BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ మొదటి భార్యను నేనే అని మిస్సమ్మకు  చెప్పిన ఆరు – అమర్‌ను  పాలతో పడగొట్టిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today October 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ మొదటి భార్యను నేనే అని మిస్సమ్మకు  చెప్పిన ఆరు – అమర్‌ను  పాలతో పడగొట్టిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఇంట్లోంచి పరుగెత్తుకు వచ్చిన మిస్సమ్మ, ఆరును కోపంగా చూస్తూ అక్కా అని పిలుస్తుంది. దీంతో గుప్త హ్యాపీగా బాలిక రమ్ము వచ్చి ఈ బాలికను నీ అనుమానంతో సూటిపోటి మాటలతో వేధించు. ఇక్కడి నుంచి మా లోకానికి ఇప్పుడు వెళ్లేలా చేయ్‌ అంటుంటాడు. మిస్సమ్మ కోపంగా ఆరు దగ్గరకు వచ్చి ఈ సయయంలో మీరు మా ఇంట్లో ఎందుకున్నారు  అక్కా.. ఎప్పుడు చూసినా మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు. అసలు మీ ఇంట్లో వాళ్లు నిన్ను ఏమీ అనరా అక్కా అంటూ ప్రశ్నిస్తుంది.


ఆరు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే  చూస్తుండిపోతుంది. దీంతో మిస్సమ్మ ఏమైందక్కా ఏమీ మాట్లాడరేంటి? చెప్పండి. ఎందుకు ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఎప్పుడూ అందరినీ దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఎందుకు ఈ ఇంట్లో వాళ్లకు ఏమైనా అయితే బాధపడిపోతారు. నిజం చెప్పండి అక్క ఈ ఇంట్లో వాళ్లకు నీకు ఏంటీ సంబంధం అని అడుగుతుంది. దీంతో ఆరు సీరియస్‌ గా చూస్తూ.. చెప్తాను మిస్సమ్మ. అన్నీ చెప్తాను. ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తాను. నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నానో.. ఎందుకు మీ చుట్టూ తిరుగుతున్నానో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను మిస్సమ్మ అనగానే గుప్త టెన్షన్‌ పడతాడు.

నిజం చెప్పొద్దని నిజం తెలిస్తే జరిగే పరిణామాలు  ఘోరంగా  ఉంటాయని హెచ్చరిస్తాడు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకో.. అంటూ సూచిస్తాడు. గుప్త మాటలేవీ పట్టించుకోని ఆరు ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను మిస్సమ్మ. ఇంకా ఎన్ని రోజులు దాచాలో తెలియదు. అందుకే నువ్వు అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను. అంటూ ఈ ఇంటి మొదటి కోడలును నేనే మిస్సమ్మ అంటుంది. ఆయన మొదటి భార్యను నేనే.. ఆ పిల్లలకు తల్లిని కూడా నేనే యాక్సిడెంట్‌ లో చనిపోయింది కూడా నేనే అని ఆరు చెప్పేసరికి భాగీ, గుప్త షాక్‌ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు అక్కా అంటూ బతికి ఉన్న మీరు  చనిపోయిన ఆరు అక్కా ఎలా అవుతారు అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది.


మాట మార్చిన ఆరు వెంటనే అవ్వలేను. నేను ఆయన వైఫ్‌ ఎలా అవుతాను.  ఎప్పటికీ అవ్వలేను. నేనంటే నేను అని కాదు నేను అని అనుకుంటున్నానని కన్పీజ్‌ గా మాట్లాడుతుంది. తర్వాత తాను ఒక నవల రాస్తున్నట్టు అందులో  మేయిన్‌ క్యారెక్టర్‌  ఆరు అని అందుకే అలా ఫాలో అవుతున్నానని చెప్తుంది. దీంతో భాగీ సిగ్గుపడుతూ నాకు ఆయనకు ఏదైనా జరిగినట్టు కూడా చెప్పొచ్చు కదా అంటుంది. దీంతో ఆరు పాల గ్లాసుతో ఆయన  దగ్గరకు వెళ్లు అంటూ చెవిలో చెప్తుంది. దీంతో మిస్సమ్మ వెంటనే లోపలికి వెళ్లి  పాల గ్లాసు తీసుకుని సిగ్గుపడుతూ అమర్‌ దగ్గరకు వెళ్తుంది.

మిస్సమ్మను ఆపేందుకు వెనకాలే  వచ్చిన ఆరు పాల గ్లాసుతో అమర్‌ రూంలోకి వెళ్తున్న మిస్సమ్మను ఆపేందుకు  ట్రై చేస్తుంది. మిస్సమ్మ ఆగకుండా లోపలికి వెళ్తుంది. గుప్తగారు అంత ధైర్యం చెప్పుకుని లోపలికి వెళ్తుంది కదా ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. నేను వెళ్తాను లేండి  అంటుంది.  ఎచ్చటకు వెళ్లెదవు. ఇచటకు రమ్ము. ఉచిత సలహాలు  ఇచ్చితివి కదా? తదుపరి చలనచిత్రము ఎవరు చూచెదరు. అంటూ గుప్త బలవంతంగా ఆరును డోర్‌ దగ్గరకు తీసుకెళ్తాడు.

లోపల భాగీ పాల గ్లాసు అమర్‌కు ఇస్తుంది. అమర్‌ పాలు తాగుతుంటే ఏవండి ఇంట్లో అందరికీ పాలు ఇచ్చాను. నేను తాగడానికి పాలు లేవండి అంటుంది. దీంతో అవునా అయితే రాథోడ్‌ కు చెప్తాను షాపుకు వెళ్లి పాలు తీసుకురమ్మని అంటాడు. దీంత ఆరు ఇప్పుడు రాథోడ్‌ షాపుకు వెళ్లి పాలు తీసుకొచ్చేసరికి లేట్‌ అవుతుందని మీ గ్లాసులో పాలు ఉన్నాయి కదా అవి తాగుతాను అంటూ అమర్‌ చేతిలో గ్లాసు లాక్కుని పాలు  తాగుతుంది మిస్సమ్మ.

అమర్‌ ఏంటి మిస్సమ్మ నా ఎంగిలి తాగావు అంటాడు. ఇంతలో మిస్సమ్మ పెదవులకు పాల ఉండటంతో అక్కడ పాలు ఉన్నాయి తుడుచుకో అంటాడు. ఎక్కడ అంటూ ముఖం మీద పాలు  తుడుచుకుంటుంది మిస్సమ్మ. అక్కడ కాదు మిస్సమ్మ అంటూ పెదవులపై ఉన్న పాలను తుడుస్తాడు అమర్‌. దీంతో బయటి నుంచి చూస్తున్న ఆరు నేను ఈ ఘోరం చూడలేను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

New Movie in TV : ఫ్యామిలీ ఫ్యామిలీ తింగరోల్లే… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ టీవీలోకి… ఎప్పుడంటే?

Karthika Deepam: సోషల్ మీడియాలో హీటేక్కిస్తున్న వంటలక్క.. ‘కార్తీక దీపం’ టీమ్ కు బిగ్ షాక్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ దెబ్బకు ధీరజ్ షాక్.. వల్లికి కొత్త టెన్షన్..ప్రమాదంలో ఇరుక్కున్న ధీరజ్..

Nindu Noorella Saavasam Serial Today october 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అబార్షన్‌ చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్లిన మిస్సమ్మ  

Intinti Ramayanam Today Episode: గది కోసం రచ్చ చేసిన శ్రీయ.. ఇంట్లో పెద్ద గొడవ.. పల్లవి నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?

GudiGantalu Today episode: ఇంట్లో దీపావళి సంబరాలు.. కక్కుర్తి పడ్డ మనోజ్..రోహిణికి ఫ్యూజులు అవుట్..

Brahmamudi Serial Today October 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ జరిగేందుకు రుద్రాణి ప్లాన్‌  

Today Movies in TV : మంగళవారం మూవీ మస్తీ.. టీవీల్లోకి బోలెడు సినిమాలు..

Big Stories

×