BigTV English

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?
Relationships: కాలేజీ ప్రేమలు అన్నీ విజయవంతం కావు, కొన్ని బ్రేకప్‌కు దారితీస్తాయి. అలాంటప్పుడు ఇంట్లో పెద్దలు చూపించిన పెళ్లిని చేసుకోవాల్సి వస్తుంది. ఇలా వేరే వారి బంధం ఏర్పడిన తరువాత కూడా కొంతమంది తమ మాజీ లవర్‌తో టచ్ లో ఉండడం ప్రారంభిస్తారు. అది స్నేహంగానే ఉంటున్నట్టు మీరు భావించినా, అది ఒక్కోసారి మీ వివాహ జీవితానికి ప్రమాదకరంగా మారవచ్చు. మీ మాజీ తో సన్నిహితంగా ఉండడం మీ వివాహ జీవితానికి ఎలా ఇబ్బంది పెడుతుందో తెలుసుకోండి.
వివాహ జీవితమే ముఖ్యం
మీరు మీ మాజీ ప్రేయసితో లేదా ప్రేమికుడితో పరిచయంలో ఉన్నట్లయితే మీ ప్రస్తుత అనుబంధంలో సమస్యలు ఏర్పడవచ్చు. వారు మీరు మీ మాజీ లవర్‌తో మెసేజ్‌లు పంపుకోవడం, మాట్లాడుకోవడం అనేది నీ జీవిత భాగస్వామికి నచ్చకపోవచ్చు. వారు ఆ విషయాన్ని కష్టంగా తీసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత జీవితానికి ఎక్కువ విలువ ఇచ్చి మీ జీవిత భాగస్వామికి నచ్చని పనిని చేయకండి. మీ మాజీ లవర్‌తో టచ్‌లో ఉండడం మీ వివాహ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు.
అనుబంధాలు నాశనం కావచ్చు
మీరు పెళ్లి అయ్యాక కూడా మీ మాజీ లవర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లయితే అది మీ వివాహ బంధానికి చేటునే చేస్తుంది. వివాహ బంధంలో ఏదైనా గొడవలు, కష్టాలు ఎదురైతే మీకు వెంటనే గుర్తొచ్చేది మీ మాజీ లవరే. ఆమె సాన్నిహిత్యాన్ని మీరు కోరుకునే అవకాశం ఉంది. ఇది మీకు తెలియకుండానే కొన్ని బలహీన క్షణాల్లో జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాజీలతో ఎలాంటి సంబంధాలను పెట్టుకోకండి.
ప్రస్తుత బంధాలకే విలువివ్వండి
మీ మాజీ లవర్‌తో ఫోన్ సంభాషణలు మెసేజ్‌లతో టచ్‌లో ఉన్నట్టయితే అది నీ జీవితంలో అనవసరమైన గందరగోళానికి దారితీస్తుంది. మీ భాగస్వామి నుంచి ఆ మెసేజ్‌లను, ఫోన్ కాల్స్‌ను కాపాడుకునేందుకు మీరు ఎన్నో ఎత్తులు వేయాల్సి వస్తుంది. ఇది మీ వివాహ బంధంలో దూరాన్ని పెంచుతుంది. గత సంబంధాల కంటే ప్రస్తుత సంబంధాలే ముఖ్యమైనవి. కాబట్టి మీరు మీ మాజీ లవర్ ని దూరంగా పెట్టడం చాలా అవసరం.
వ్యామోహం మారవచ్చు
మనిషన్నాక తప్పులు చేస్తూనే ఉంటాడు, బలహీనమైన లక్షణాలు వస్తూనే ఉంటాయి. మీ మాజీ లవర్‌తో మీరు స్నేహపూర్వకంగా ఉందామనుకున్నా ఏదో ఒకరోజు అది వ్యామోహంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీ వ్యక్తిగత జీవితమే నాశనమైపోవచ్చు. మీతో పాటు మీ జీవిత భాగస్వామిది కూడా నాశనం కావచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్తగానే మీరు మీ మాజీ ప్రేమికులతో దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం.
మీరు ఒక్కసారి ఊహించుకోండి. మీ జీవిత భాగస్వామి మీకు తెలియకుండా అతను లేదా ఆమె మాజీ ప్రేమికులతో టచ్‌లో ఉంటే మీ మనసుకు ఎంత బాధ కలుగుతుందో, ఆ బాధను మీరు మీ జీవిత భాగస్వామికి ఇవ్వకండి. ఆమె లేదా అతనితోనే మీరు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. గత జీవితాన్ని తవ్వి వర్తమానంలోకి లాక్కొచ్చి భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఉన్నంతలో మీ మాజీతో దూరంగా ఉండండి. ప్రస్తుత బంధానికి విలువ ఇవ్వండి.


Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×