్లిన పని ఏమైందని రాజ్‌ను అడుగుతుంది. ఏం కాలేదు నాన్నమ్మా అంటూ లోపలికి వెళ్తున్న రాజ్‌తో అసలు మేనేజర్‌ నీకు ఫోనే చేయలేదనుకుంటా? అంటుంది అపర్ణ. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. నీకెలా తెలుసు మమ్మీ అంటూ అడుగుతాడు. ఎలా తెలుసంటే.. ఆ ఫోన్‌ చేయించింది నేనే కాబట్టి అని అపర్ణ నిజం చెప్పడంతో రాజ్‌ ఏంటి మమ్మీ నువ్వు అంటుంది.. అంటాడు.

మీ ఆఫీసు నుంచి నీకు ఫోన్‌ వస్తే నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా హడావిడిగా ఎలా వెళ్లిపోయావో.. ఆరోజు కావ్య కూడా అలాగే వెళ్లిపోయింది. కానీ నా అనుమతి తీసుకుని వెళ్లింది. ఆరోజు కావ్య వెళితే భయంకరమైన నేరంగా చూశావు కదా? అంటూ అపర్ణ చెప్తుంది. ఇంతలో ఇందిరాదేవి కలగజేసుకుని కావ్య అదే మాట చెబితే ఎన్ని మాటలన్నావురా? ఇప్పుడు ఆ మాటలు వెనక్కి తీసుకోగలవా? మేనేజర్‌తో మేం చేయించినట్టే కావ్యకు ఎవరో ఫోన్‌ చేయించి ఉండొచ్చు కదా? అంటుంది. దీంతో రాజ్,  కావ్యను తిట్టిన విషయం గుర్తు చేసుకుని బాధపడతాడు.

దూరంగా డోర్‌కు పూలమాల వేస్తున్న కావ్యను చూస్తాడు. మెల్లగా కావ్య దగ్గరకు వెళ్లి కావ్యను ఎత్తుకుని దండ త్వరగా కట్టు అంటాడు. దీంత అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి చూసి షాక్‌ అవుతుంది.  రాజ్‌, కావ్య మధ్య స్వీట్‌ వార్‌ జరుగుతుంది. ఇంతలో కావ్య చేతిలో పూలమాల జారి ఇద్దరి మెడలో పడుతుంది. వాళ్లిద్దర్ని చూసిన రుద్రాణి మొత్తానికి ఏదో జరుగుతుంది అనుకుంటుంది.

మూర్తి, కనకం వచ్చి దండలు మార్చుకుంటారు. వారి చేత కేక్‌ కట్‌ చేయిస్తాడు. రాజ్‌ అందరూ వాళ్లను విష్ చేస్తుంటారు. ధాన్యలక్ష్మీ, రుద్రాణి మాత్రం దూరంగా నిలబడి కోపంగా చూస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Big Stories

×